Yukta Malnad : తెలుగు బుల్లితెరపై కన్నడ సీరియల్ నటులు ఎంతోమంది నటిస్తూ తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్స్ యాక్టింగ్ తెలుగు ప్రజలను ఆకట్టుకుంటుంది.. దాంతో వారిపై అభిమానాన్ని చూపిస్తున్నారు.. తాజాగా ఓ కన్నడ నటి పేరు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది. ఆమె మరెవరు కాదు ముక్త మల్నాడు.. వైదేహి పరిణయం సీరియల్ తో తెలుగు బుల్లితెరకు పరిచయం అయ్యింది. కలవారి కోడలు కనకమహాలక్ష్మి’ సీరియల్లో లీడ్ రోల్‌లో అలరిస్తున్నది.. ఈమెకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి జీవితంలో తన ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వివరించింది. నటించాలని కోరిక ఎలా కలిగింది వంటి విషయాలను పంచుకుంది. ఆ ఇంటర్వ్యూలో ఎటువంటి విషయాలను పంచుకుందో ఒకసారి మనం తెలుసుకుందాం..
ముక్త మల్నాడు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది.. ఈమధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న కలవారి కోడలు కనకమాలక్ష్మి సీరియల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ముక్త తన సినిమా లైఫ్ ఎలా మొదలైంది అన్న విషయాల గురించి పంచుకుంది. చిన్నప్పటినుంచి సీరియల్స్ సినిమాలు చూస్తూ నటించాలని కోరికను పెంచుకున్నట్లు చెప్పింది. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ఓ ఈవెంట్ కు తాను చేసిన డ్యాన్స్ కి అక్కడికి వచ్చిన డైరెక్టర్ ఫిదా అయ్యారట. తన సినిమాలో ఛాన్స్ ఇప్పడుస్తానని అన్నారట. చదువు అయిపోయిన తర్వాత చూద్దాంలే అని ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట..
డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఓ సినిమా ఆఫర్ వచ్చింది.. చదువు పూర్తయ్యేంతవరకు ఎటువంటివి చేయనవసరం లేదని ఇంట్లో వాళ్ళు కచ్చితంగా చెప్పడంతో నేను ఆ సినిమాని రిజెక్ట్ చేశానని ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. చదువు అయిపోయిన తర్వాత స్పైస్ జెట్ లో ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న సమయంలో మళ్లీ ఒక సినిమా అవకాశం రావడంతో ఆ జాబును వదిలేసాను అని ఆవిడ చెప్పింది.. అలా మంచి జాబ్ ని వదిలేసి సినిమా అంటే ఇష్టంతో నటన వైపు ఆసక్తి ఉండడంతో ఇటుగా అడుగులు వేశానని యుక్త అన్నది.
యాక్టింగ్ చేస్తానని అమ్మ వాళ్ళకి ఎన్ని సార్లు చెప్పినా అసలు పట్టించుకునేవారు కాదు. చదువు అయిపోయిన తర్వాత ఏవైనా ఉంటే చూడొచ్చులే అని అనేవారు. చదువు అయిన తర్వాత అడిగితే ఇలాంటివి మన ఇంట వంట లేవు అని మొదట భారించినా సరే ఆ తర్వాత అన్నిటికి సిద్ధపడి ఒప్పుకున్నారు. కన్నడ సీరియల్స్ లో నటించి ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది యుక్త.. ప్రస్తుతం ఈమె కలవారి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్లో నటిస్తోంది.. అలాగే సోషల్ మీడియా లో హైపర్ ఆక్టివ్ గా ఉంటుంది.