Illu Illalu Pillalu Today Episode may 31st: నిన్నటి ఎపిసోడ్ లో.. ధీరజ్ ఉన్న ఫుడ్ డెలివరీ ఏంటో తెలుసుకొని ఆర్డర్ పెట్టమని తన ఫ్రెండ్స్ కి అడుగుతాడు. ధీరజ్ చేత ఫుడ్ ని తీసుకొచ్చే ప్రయత్నం సక్సెస్ అయ్యేలా చేస్తాడు. ధీరజ్ ని అడ్రస్ చెప్తూ ఒక ఆట ఆడుకుంటారు విశ్వం అండ్ ఫ్రెండ్స్. చివరికి ధీరజ్ అక్కడికి రాగానే విశ్వం తన విశ్వరూపం చూపిస్తాడు. ధీరజ్ ని ఎలాగైనా సరే దారుణంగా అవమానించాలని కావాలని గెలుకుతాడు. ఫుడ్ ని కింద పడేసి బాడ్ రివ్యూ యువర్ అని చెప్పేసి పెడతానంటూ బెదిరిస్తాడు. ధీరజ్ భయపడి వద్దు సార్ నాదే తప్పు లేట్ అయినందుకు అని రిక్వెస్ట్ చేస్తాడు. మాట వినకుండా ధీరజ్ ను అవమానిస్తారు.. ఇక ఇదంతా చూసిన ప్రేమ విశ్వం ఫ్రెండ్ ని దారుణంగా కొడుతుంది. ధీరజ్ ఇప్పుడు నా భర్త.. తనకి ఇలా అవమానిస్తే మేము అసలు ఒప్పుకోమంటు తిడుతుంది. ఎక్కువ మాట్లాడాలంటే బ్యాగులో కూరగాయలు కత్తి తెచ్చి కోసేస్తాను అంటూ ప్రేమ విశ్వం ఫ్రెండ్స్ కి వార్నింగ్ ఇస్తుంది.. అయితే అరే విశ్వం నీ చెల్లెలు అనంతపని చేస్తుంది రా మేము వెళ్ళిపోతున్నామని అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. ప్రేమ విశ్వం కు వార్నింగ్ ఇస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీవల్లి ఇంట్లో భోజనాల సంగతి చూసుకుంటూ అన్ని అయిపోయాయి ఇక అన్నం ఒకటి చేస్తే సరిపోతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది.. అప్పుడే తన చెల్లెలు బుజ్జి ఇంటికి వస్తుంది. సడన్ గా ఇక్కడికి వచ్చావు అంటే ఇది మా అక్క ఇల్లు నేను రాకుండా ఉంటే బాగోదు కదా.. నా అక్క ఇంటికి నేను రావడానికి పర్మిషన్ తీసుకోవాలి ఏంటి అని అంటుంది.. నీకు ఏం కావాలో చెప్పు నేను చేసి పెడతానని అంటుంది శ్రీ వల్లి.. చందు ఆఫీస్ కు సేటు వెళ్లి వెంటనే 10 లక్షలు కావాలని అడుగుతాడు. కానీ చందు మాత్రం నాకు ఇస్తానన్న వాళ్ళ ఇంకా ఇవ్వలేదు సేటు నాకు ఒక నెల టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తాడు. ఇదంతా కాదు నేను రామరాజు దగ్గరే అన్ని తేల్చుకుంటానని సేటు అంటాడు. ఇక శ్రీవల్లి హనీమూన్ గురించి తన చెల్లి హింట్ ఇస్తుంది.
అప్పుడే చందు ఇంట్లోకి వస్తాడు. వచ్చి రాగానే శ్రీవల్లిని అరుస్తాడు.. ఏమైంది బావ నేను ఒక విషయం చెప్పాలి నీకు ముందు అని శ్రీవల్లి అడుగుతుంది. నువ్వు నా టెన్షన్ అర్థం చేసుకోవేంటి నేను నీకు ఒక విషయాన్ని చెప్పాలని చందు అంటాడు.. ముందు నేను చెప్పేది వినాలి బావ అనేసి శ్రీవల్లి అడుగుతుంది. అయితే ఏంటి చెప్పు అని చందు అడుగుతాడు. మనిద్దరం హనీమూన్ కి వెళ్దాం బావ అని అడుగుతుంది. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్లారు కదా బావ మనం కూడా వెళ్దామని అంటే దానికి బోలెడు డబ్బులు అవుతాయని చందు అంటాడు.
ప్రతి నెల నువ్వు డబ్బులు ఇస్తావు కదా ఒక నెల ఇవ్వకుండా మావయ్య గారికి చెప్తే ఒప్పు కూడా ఏంటి అని శ్రీవల్లి అంటుంది. దాని సంగతి పక్కన పెట్టు నేనొక విషయం చెప్పాలని చందు సేట్ వచ్చిన విషయాన్ని చెప్తాడు. మరో నెలలో 10 లక్షలు ఇవ్వాలని చెప్పాడు అర్జెంటుగా మీ అమ్మకు ఫోన్ చేసి ఆ పది లక్షలు అడుగు అని శ్రీవల్లికి చెప్తాడు. ఆ మాట వినగానే శ్రీవల్లి గుండె ఆగినంత పని అవుతుంది. ఏడుస్తూ బయటికి వెళ్లి కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన బుజ్జి ఏమైంది అక్క అని అడుగుతుంది ఆయన తెచ్చిన 10 లక్షల గురించి సెట్ వచ్చి అడిగాడు అంట అమ్మని అడగాలంటే నాకు భయమేస్తుంది.. ఏదో ఒకటి మేనేజ్ చెయ్ అని చెప్తుంది తప్ప ఆ డబ్బులు ఇవ్వలేదు.
ఆయనంటే నాకు చాలా ఇష్టం ఆయనకు దూరమవలసిన పరిస్థితి వస్తే నా ప్రాణం తీసుకుంటాను అని శ్రీవల్లి అంటుంది. ఏం భయపడకే బాబు అమ్మ ఏదో ఒకటి చేస్తుంది అని బుజ్జి అంటుంది. ఏదో ఒక లాగా ఈ గండ నుంచి బయటపడాలని శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని భాగ్యంకు చెప్పాలని అనుకుంటుంది. ఇద్దరు మాట్లాడుకోవడానికి నర్మదా ప్రేమ చాటుగా వింటారు. ఏదో 10 లక్షల మేటర్ వచ్చింది అక్క వీరిద్దరూ దానికోసమే టెన్షన్ పడుతున్నట్టున్నారు అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటారు.
అప్పుడే రీల్స్ చేస్తున్న బుజ్జిని చూసి ఈ చిన్న చేపకి వల వేస్తే మనకి అసలు విషయం తెలుస్తుంది అని ప్రేమ నర్మదా అనుకుంటారు.. బుజ్జి దగ్గరికి వెళ్లి డాన్స్ వేస్తూ అసలు విషయం కనుక్కోవడానికి ప్రయత్నిస్తారు కానీ బుజ్జి మాత్రం ఏడుస్తూ శ్రీవల్లికి అసలు నిజం చెప్పేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో శ్రీవల్లి నర్మదా ప్రేమలపై సీరియస్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో ప్రేమ, ధీరజ్ ల మధ్య ప్రేమ గురించి నర్మదా తెలుసుకుంటుంది.. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..