E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: కొడుకు కోసం రామరాజు కన్నీళ్లు.. దొరికిపోయిన అమూల్య.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: కొడుకు కోసం రామరాజు కన్నీళ్లు.. దొరికిపోయిన అమూల్య.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode October 12th: శ్రీవల్లి తన ఫోన్ తో చందు కి అలాగే ఇంట్లోనే వాళ్ళందరికీ ఫోన్ చేస్తూ మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ ఏ ఒక్కరూ కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చాలా బాధ పడిపోతూ ఉంటుంది. తన కాపురం ఇలా అయింది అని బాధపడిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది శ్రీవల్లి. అయితే అప్పుడే భాగ్యం ఆనందరావు అమ్మడు ఏడ్చి ఏడ్చి గొంతు బొంగురు పోయి ఉంటుంది. ఒక ముద్ద అన్నం తిని ప్రశాంతంగా నిద్రపో అవే సర్దుకుంటాయి అని ఆనందరావు భాగ్యం అంటారు. నా కాపురం ఇలా అవ్వడానికి కారణం మీరే ఇప్పుడు నాకు అన్నం తినమని చెప్తున్నారా ఎలా తినమంటావు అన్నం గొంతులో దిగుతుందా అసలు అని ఆ అన్నం ప్లేటును విసిరి కొట్టేస్తుంది. నీకేమైనా పిచ్చి గాని పట్టిందా అన్నం ప్లేట్లు ఎవరైనా విసిరి కొడతారా అని భాగ్యం అంటుంది. నీవల్లే నాకు కాపురం ఇలాంటి మారింది నువ్వు నాతో మాట్లాడద్దు అనే శ్రీవల్లి చాలా ఫీల్ అవుతుంది.

కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు..

రామరాజు నా పెద్ద కోడల్ని ఏరి కోరి నేనే తెచ్చుకున్నాను ఎటువంటి ఎంక్వయిరీ చేయకుండా మంచిది అని కొద్దిగా నమ్మి నా కొడుకు జీవితాన్ని నాశనం చేశాను అని బాధ పడిపోతూ ఉంటాడు. అయితే అప్పుడు అక్కడికి వేదవతి భోజనం తీసుకుని వస్తుంది ఎలా తినమంటావు బుజ్జమ్మ నా కొడుకు జీవితం ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. నేనే వాడి జీవితాన్ని నాశనం చేశాను అని అనుకుంటేనే నా గుండె తరుక్కుపోతుంది అంటూ బాధ పడిపోతాడు రామరాజు. నువ్వేమీ బాధపడొద్దు అండి మీరు ఏమి తప్పు చేయలేదు కదా..ఆమె గురించి తెలుసుకోకుండా చేశాము ఇప్పుడు బయటపడింది కదా.. చందు చాలా సంతోషంగానే ఉన్నాడు అని వేదవతి అంటుంది కానీ రామరాజు మాత్రం నా కొడుకు జీవితం నాశనం అవ్వడానికి లేనే కారణమని చాలా బాధపడిపోతూ ఉంటాడు..

అడ్డంగా బుక్కయిన అమూల్య, విశ్వం..

Advertisement

విశ్వం శ్రీవల్లి చేసిన మోసం గురించి మాట్లాడతారు. అసలు అవన్నీ ఇంత చేస్తూ ఉంటే ఇంత జరిగితే నాకెందుకు నువ్వు చెప్పలేదు అని విశ్వం అడుగుతాడు. ఇంత జరుగుతూ ఉన్న కూడా నువ్వు నాకు చెప్పకపోవడం ఏంటమ్మా అని విశ్వం అడక్కుగానే అమూల్య అవల్లి గురించి మాకున్న ఎక్కువగా మీకే తెలుసు కదా.. మళ్లీ ఇప్పుడు కొత్తగా నన్ను అడుగుతున్నావ్ ఏంటి అని అమూల్య విశ్వం పై సీరియస్ అవుతుంది.. ఒకప్పుడు విశ్వంని కాదు నేను నేను పూర్తిగా మారిపోయాను అమూల్య అంటూ విశ్వం అంటాడు. కానీ అమూల్య మాత్రం అస్సలు నమ్మదు. అయితే అప్పుడే శారదాంబ ఎవరక్కడ దొంగల్లాగా ఈ టైంలో మాట్లాడుకుంటున్నారు అని రావడంతో అమూల్య భయపడి పారిపోతుంది. ఇక విశ్వం అమూల్యను ప్రేమిస్తున్న విషయాన్ని శారదాంబకు చెప్తాడు. ఏ జోడి అయితే విడిపోయింది అనుకున్నామో అదే జోడి మళ్లీ కలిస్తే బాగుంటుంది మీ పెళ్లి వల్ల ఈ రెండు కుటుంబాలు కలుస్తాయి అని శారదాంబ అంటుంది.

