Ind vs SA, Final: వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ మరి కొన్ని గంటల్లోనే ప్రారంభం కానుంది. ఈ మహిళల వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ ను ఓడించిన దక్షిణాఫ్రికా ఫైనల్ కు రాగా… అటు ఆస్ట్రేలియాన్ చిత్తు చేసి టీమిండియా కూడా దూసుకువచ్చేసింది. దీంతో ఇవాళ ఈ రెండు జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది.
Also Read: Womens World Cup 2025: టీమిండియాకు రూ.125 కోట్ల ఆఫర్..?ఐసీసీ కంటే 3 రేట్లు ఎక్కువే
వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India Women vs South Africa Women ) మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ( Dr DY Patil Sports Academy, Navi Mumbai) నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండున్నర గంటలకు టాస్ వేస్తారు. ఎప్పటిలాగే జియో హాట్ స్టార్ లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాలు చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్ తిలకించవచ్చు.
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ ఫైనల్ జరగనున్న ముంబైలో వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. గత వారం రోజులుగా ముంబైలో వర్షాలు పడుతున్నాయి. నిన్న వర్షం పడకపోయినా, ఇవాళ మాత్రం ముంబైలో చిరుజల్లులు పడే అవకాశాలు ఉన్నాయట. ఈ మ్యాచ్ జరిగే ప్రాంతంలో కూడా 30% ఇవాళ వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ ఇవాళ జరగకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు క్రీడా విశ్లేషకులు. వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దు అయితే.. రిజర్వ్ డే ఉంటుంది. అంటే సోమవారం మ్యాచ్ యధావిధిగా ప్రారంభం కానుంది. ఇక రేపటి రోజున కూడా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే, మాత్రం టీమిండియా కొంప మునుగుతుంది. పాయింట్ల పట్టిక ప్రకారం దక్షిణాఫ్రికా ఛాంపియన్ నిలుస్తుంది. పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉంది. టీమిండియా నాలుగో స్థానంలో ఉంది. దీంతో రూల్స్ ప్రకారం, దక్షిణాఫ్రికా విజేతగా నిలుస్తుంది.
Also Read: Smriti mandhana: జమీమా సక్సెస్ చూసి కుళ్ళుకుంటున్న స్మృతి మందాన.. టీమిండియాలో అంతర్యుద్ధం ?
ఇండియా ప్రాబబుల్ ఎలెవన్ ( india): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (Captain), అమంజోత్ కౌర్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (WK), స్నేహ రాణా/రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్
దక్షిణాఫ్రికా ప్రాబబుల్ XI: లారా వోల్వార్డ్ట్ (Captain), తజ్మిన్ బ్రిట్స్, సునే లూయస్, అన్నేకే బోష్/మసబాటా క్లాస్, అన్నరీ డెర్క్‌సెన్, మారిజాన్ కాప్, సినాలో జాఫ్తా (వారం), క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగా ఖాకా, నాంకులులే