Illu Illalu Pillalu Today Episode may 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. సాగర్ నర్మదాలు బైక్ మీద వెళ్తారు. నర్మదను సాగర్ ఆఫీస్ దగ్గర దిగబెడతారు. మీరు ఆఫీస్ వచ్చేసింది దిగితే నేను వెళ్తానండి అని సాగర్ కాసేపు సరదాగా మాట్లాడుతాడు. నర్మద మాత్రం సాగర్ పై సీరియస్ గానే ఉంటుంది. నేను ఒక విషయం గురించి అడుగుతాను మీరు నిజం చెప్తారా అని అడుగుతుంది. ఏమైంది అంటే మన పెళ్లి అయింది అంటే నాకు పెళ్లి గురించి అన్ని డేట్లు గుర్తున్నాయి రోజు నిమిషాలతో సహా గుర్తుంది అని చెప్తాడు. నర్మదా ఇన్నిరోజులలో ఒక్కరోజేనా నన్ను సరదాగా బయటికి తీసుకెళ్ళారా కనీసం ఈ ఊరు నుంచి దాటించారా అని అడుగుతుంది. ఇద్దరం కలిసి సరదాగా అలా బయటకెళ్ళి చూద్దాం సాయంత్రం కచ్చితంగా మనం రెస్టారెంట్ కి వెళ్దామని సాగర్ అంటాడు. నమ్మొచ్చా అని నర్మదా అంటుంది ఖచ్చితంగా నమ్ము అని సాగర్ అంటాడు. కానీ ఈ విషయమే రామరాజుకు చెప్తే చాలా పని ఉంది ఇంకొకరోజు పెట్టుకోమని చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. సాగర్ రెస్టారెంట్ కి వెళ్ళాలి అని పర్మిషన్ తీసుకుంటాడు. రామ రాజు మాత్రం నాలుగు రోజులు మిల్లు తెరవలేదు చాలా పనులుంటాయి నువ్వు ఇలాంటి టైం లో ఇలా బయటికి అని తిరుగుతావా ముందు లోడ్లు చాలా ఉన్నాయి పంపించాల్సినవి మన మీద నమ్మకం పోకుండా చూసుకోవాలి కదా అనేసి అరుస్తాడు.. నర్మద మాత్రం సాగర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈయన కోసం వెయిట్ చేస్తే నాకు బీపీ పెరగడం తప్ప ఇంకేమి ఉండదు. రైస్ మిల్ లో పని ఉన్నట్టుంది అందుకే రాలేకపోయాడు ఏమో అని అనుకుంటుంది.. ఈ విషయాన్ని ఫోన్ చేసి చెప్తే సరిపోయేది కదా ఇంతసేపు వెయిట్ చేసేదాన్ని కాదు కదా ఇంకా వెయిట్ చేస్తే నాకు బిపి పెరుగుతుంది అని నర్మదా వెళ్ళిపోతూ ఉంటుంది.
అప్పుడే అక్కడికి సాగర్ వస్తాడు.. నీకోసం వెయిట్ చేసి చేసి వెళ్లిపోదామని అనుకుంటున్నా మరి వచ్చావ్ ఏంటి అని నర్మదా అడుగుతుంది. చెప్పాను కదా మరి నువ్వు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు అని సాగర్ అంటాడు. పెళ్లి వల్ల నాలుగు రోజులు రైస్ మిల్లును మూసేశాను కదా చాలా ఆర్డర్లు పెండింగ్ లోనే ఉండిపోయాయి వాళ్ళందరూ ఫోన్లు చేసి తొందరగా లోడ్లు పంపించాలని అడుగుతుంటే అదే పనిలో బిజీగా ఉన్నాము అందుకే రాలేకపోయాను. మరి ఈ విషయాన్ని ముందే చెప్పాలి కదా సాగర్ అని నర్మదా అడుగుతుంది. మరేం పర్లేదు నీ కోసం నేను వచ్చాను అని ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి వెళ్తారు.
