BigTV English

Bigg Boss:ఆ నటుడుని మోసం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఏకంగా ఎన్ని లక్షలంటే ?

Bigg Boss:ఆ నటుడుని మోసం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఏకంగా ఎన్ని లక్షలంటే ?

Bigg Boss:ప్రముఖ నటుడు చంద్రశేఖర్ అనగానే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు కానీ ఛత్రపతి శేఖర్ (Chatrapathi Shekhar) అంటే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు. రాజమౌళి(Rajamouli ) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా వచ్చిన ఛత్రపతి సినిమా ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇకపోతే దాదాపు రాజమౌళి సినిమాలన్నింటిలో కూడా చంద్రశేఖర్ కనిపిస్తారు అనడంలో సందేహం లేదు. అలాంటి ఛత్రపతి శేఖర్ తాజాగా బిగ్ బాస్ బ్యూటీ గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనను మోసం చేసింది అంటూ తెలిపారు. మరి ఆ బిగ్ బాస్ బ్యూటీ ఎవరో ఇప్పుడు చూద్దాం.


ఛత్రపతి శేఖర్ మోసం చేసిన కీర్తి భట్

ప్రముఖ సీరియల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ కీర్తి భట్ (Keerthy Bhatt) హీరోయిన్గా నటించిన ‘మనసిచ్చి చూడు’ సీరియల్ లో ఆమెకు తండ్రిగా నటించారు చంద్రశేఖర్. అయితే రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా వీళ్ళిద్దరి మధ్య తండ్రీ కూతుర్ల బాండింగ్ ఉండేది. కీర్తికి పేరెంట్స్ లేకపోవడంతో చంద్రశేఖర్ ను నాన్న అని పిలిచేది. అటు చంద్రశేఖర్ కూడా కీర్తి ని బిడ్డ అని చాలా ఆప్యాయంగా చూసుకునేవారు. అయితే అలాంటి సమయంలో కీర్తి భట్ ప్రియుడుతో ఎంగేజ్మెంట్ చేసుకోవడం, ఆ ఎంగేజ్మెంట్ కి తండ్రి లాంటి చంద్రశేఖర్ రాకపోవడంతో సీరియల్ వర్గాలలో చాలానే గుసగుసలు వినిపించాయి. ఇకపోతే మనసిచ్చి చూడు సీరియల్ సమయంలో చంద్రశేఖర్ దగ్గర కీర్తి భట్ లక్షల రూపాయలు అప్పు చేసిందని, అవి తిరిగి ఇవ్వకుండా మోసం చేసిందని.. అందుకే చంద్రశేఖర్ ఆమె నిశ్చితార్ధానికి కూడా వెళ్లలేదని కామెంట్లు వినిపించాయి.


అబద్ధం చెప్పి డబ్బులు తీసుకొని అంటూ..

అయితే ఆ సమయంలో ఎవరూ కూడా స్పందించలేదు. కానీ తాజాగా చంద్రశేఖర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కీర్తి భట్ ఒక్కతే కాదని, తన దగ్గర చాలామంది డబ్బులు తీసుకొని అబద్ధాలు ఆడారని, మనసిచ్చి చూడు సీరియల్ ద్వారా తనకు వచ్చిందానికంటే మిగిలిన అప్పులే ఎక్కువ అని అసలు విషయాన్ని బయటపెట్టారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ..” కీర్తితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆ పిల్లకి తల్లిదండ్రులు లేరు. కాబట్టి నన్ను తండ్రి అని ఫిక్స్ అయిపోయింది. నేను కూడా పాపం ఎవరూ లేని పిల్లా అని పెద్ద కూతురు లాగానే చూసుకున్నాను.కానీ ఆమెకు రాను రాను వేరే పరిచయాలు ఏర్పడడంతో మా మధ్య దూరం పెరిగింది. ఆ పిల్ల ఎంగేజ్మెంట్ కి నాకు ఫోన్ చేసింది. షూటింగ్లో కూడా కలిసి చెప్పింది. తప్పకుండా రావాలి నాన్న అని.. అయితే నేను వస్తానని చెప్పాను. కానీ ఆ రోజే నా స్కూల్ మేట్స్ అంతా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నాము.. దావత్ కూడా పెట్టుకున్నాం.. ఇక దావత్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా.. అయితే అదే రోజు ఎంగేజ్మెంట్ కావడం చేత నేను అలా తాగి వెళ్తే తను నా మొహం చూసి అప్సెట్ అవుతుంది. అందుకే కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయకూడదని నేను వెళ్లలేదు. ఆ తరువాత నాకు ఫోన్ చేయకుండా మా డ్రైవర్ కి ఫోన్ చేసి నాన్న వచ్చినందుకు థాంక్స్ అని ఫోన్ పెట్టేసింది. తర్వాత నేను ఫోన్ చేసినా తను లిఫ్ట్ చేయలేదు. ఇక ఇన్నాళ్ల తర్వాత మళ్లీ టచ్ లోకి వచ్చింది. ఇకపోతే నా దగ్గర నాలుగు లక్షలు తీసుకొని మోసం చేసిందని కామెంట్ చేశారు. అది ఎవరో మా వాల్లే అయి ఉంటారు. ఎందుకంటే నేను తాగినప్పుడు నోరు విప్పి ఉంటాను. నా బాధ డబ్బులు ఇచ్చినందుకు కాదు అబద్ధం చెప్పినందుకు.. ఆమెకు కష్టం వచ్చిందంటే ఇప్పటికీ సహాయం చేస్తాను. కానీ అబద్ధాలు చెప్పడం నాకు నచ్చలేదు. ఆమె ఒక్కతే కాదు చాలామంది నాతో అబద్ధాలు చెప్పేవారు అంటూ తెలిపారు చంద్రశేఖర్. మొత్తానికి అయితే అబద్ధం చెప్పి డబ్బులు తీసుకొని తనను మోసం చేసిందని ఇండైరెక్టుగా చెప్పారు. ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

also read:Krishna Birth anniversary: ఆస్ట్రేలియాలో అలాంటి అరుదైన ఘనత కృష్ణకే సాధ్యం.. ఏంటంటే?

Related News

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Soniya Akula : యష్ ను అందుకే పెళ్లి చేసుకున్నా.. ఇన్నాళ్లకు బయటపెట్టిన సోనియా..

Bigg Boss Siri: పెళ్లి కాకుండానే వరలక్ష్మి వ్రతం.. బిగ్ బాస్ సిరిని తిట్టిపోస్తున్న జనం

Big Stories

×