Ariana Glory : తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అరియనా గ్లోరీ.. ఒకప్పుడు యూట్యూబ్లో షార్ట్స్ వీడియోస్ చేసి బాగా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తనకున్న ఫాలోయింగ్ తో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టే అవకాశాన్ని కూడా సొంతం చేస్తుంది. ఇటీవల కాలంలో అరియానా కు సంబంధించిన వార్తలు క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి. తాజాగా ఈమెకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవడంతో ప్రస్తుతం అది హాట్ టాపిక్ గా మారింది.. ఆ వీడియోలో అరియానా పెళ్లి చేసుకున్నట్లు కనిపిస్తుంది. మరి నిజంగానే ఈమె పెళ్లి చేసుకుందా? లేదంటే అది ఏదైనా ప్రమోషన్ వీడియో నా? అన్నది మాత్రం క్లారిటీ రాలేదు ఒకసారి దీని గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
బుల్లితెరపై తన అల్లరి మాటలతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ముద్దుగుమ్మల్లో అరియనా గ్లోరీ ఒకరు. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇప్పటికే ఎంతోమంది ఆమెకు ఫాలోవర్స్ గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హరి అన్న వరుసగా టీవీ షోలలో సందడి చేస్తూ వస్తుంది. అయితే తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. అందులో పెళ్లికూతురు గెటప్ లో కనిపించడంతో పాటుగా మెడలో పసుపు కొమ్ము కూడా కనిపించడంతో ఆమెకు పెళ్లయిందా? లేకపోతే అదొక యాడా? అన్నది మొదట ఫ్యాన్స్ కన్ఫ్యుజ్ అవుతారు. కాని చివరి వరకు చూస్తే అది ఒక గోల్డ్ జువెలరీ యాడ్ అని తెలుస్తుంది.. అది చూసిన ఫ్యాన్సు ఊపిరి పీల్చుకుంటారు. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియోలో అరియానా ఎంత క్యూట్ గా ఉందో మీరు కూడా ఒకసారి ఇక్కడ చూసేయండి..
?exln=b3c5N2s5NjR2b3dq
టిక్ టాక్ వీడియోలతో చాలామంది ఫేమస్ అయ్యారు.. అందులోను అమ్మాయిలు అలా ఫేమస్ అయ్యి సినిమాలలో అవకాశాలు కూడా అందుకొని బిజీగా మారారు. నిజానికి ఈ అమ్మడు యూట్యూబ్ ఇంటర్వ్యూ లతో బాగా ఫెమస్ అయిన వారిలో బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీ ఒకరు. ప్రస్తుతం నెట్టింట లేటెస్ట్ ఫొటోలతో రచ్చ చేస్తుంది.. ఇకపోతే బిగ్ బాస్ తర్వాత అందరికీ వరుస అవకాశాలు వస్తే.. ఈయన మాత్రం కేవలం ఇంటర్వ్యూలకు మాత్రమే పరిమితమైంది. సినిమాల్లో బిజీ అవుతుందని అనుకున్న కూడా సోషల్ మీడియాలో బిజీగా గడుపుతుంది.. అంతేకాదు పలు టీవీ షోలకి హోస్ట్ గా కూడా చేస్తూ బిజీగా ఉంది వీటితో పాటుగా వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తూ రెండు చేతుల సంపాదిస్తూ వస్తుంది.. మొత్తానికి అరియనా బిజీగా ఉండడంతో పాటుగా ఆస్తులను వెనకేసుకుంటుంది అని చెప్పకనే తెలుస్తుంది.