Abbas Afridi Nap With Trophies Hong Kong Sixes: పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఏది చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా టీమిండియాను తక్కువ చేసేలా ఏదో ఒక ప్రయోగం చేస్తూ నవ్వుల పాలు అవుతున్నారు. ప్రతీ విషయం ఇండియాతో పోల్చుకుంటూ పరువు తీసుకుంటూ ఉంటారు . లేటెస్ట్ గా హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్లేట్ ఫైనల్స్ విజేతగా నిలిచింది.
ఈ సందర్భంగా తాను గెలిచిన ట్రోఫీలతో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ అబ్బాస్ ఆఫ్రిది (Abbas Afridi) బెడ్ రూమ్ లో పడుకున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో ఫోటో వైరల్ అయిన నేపథ్యంలో అబ్బాస్ ఆఫ్రిదిపై ట్రోలింగ్ షురూ అయింది. ఇలా ఇండియన్ క్రికెటర్లు ఇప్పటికే చాలా మంది చేశారని.. వాటినే కాపీ కొట్టి.. పరువు తీసుకున్నాడని విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా హర్మన్‌ప్రీత్ కౌర్ ను కాపీ కొట్టి, పాక్ కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది (Abbas Afridi) తెగ బిల్డప్ ఇస్తున్నాడని ఎద్దే చేస్తున్నారు.
హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ అదరగొట్టింది. మొదటి మ్యాచ్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు… ఆ తర్వాత టీమిండియా ఓడించి పుంజుకుంది. ఈ క్రమంలోనే ఫైనల్ వరకు దూసుకు వెళ్ళింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా జరిగే ప్లేట్ ఫైనల్ సందర్భంగా ఒమన్ జట్టును ఓడించింది. దీంతో ప్లేట్ ఫైనల్ అవార్డు దక్కించుకుంది. ఇప్పుడు అదే ట్రోఫీని అబ్బాస్ అఫ్రిది తన పక్కన పెట్టుకొని పడుకున్నాడు. ఇది ఇలా ఉండగా హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్ లో భాగంగా బౌల్ ఫైనల్ దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగింది.
ఇందులో అద్భుతంగా రాణించిన దక్షిణాఫ్రికా టైటిల్ గెలుచుకుంది. మెయిన్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ తలపడ్డాయి. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ విక్టరీ కొట్టి చరిత్ర సృష్టించింది. ఆఫ్ఘనిస్తాన్ ఛాంపియన్ అయిన నేపథ్యంలో ఇండియాపై విమర్శలు చేస్తున్నారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు. హాంకాంగ్ సిక్సెస్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆడినట్టుగా ఐపీఎల్ లో దుమ్ము లేపే టీమిండియా ప్లేయర్లు సరిగ్గా ప్రదర్శన కనబరచలేదని సెటైర్లు పేల్చుతున్నారు. ఐపీఎల్ అని విర్రవీగే ఇండియన్ క్రికెటర్లు ఈ టోర్నమెంట్ లో ఎందుకు విఫలమయ్యారని నిలదీస్తున్నారు. ఫ్లాట్ మైదానాలు అయితేనే వాళ్ళు ఆడతారని ఎద్దేవా చేస్తున్నారు.
Abbas Afridi having a nap with his trophies won At Hong Kong Sixes. #cricket pic.twitter.com/bOaoJMh8Hw
— Nibraz Ramzan (@nibraz88cricket) November 1, 2026