Intinti Ramayanam Today Episode October 12th: ప్రణతిని ఇలానే రెచ్చగొట్టి ఇంట్లో నుంచి పంపించాలి అని పల్లవి అనుకుంటుంది. ప్రణతిని గనక ఇంట్లో నుంచి పంపిస్తే ఖచ్చితంగా కమల్ మళ్లీ పల్లవి దగ్గరికి వస్తాడు అని ఆశ పడిపోతూ ఉంటుంది.. భరత్ నీ రెచ్చగొట్టి ప్రణతిని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి పంపించాలి అని పల్లవి చేసిన ప్లాను మొత్తానికి సక్సెస్ అవుతుంది. పల్లవి ఎలా చెప్తే భరత్ అలా వింటూ ఉంటాడు. నిజంగానే మంచిది అని నమ్మించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు. కానీ ప్రణతి నేను ఏమి ఎవరికీ ఏది చెప్పను అని ఎంత చెప్పినా సరే పల్లవి మాత్రం వినకుండా కావాలని అందరిని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. తనకి మీనాక్షిని అటు భరత్ నీ తన వైపు తిప్పుకుంటుంది పల్లవి. ఇక ప్రణతి పల్లవి వల్ల భరత్ మళ్లీ మారిపోతాడు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి పల్లవి పుట్టింటికి వెళ్తుందా లేదంటే భరత్ కోపానికి భయపడుతూ ఉంటుందా అన్నది చర్చించుకున్నారు.
ఉదయం లేవగానే అందరూ కూర్చుని ఉండగా చక్రధర ఒకసారిగా ఇంట్లోకి రావడంతో ఎందుకు వచ్చారు అని ఆలోచిస్తూ ఉంటారు. పల్లవి గురించి మాట్లాడటానికి నేను ఇంటికి వచ్చాను అని చక్రధర అనగానే కమల్ పల్లవి గురించి మాట్లాడడానికి అయితే మాత్రం మీరు ఇంకేం మాట్లాడాల్సిన అవసరం లేదు మావయ్య అనేసి సీరియస్ అవుతాడు. చక్రధర్ని అందరూ తలా ఒక మాట అనడంతో భానుమతి మీరేంటి బ్రతిమలాడుతున్నార అల్లుడుగారు పల్లవి గురించి ఏదో ఒకటి తేల్చుకొని వెళ్లాలి కానీ ఇలా బ్రతిమలాడితే వీళ్ళు వింటారా అని అంటుంది. దేని గురించి మాట్లాడాల్సిన పనిలేదు పల్లవి ఇంట్లోకి వస్తే చంపేస్తాను అని కమల్ వార్నింగ్ ఇస్తాడు. నేను చెప్పేది ఒకసారి వినండి అల్లుడుగారు అని చక్రధర్ ఎంతగా చెప్పిన సరే కమల్ మాత్రం పల్లవి ఇంట్లోకి అడుగుపెట్టడానికి వీల్లేదు అని చెప్పేస్తాడు.
చక్రధర్ పల్లవి చేసిన తప్పేమీ ఎంతగా చెబుతున్నా సరే కమల్ మాత్రం అస్సలు వినడు. ఎలాగైనా సరే కమల్ ని ఒప్పించి పల్లవిని మళ్లీ కలపాలి అని అనుకుంటాడు చక్కధర్అ యితే ఎంతగా మాట్లాడిన కూడా కమల్ మాత్రం అస్సలు కరగడు. పల్లవి ఎలాంటిదో ఇలాంటి మోసాలు చేస్తుందో నాకన్నా ఎక్కువగా మీరే తెలుసు.. అలాంటిది మీరు ఇప్పుడు ఇలా మాట్లాడడం అస్సలు బాగోలేదు మామయ్య అని అంటాడు కమల్.. పల్లవి చేసిన మోసాలు దారుణాలు మా కుటుంబాన్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇక జీవితంలో పళ్ళ విని క్షమించమని కమల్ తెగేసి చెప్పేస్తాడు. అయితే భానుమతి బ్రతిమలాడడం కాదు ఏదో ఒకటి తేల్చుకోవాలి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చక్రధరిపై సీరియస్ అవుతుంది. ఒసేయ్ ముసలి నువ్వు ఏం మాట్లాడినా అసలు ఊరుకోను నీ మనవరాలు నిన్ను కూడా ఇంట్లోంచి పంపిస్టా అనగానే భానుమతి సైలెంట్ అవుతుంది.
అవినీకి రెండు గంటలైనా కూడా ఇంకా ఫీవర్ తగ్గకూడదు ఇంట్లోని వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. టాబ్లెట్ వేసుకున్నాను కదా అత్తయ్య తగ్గిపోతుందిలేని అవని అంతగా చెప్తున్నా సరే పార్వతి మాత్రం అస్సలు వినదు. టాబ్లెట్స్ వేసుకోగానే అరగంటకు గంటకు జ్వరం తగ్గుతుంది కానీ రెండు గంటలు అయినా నీకు జ్వరం తగ్గలేదు అందుకే మనం హాస్పిటల్ కి వెళ్దాము అని పార్వతి అంటుంది. ఇక అవినీ హాస్పిటల్ కి తీసుకెళ్ళేందుకు అక్షయ్ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు.
పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన పల్లవి తన భర్త తోడుకోడలు తనని ఇబ్బంది పెట్టి టార్చర్ చేస్తున్నారు అని కంప్లైంట్ ఇస్తుంది. అయితే అది నిజమే అనుకొని నమ్మిన పోలీసులు పల్లవికి సపోర్ట్ చేస్తూ ఆ ఇద్దరు పంపిస్తామని అంటారు. పల్లవి చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్మిన పోలీసులు నీకు న్యాయం జరిగేలా చేస్తాము మీరు అస్సలు బాధపడకండి అని భరోసా ఇస్తారు. ఇక పల్లి అవని కమల్ ని ఆలస్యం అని కంప్లైంట్ ఇస్తుంది. పోలీసులు వాళ్ళింటికి వెళ్లి ఎలాగైనా సరే కమలే అలాగే అవని అరెస్ట్ చేయాలని అనుకుంటారు..
చక్రధర్ ఇక ఏమీ మాట్లాడకుండా అవని ఎక్కడుంది అని అడుగుతాడు అవనికి జ్వరం వచ్చింది అన్నయ్య అని పార్వతి చెప్తుంది. తనకు జ్వరం తగ్గిన తర్వాత నేను వచ్చి మాట్లాడతాను అని చక్రధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చక్రధర్ వెళ్లిన కొద్దిసేపటికి పోలీసులు పార్వతి ఇంటికి వస్తారు. కమలి ఎవరు పెళ్ళాన్ని అరెస్ట్ చేస్తున్నారని తన భార్య తన మీద కంప్లైంట్ ఇచ్చింది అని ఎస్ఐ అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అంతేకాదు అవని ఎవరు అవని మీద కూడా తను కంప్లైంట్ ఇచ్చింది తనని కొట్టి ఇబ్బంది పెడుతుంది అని అవని ఈ నుంచి కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకురావాలని కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక పోలీసులు ఎవరైనా చెప్పిన వినకుండా అవనీని కమల్ని అరెస్ట్ చేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో పల్లవి ప్లాన్ ఏంటో తెలిపే అవకాశం ఉంది..
Also Read :సోమవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని మస్ట్ వాచ్..