Nindu Noorella Saavasam Serial Today Episode: గార్డన్‌లో ఉన్న మిస్సమ్మ దగ్గరకు ఆరు ఫోటో తీసుకుని వెళ్తుంది అమ్ము. దూరం నుంచే అమ్మ ఫోటో చూద్దువురా అని పిలుస్తుంది. మిస్సమ్మ హ్యాపీగా పరుగెత్తుకుంటూ వస్తుంది. అమ్ము చేతిలో ఫోటో తీసుకోబోతుంటే.. వెనక నుంచి చూస్తున్న అనామిక, మనోహరి టెన్షన్ పడుతుంటారు. ఇంతలో అమర్ వచ్చి ఫోటో తీసుకుంటాడు. మనోహరి, అనామిక ఊపిరి పీల్చుకుంటారు. అమర్ కోపంగా చూస్తుంటే.. అమ్ము సారీ డాడ్ అని చెప్తుంది. దీంతో అమర్ మీకు ఇది ఎక్కడిది అన్ని ఫోటోస్ దాచేశాను కదా మీకు ఇది ఎక్కడికి అమ్ము అని అడుగుతాడు. అంటే కొడైకెనాల్‌లో అమ్మ నాకు ఇచ్చింది. అప్పటి నుంచి నా దగ్గరే దాచుకున్నాను అని అమ్ము చెప్తుంది. అమ్మ ఫోటో మీరు చూడకూడదని దాచేయలేదు. అమ్మను చూసినప్పుడల్లా మీకు గుర్తొచ్చి బాధపడతారని దాచేశాను అంటాడు అమర్.
దీతో అమ్ము సారీ డాడ్ అమ్మను రోజూ చూడొచ్చని ఆ ఒక్క ఫోటో మాత్రం నా దగ్గరే పెట్టుకున్నాను డాడ్. ఆరోజు మీకు ఇవ్వనందుకు రియల్లీ సారీ డాడ్ అంటుంది. వెనక నుంచి చూస్తున్న మనోహరి ఆ ఫోటో అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపో అమర్ ఫ్లీజ్.. అనుకుంటుంది. అనామిక కూడా అవునండి వెళ్లిపోండి.. తీసుకెళ్లిపోండి అని మనసులో అనుకుంటుంది. అమర్ ఫోటో తీసుకుని వెళ్లిపోతాడు. అసలు అక్క ఫేస్ చూసే అదృష్టం ఈ జన్మకు లేనట్టుంది. ఆరు అక్క ఫోటో ఇప్పటి వరకు చూడలేదంటే బాగోదు. మరి ఫోటో చూపించమని ఎలా అడగాలి అని మిస్సమ్మ మనసులో అనుకుంటూ బాధపడుతుంది. అమ్ము సారీ మిస్మమ్మ అని చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత రూంలో ఒంటరిగా ఉన్నా అంజు అమ్ము వాళ్లను పిలుస్తుంది అప్పుడే పైకి వెళ్తున్న మనోహరి చూసి ఏమైంది అంజు అమ్ము వాళ్లు కింద ఆడుకుంటున్నారు అని చెప్తుంది. దీంతో ఆంటీ మిస్సమ్మ ఎక్కడుంది అని అడుగుతుంది. తను కిచెన్‌లో ఉంది. ఏమైనా కావాలా..? అని అడుగుతుంది.
ఏం లేదు కానీ రణవీర్ అంకుల్ గురించి ఒక విషయం చెప్పాలి అంటుంది. దీంతో మనోహరి షాకింగ్‌గా ఏ విషయం చెప్పాలి అని అడుగుతుంది. నన్ను కిడ్నాప్ చేసింది రణవీర్ అంకులేమో అని డౌటుగా ఉంది అంటుంది. దీంతో మనోహరి మరింత షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు అంజు అసలు రణవీర్ గారు నిన్ను ఎందుకు కిడ్నాప్ చేస్తారు. నువ్వంటే ఆయనకు ఎంత ఇష్టమో.. ఈ విషయం మీ డాడీకి తెలిస్తే మళ్లీ రణవీర్ అంకుల్‌ను ఇంటికి రానివ్వడు.. మళ్లీ మిమ్మల్ని కూడా కలనివ్వరు అంటుంది. దీంతో అంజు మరి నాకు ఈ డౌటు క్లియర్ అవ్వాలంటే రణవీర్ అంకుల్‌తోనే మాట్లాడాలి కదా.. అంకుల్‌కు కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్తారా..? అని అడుగుతుంది. దీంతో మనోహరి ప్లాన్ చేస్తుంది.
అంజుకు ఏదో ఒకటి చెప్పి రణవీర్ ఇంటికి పింపిస్తే అప్పుడిక అంజును రణవీర్ తీసుకెళ్లిపోవడం ఈజీ అవుతుంది. చేతికి మట్టి అంటకుండా పని పూర్తి అయిపోతుంది. అని మనసులో అనుకుని అంకుల్‌ను ఇక్కడకు పిలిస్తే అందరూ ఇంట్లోనే ఉంటారు కదా..? ఒక పని చేయ్ నువ్వే రణవీర్ అంకుల్ ఇంటికి వెళ్లి అడుగు అని చెప్తుంది. నేనా నేను ఎలా రణవీర్ అంకుల్ ఇంటికి వెళ్లను డాడీ ఇంట్లోంచే పంపించరు కదా అంటుంది అంజు. చెప్పకుండా వెల్లిపోతే ఎలా ఆపుతారు అంటూ అంజును తన మాటలతో రెచ్చగొడుతుంది. దీంతో అంజు ఒక్కతే చెప్పకుండా వెళ్లడానికి రెడీ అవుతుంది. అయితే నువ్వు కిందకు వెళ్లు నేను ఆటో బుక్ చేస్తాను తను నిన్ను రణీవీర్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అని చెప్తుంది. అంజు సరే అంటూ వెళ్లిపోతుంది. మనోహరి వెంటనే రణవీర్‌కు కాల్ చేసి చెప్తుంది.
తర్వాత ఇంట్లో అంజు కనిపించడం లేదని మిస్సమ్మ కంగారుగా అమర్‌కు ఫోన్ చేసి చెప్తుంది. సీసీటీవీ చెక్ చేయ్ అని చెప్తాడు. చెక్ చేశానని అంజు ఒంటరిగా నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయింది. అని చెప్తుంది. దీంతో అమర్ షాక్ అవుతాడు. మరోవైపు రణవీర్ అంజును తీసుకుని కొల్ కతా వెళ్లి అక్కడ కోర్టులో ఉంటాడు. జడ్జి పాపను పలిపించండి అని చెప్పగానే.. లాయర్ అమ్మా దుర్గా ఇటు రామ్మ అని పిలుస్తాడు. అంజు రాగానే జడ్జి నీ పక్కన బోనులో ఉన్నది ఎవరు అని రణవీర్‌ను చూపిస్తూ అడుగుతాడు. అంజు ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్‌గా చూస్తుంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?