కొడుకు కోసం రామరాజు కన్నీళ్లు..

వెనకలా ముందల ఆలోచించకుండా నా కొడుకు పెళ్లి జరిగితే చాలు అని అనుకున్నాను తొందరపడి తప్పు చేశాను నా కొడుకు జీవితాన్ని నేనే నా చేతులారా నాశనం చేశాను అని రామరాజు చాలా బాధపడిపోతూ ఉంటాడు. అసలు నా కొడుకు జీవితాన్ని నేను ఇలా నాశనం చేస్తానని కలలో కూడా ఊహించలేదు. మంచి కోడలు అని చేసుకున్నాను కానీ ఇంత మోసం చేసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తారని అసలు ఊహించలేదు నాకు గుండె తరుక్కుపోయే బాధ కలుగుతుంది అని రామరాజు చాలా ఫీల్ అయిపోతాడు. మీరు చేసిన తప్పేంటండి మంచి కోడలు అని చేశారు కాకపోతే ఆమె ఇలాంటిది అని దేనికున్న తర్వాత బాధపడుతున్నారు అని వేదవతి ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. ఇక మొత్తానికి రామరాజు తో బలవంతంగా అయినా అన్నం తినిపిస్తుంది.

నర్మదా, సాగర్ పెళ్లి రోజు..

Advertisement

ఇంట్లోని వాళ్ళందరూ కూడా బల్లి చేసిన మోసాన్ని మర్చిపోలేక ఆలోచిస్తూ ఉంటారు. కానీ అప్పుడే ప్రసాద్ రావు ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్అ వుతారు. ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల గురించి తెలుసుకొని ఈయన మనల్ని ఏదో ఒకటి అనడానికి వచ్చి ఉంటాడు అని అందరూ అనుకుంటారు. కానీ ప్రసాద్ రావు తన కూతురు అల్లుడికి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పగానే అందరూ వాళ్ళ పెళ్లిరోజు నీకు గుర్తుచేసుకొని శుభాకాంక్షలు చెప్పారు. అయితే పెళ్లి రోజు వేడుకలని గ్రాండ్గా చేయాలి అని ప్రసాదరావు ఆయన భార్య అడగగానే రామరాజు సరి అని అంటాడు.. నర్మద ఎంత వద్దన్నా సరే రామరాజు మాత్రం మీ పెళ్లి రోజు ముచ్చటిని అసలు వదిలేయకూడదు అని అంటాడు.

సుకన్య దొరికిపోతుందా..?

ఇంట్లో నర్మదా సాగర్ల పెళ్లిరోజు గురించి వల్లికి ఎలాగైనా సరే చెప్పాలి అని సుకన్య ఎవ్వరు లేని ప్లేసుకొచ్చి ఫోన్ చేసి చెప్తుంది. శ్రీవల్లి తన బావ కోసం నేను మళ్ళీ ఆ ఇంటికి రావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. సుకన్య చందు ఇక్కడికి వస్తే నేను కచ్చితంగా చంపేస్తాడు అని చెప్పిన కూడా అయినా పర్వాలేదు నా బావ చేతిలో నేను చచ్చిపోవడానికి కూడా రెడీ అని శ్రీవల్లి అంటుంది. తన కాపురాన్ని కూల్చేసిన నర్మదపై ఎలాగైనా సరే రివెంజ్ తెచ్చుకోవాలి అని శ్రీవల్లి ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది.. అయితే సుకన్య శ్రీవల్లితో మాట్లాడిన విషయం తిరుపతికి తెలిసిపోయేలా కనిపిస్తుంది..అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి మాస్టార్ ప్లాన్.. రంగంలోకి పోలీసులు.. అవని, కమల్ అరెస్ట్..

Related News

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య ప్రభా హ్యాపీ.. చింతామణికి దిమ్మతిరిగే షాక్..హైలెట్ ట్విస్ట్..

Karthika Deepam 2 Serial Today Episode October 12th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ కు కార్తీక్ వార్నింగ్ – జ్యోత్స్న ఎక్కడికి వెళ్లినట్టు..?           

Intinti Ramayanam Today Episode: పల్లవి మాస్టార్ ప్లాన్.. రంగంలోకి పోలీసులు.. అవని, కమల్ అరెస్ట్..

Monday Tv Movies : సోమవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 12th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరికి షాక్ ఇచ్చిన అమర్  

నాన్న చనిపోయినప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు.. మహేష్ అచంట ఎమోషనల్

చేతిలో రూపాయి లేదు.. శివుడిని మొక్కగానే సినిమా ఛాన్స్.. మహేష్ అచంట ఓపెన్ టాక్!

Big Stories

Advertisement
×