Illu Illalu Pillalu Today Episode November 2nd : ధీరజ్ అలాగే తిరుపతి ఇద్దరు కూడా ప్రసాదం తీసుకుని తింటూ ఉంటారు. అప్పుడే అక్కడ అంజలి కనిపించడంతో ఆమె దగ్గరికి వెళ్తాడు. అయితే ధీరజ్ని చూసిన అంజలి అటు వెళ్లిపోతూ ఉంటుంది. కానీ ధీరజ్ మాత్రం మీరు అంజలి కదా అని అడుగుతాడు. అయితే అది చూసిన సాగర్ కూడా ఇప్పుడు అంజలి గురించి మనం చెప్తే వాడు చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు అని అనుకుంటాడు. ఆమె తను వదిలేసి వెళ్ళిపోయింది అని చాలా బాధపడుతున్నాడు ఇప్పుడు మళ్లీ ఆమె తన లైఫ్ లోకి వస్తుందేమో అని ఆశపడడు ఇప్పుడు వాడికి చెప్తే చాలా బాధపడతాడు అని ధీరజ్ అంజలి గురించి చెప్పకుండా ఉంటాడు. ఇక బతుకమ్మ దగ్గర రామరాజు కుటుంబం బతుకమ్మ ఆడేందుకు ఎదురుచూస్తూ ఉంటారు. అయితే భద్రత తన మనుషులతో వచ్చి అక్కడ రచ్చ చేసి పరువు తీస్తుందా? లేదా భాగ్యం తన కూతురు జీవితం నాశనం అవుతుంది అని ఊరందరి ముందు రామరాజు పరువును తీస్తుందా అన్నది సస్పెన్స్కు గా మారింది..
ఇక గుడిలో ఉన్న ధీరజు అటు ఇటు చూస్తూ ఉండడం చూసి ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇది నేను ఎంత చేసినా కూడా తక్కువే అనిపిస్తుంది. మీరు ఎప్పుడు చూసినా అమ్మాయిలని చూస్తూనే ఉంటాడు కొంచెం కూడా వీడికి బుద్ధి లేదు అంటూ ప్రేమ కోపంగా ఉంటుంది.. అంతే కాదు ఎలాగైనా సరే వీడికి బుద్ధి చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ప్రేమ. అక్కడ ముద్ద కనిపించడంతో ప్రేమ దేనికోసమే వీడు ఇలా వచ్చాడన్నమాట నాకు అర్థం అయిపోయింది అని ధీరజ్ దగ్గరికి వెళ్లిన ప్రేమ ఒక్కసారిగా అటు చూసి నువ్వు దాని కోసం ఇక్కడికి వచ్చావు కదా నీకు ఎంత చెప్పినా బుద్ధి రాదు రా.. నీ చేతులు కట్టేసి ఈ బతుకమ్మ ఉత్సవం అయ్యేంతవరకు నిన్ను ఇలానే ఉంచాలి అప్పుడే నీకు బుద్ధి వస్తుంది అని తన చీర కొంగుతో చేతులు రెండు కట్టేస్తుంది ప్రేమ.
ధీరజ్ గుడిలోకి వెళ్ళగానే అక్కడ ఉన్న పూజారి తో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా చూసి భర్తని కొంగును మూడేసుకోవడం అంటే ఇదే అని అంటారు. అయితే ధీరజ్ మాత్రం చూడవే అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు కట్టిపోవే అని ఎంతగా బ్రతిమలాడినా సరే ప్రేమ మాత్రం అస్సలు వెనక్కి తగ్గదు. బతుకమ్మ రోజు బట్టల ఆశీర్వాదం తీసుకుంటే మీ ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుంది అని పంతులుగారు చెప్పడంతో అందరూ తమ భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారో కానీ వల్లికి మాత్రం ఘోర అవమానం జరుగుతుంది. వలి తన భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అని అనుకుంటుంది కానీ చందు మాత్రం తన వైపు కూడా చూడడానికి ఇష్టపడకపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది.
భద్ర భాగ్యం వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని పిలుస్తుంది. ఏం జరిగింది ? ఎందుకు మమ్మల్ని రమ్మని పిలిచారు అని అడుగుతుంది భాగ్యం. ఏమీ లేదు మీ అమ్మాయికి అన్యాయం జరగబోతుంది అని ఆలోచించే మిమ్మల్ని రమ్మని పిలిచాను ఆ రామరాజు కొడుకు మీ అమ్మాయికి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఆ విడాకులు నోటిస్ మా వరకు వచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను అని భద్ర వాళ్ళకి నిజం చెప్తుంది. అయితే భాగ్యం మీరు రెచ్చగొడుతుంది కూడా. ఒకవైపు ఆనంద్ రావు వద్దని చెప్తున్న సరే.. భాగ్య మాత్రం అస్సలు వినకుండా ఎలాగైనా సరే రామరాజు పరువు తీసేయనా సరే తన కూతుర్ని మళ్ళీ అత్తవారింటికి తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటుంది. భద్ర ప్లాన్ మాత్రం సక్సెస్ అయ్యింది.
నర్మదా వల్లి తన భర్త కోసం ఎంతో తాపత్రయ పడుతుందని నిజంగానే వల్లి మారింది అని నమ్ముతుంది. అందరూ అక్కడ నుంచి వెళ్లిపోయిన సరే నర్మద మాత్రం శ్రీవల్లి దగ్గరికి వచ్చి అక్క నువ్వు మారిపోయావు అని నాకు అర్థం అవుతుంది. నువ్వు ఈ మార్పుని ఇలాగే కొనసాగిస్తే చందు భావ కచ్చితంగా నీ సొంతమవుతాడు అని చెప్తుంది. వల్లి తన భర్త తన కుటుంబం మళ్లీ తనని దగ్గరికి తీసుకుంటుందా లేదా అని కంగారు పడిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగ్యం రామరాజు కొడుకు పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది చూడాలి..
Also Read :Intinti Ramayanam Today Episode: రమ్య మాటతో కమల్ షాక్.. అమ్మోరిలా ఆరాధ్య.. ఇదేం ట్విస్ట్ సామి..