E-Paper
Advertisement

హైదరాబాద్‌లో అమిత్ షా మహా పాదయాత్ర.. బీఆర్ఎస్‌ పెద్దల్లో భయం ఎందుకు?

హైదరాబాద్‌లో అమిత్ షా మహా పాదయాత్ర.. బీఆర్ఎస్‌ పెద్దల్లో భయం ఎందుకు?
Advertisement

Telangana Politics: తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసిందా? అమిత్ షాను రంగంలోకి దించిందా? సందర్భం ఏమైనా టార్గెట్ తెలంగాణ పీఠం దక్కుకోవడమేనా? షా పాదయాత్ర విషయం తెలియగానే బీఆర్ఎస్‌ కీలక పెద్దల్లో వణుకు ఎందుకు? దీనిపై ఆ పార్టీ నేతలు ఏమంటున్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

రాజకీయాల్లో అడుగులు చాలా జాగ్రత్తగా వేయాలి. ట్రెండ్‌కు తగ్గట్టుగా అడుగులు వేయకుంటే ఇబ్బందులు తప్పవు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో నాన్చుడి ధోరణ ఏ మాత్రం పని చేయదు. వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయి. ఈ విషయాన్ని కాసేపు పక్కన బెడదాం. అసలు విషయానికి వచ్చేద్దాం. బీజేపీ మాస్టర్ మైండ్, హోంమంత్రి అమిత్ షా.. హైదరాబాద్ మహా పాదయాత్ర చేపడుతున్నారు. ఆయన పాదయాత్రకు తెలంగాణ వ్యాప్తంగా కాషాయ దండు కదలివస్తోంది. దీంతో హైదరాబాద్ నగరం కాషాయిమయం కానుంది. నగరంలో ఎక్కడ చూసినా అమిత్ షా పేరిట హోర్డింగులు కనిపిస్తున్నాయి.

Advertisement

కాంగ్రెస్ పార్టీ ‘సర్’ అరాచక రాజకీయాలపై సమరశంఖం, ప్రజాస్వామ్య రక్షణ కోసమని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. దీని వెనుక మరొక కోణం ఉందని చెబుతున్నారు. గడిచిన పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, అధికారం పోయిన తర్వాత డీలా పడింది. కేసీఆర్‌కు వయస్సు మీద పడడంతో యాక్టివ్ కాలేదు. ఆ తర్వాత కీలక నేతల చుట్టూ కేసులు వెంటాడుతున్నాయి. ఈ గ్యాప్‌ని అంది పుచ్చుకోవాలని ఆలోచన చేసింది బీజేపీ. ఈ క్రమంలో అమిత్ షా ద్వారా మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టింది.

Related News

దూసుకొస్తున్న మురసు తుఫాను.. దక్షిణ ఏపీ వైపు చూపు, తెలంగాణలో భారీ వర్ష సూచన

గచ్చిబౌలి మారథాన్‌లో తీవ్ర విషాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి!

తెలంగాణలో సన్నరకం బియ్యానికి ధర ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. కొత్త రేట్లు ఇవే?

ఎల్లంపేట మున్సిపాలిటీలో విచిత్రం.. తాను గెలిచిన వార్డు నంబర్‌‌నే మరిచిపోయిన కౌన్సిలర్?

అంతర్జాతీయ మార్కెట్లలో.. తెలంగాణ ఉత్పత్తుల హవా..?

సీఎం రేవంత్ రెడ్డికి.. సంచలన లేఖ రాసిన కల్వకుంట్ల కవిత!

పాలమూరులో ప్రైవేట్ ఆసుపత్రుల దందా.. పట్టించుకోని అధికారులు!

Big Stories

Advertisement
×