ధీరజ్ వాటర్ క్యాన్లను వేసి బండిని ప్లాంట్ దగ్గర పెట్టాలని వెళతాడు. అక్కడ ఓనర్ కి బండి తాళాలు ఇస్తాడు. ఏమైంది ధీరజ్ అంటే నేను చెప్పాను కదా అన్న తర్వాత నెల నుంచి నేను వేరే పార్టీ జాబ్ చూసుకుంటాను. కాలేజీకి వెళ్లాలని చెప్పాను కదా అనేసి చెప్తాడు. అవునవును సరే నువ్వు కాలేజీకి అన్నావు కదా వెళ్ళు ఇదిగో ఈ నెల జీతం.. నీలాగే కష్టపడి పని చేసేవాళ్ళు నాకు మళ్ళీ దొరకరు కానీ కాలేజీలో చదువుకోవాలి అనుకుంటున్నావు కదా మంచిగా చదువు అనేసి ఆయన అక్కడి నుంచి పంపిస్తాడు.
డబ్బులను చేతికి తీసుకున్న ధీరజ్ ప్రేమకి నేను ఇంతవరకు ఏది కొనలేదు ఒక డ్రెస్ అయినా కొనాలని అనుకుంటాడు. షాప్ కి వెళ్తాడు. అక్కడ అతను సైజు అడగడంతో ఏ సైజు అని ప్రేమకు ఫోన్ చేస్తాడు. కానీ ప్రేమ మాత్రం తప్పుగా అర్థం చేసుకొని ధీరజ్ని బండ బూతులు తిడుతుంది.. ఆ షాప్ అతను మీ ఆవిడ సన్నగా ఉంటుందా లావుగా ఉంటుందని అడిగితే ప్రేమ గురించి గొప్పగా అతనికి వర్ణిస్తాడు. అతనికి ఒక డ్రెస్ ని సెలెక్ట్ చేసి ప్రేమ కోసం తీసుకెళ్తాడు..
సాగర్ ప్రేమ ఇద్దరూ ఎంతో ఆనందంగా రెస్టారెంట్ కి వస్తారు. తమకు రావలసిన ఫుడ్ ని ఆర్డర్ చేసి సరదాగా మాట్లాడుకుంటూ తింటుంటారు. రామరాజు ఫోన్ చేస్తే సాగర్ భయపడిపోతాడు. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే నాన్న నన్ను తిడతాడు పర్మిషన్ ఇవ్వమంటే పర్మిషన్ ఇవ్వలేదు చెప్పకుండా వచ్చేసానని అంటాడు. సరే మరి తినేసి వెళ్ళిపోదులే అని నర్మదా అంటుంది. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ తింటారు.
రామరాజు బియ్యం గురించి డీల్ మాట్లాడ్డానికి అ రెస్టారెంట్ కి వస్తాడు. వాళ్లు బియ్యం కావాలని డబ్బులు ఇస్తారు. అక్కడున్న సాగర్ నర్మదలను రామరాజు చూసేస్తాడు. సాగర్ కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. దాంతో రామరాజు సాగర్ పై సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక సాగర్ బిల్లు కట్టాలని నర్మదని అడుగుతాడు. నాకు ఏం కావాలన్నా నాన్నని అడుగుతాను ఆయన డబ్బులు ఇస్తే నేను తీసుకుంటాను ఇప్పుడు ఆయనకు చెప్పకుండా వచ్చాను కదా నేను డబ్బులు తీసుకురాలేదని అంటాడు. ఏంటి ఎనిమిది వందలు కూడా నీతో లేవా అని నర్మదా అరిచి ఆ డబ్బులు తను పే చేస్తుంది. అక్కడినుంచి వెళ్ళిపోతుంటే సాగర్ నర్మద వెనకాలే వెళ్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ప్రేమకు తెచ్చిన డ్రెస్ నీ ప్రేమ వేసుకోవడం చూసి సరదాగా మురిసిపోతాడు ధీరజ్.. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..