E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode November 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ప్లాన్ సక్సెస్ – కష్టాల్లో దీప, కార్తీక్    

Karthika Deepam 2 Serial Today Episode November 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ప్లాన్ సక్సెస్ – కష్టాల్లో దీప, కార్తీక్    
Advertisement

Karthika Deepam 2 serial today Episode: జ్యోత్స్న పెళ్లి గురించి మాట్లాడుకుంటూ దశరథ, సుమిత్ర ఎమోషనల్‌ అవుతారు. తాము జ్యోత్స్న పెళ్లికి బంగారు నగలు పెట్టకపోవచ్చు కానీ మంచి చీరైనా కొనివ్వాలని అనుకుంటారు. అంతా చాటు నుంచి జ్యోత్స్న, దీప వింటుంటారు. వాళ్ల మాటలు పూర్తిగా విన్న జ్యోత్స్న ఏడుస్తూ తన రూంలోకి వెళ్తుంది. వెక్కివెక్కి ఏడుస్తుంది. వెనకాలే వెళ్లిన దీప.. జ్యోత్స్న ఏడ్వడం చూసి ఓదారుస్తుంది.

జ్యోత్స్న మాత్రం తాను మొదటి నుంచి ఎంత కఠినంగా ఉన్నది తలుచుకుని ఏడుస్తూనే ఉంటుంది. ఎప్పుడూ తాను ఆస్థి కోసమే బతికానని.. కార్తీక్‌ను పెళ్లి చేసుకోవాలనుకోవడం కూడా ఆస్థి కోసమేనని చెప్పి ఏడేస్తుంది జ్యోత్స్న. దీప ఓదారుస్తూ.. ఆ జ్యోత్స్న ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడున్న జ్యోత్స్న దశరథ, సుమిత్రల కూతురు మనిషిగా మారిపోయిన జ్యోత్స్న అంటుంది. అమ్మానాన్నల కోసమైనా ఆ జాబ్‌ మానేయవచ్చు కదా అని దీప చెప్తుంది. వాళ్ల రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని ఇప్పుడు కూడా నేను జాబ్‌ చేయకుండా వాళ్ల మీదే ఆధారపడితే ఎలా దీప అంటూ ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. వాళ్లిద్దరి మాటలు విన్న కార్తీక్‌ వచ్చి ఎమోషనల్‌ అవుతాడు.

Advertisement

జ్యోత్స్నను కలవాలని ఫోన్‌ చేసిన సూరజ్ దగ్గరకు జ్యోత్స్న వెళ్తుంది. ఎందుకు రమ్మన్నారు అని అడుగుతుంది. సూరజ్‌ కోపంగా చూస్తూ.. టిఫిన్‌ బండి దగ్గర గిన్నెలు కడగడం మానేయ్‌ అంటాడు. నేను గిన్నెలు కడిగితే మీకేంటి కష్టం అని జ్యోత్స్న అడిగితే.. నువ్వు గిన్నెలు కడిగిన వీడియో మా తాత చూశారు. అదంతా నా వల్లే అంటూ బాధపడ్డారు.. అంటూ సూరజ్‌ చెబితే.. మీ తాత బాధపడ్డాడు.. మీ అమ్మ చెప్పింది అని కాకుండా నీ మనసులో ఏముందో చెప్పు అంటూ జ్యోత్స్న అడిగితే.. నేను ఫోటోలు పెడితే వాటికి లవ్‌ సింబల్స్‌ రిప్లై ఇచ్చావేంటి అని సూరజ్‌ అడుగుతాడు. అవి శౌర్య ఇచ్చిందని చెప్తుంది జ్యోత్స్న. నేను డిలీట్‌ చేసిన ఫోటోలు ఎందుకు స్ర్కీన్‌ షాట్‌ తీసి పెట్టుకున్నావు అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. ఇక తమరు వెళ్లొచ్చు అంటూ సూరజ్‌ అంటే మీరు నా బాస్‌.. నేను మీకు పీఏను మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉండాలి అంటుంది జ్యోత్స్న. అయితే కారు ఎక్కు అంటాడు సూరజ్.

శివనారాయణ ఫ్రెండ్‌ ఇచ్చిన ఆర్డర్‌ కోసం వంటలు చేస్తుంటారు. దీప అక్కడకు వెళ్లి క్వాలిటీ చెక్‌ చేస్తుంది. నేను చెప్పింది ఏంటి మీరు చేస్తుందేంటి..? అంటూ వంటలు మొత్తం ఆపేయమని చెప్తుంది దీప. అప్పుడే అక్కడకు వెళ్లిన సూరజ్‌ విషయం తెలుసుకుని దీపను తిడుతాడు. మీరేం చేస్తారో నాకు తెలియదు సమస్య సాల్వ్‌ కావాలని చెప్తాడు. దీపకు ఏం చేయాలో అర్థం కాక కార్తీక్‌ను అడుగుతుంది. ఏం చేయాలో చెప్పడానికి కార్తీక్‌ ఆలోచిస్తుంటాడు.

Advertisement

మాలిని దగ్గరకు వెళ్లిన మేనేజర్‌.. దీపకు నిజం తెలిసిపోయిందని వంటలు మొత్తం ఆపేసిందని సూరజ్‌ కూడా అక్కడు ఉన్నారని చెప్తాడు. అందుకు మాలిని అది మరీ మంచిది. ఈ సాకుతో ఆ దీపను ఆఫీసులోంచి తరిమేయవచ్చు.. చూస్తూ ఉండండి దీప ఏం చేస్తుందో.. అంతా అయిపోయాక కస్టమర్‌ వంటల కోసం వచ్చినప్పుడు మనం ఎంట్రీ ఇద్దాం అంటుంది. మేనేజర్‌ సరే అంటూ వెళ్లిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అరియానాకు పెళ్లి అయ్యిందా..? వీడియోతో ట్విస్ట్ ఇచ్చిందిగా సామి..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. రామరాజు పరిస్థితి ఏంటి..?

Illu Illalu Pillalu Today Episodes: అంజలికి టెన్షన్.. ప్రేమ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. వల్లికి ఘోర అవమానం..

Intinti Ramayanam Today Episode: రమ్య మాటతో కమల్ షాక్.. అమ్మోరిలా ఆరాధ్య.. ఇదేం ట్విస్ట్ సామి..

Brahmamudi Serial Today Episode November 2nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఆఫీసుకు వెళ్లిన రాజుతో ఇందు ఏం చెప్పిందో తెలుసా..?  

Gundeninda GudiGantalu Today episode: సుమతికి షాక్.. మనోజ్ పార్క్ ను వదలడా..? పండగ సందడి హైలెట్..

Podarillu Today Episode : మహాకు షాకిచ్చిన కన్నా.. శైలుకు కోపం.. చక్రికీ ప్రపోజ్ చేస్తుందా..?

Big Stories

Advertisement
×