E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: భద్ర ప్లాన్ సక్సెస్.. అడ్డంగా దొరికిపోయిన సాగర్.. వల్లికి విడాకులు..?

Illu Illalu Pillalu Today Episodes: భద్ర ప్లాన్ సక్సెస్.. అడ్డంగా దొరికిపోయిన సాగర్.. వల్లికి విడాకులు..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode October 28th : వల్లి అక్క నిజంగానే ఏదో మాస్టర్ ప్లాన్ వేసినట్లే ఉంది అని నర్మదా అనుమానం పడిపోతూ ఉంటుంది. తన గురించి ప్రతి విషయాన్ని నేను ఆలోచించి తీసుకోవాలి అని అనుకుంటుంది. ఇక నర్మదా ఛాన్స్ ఇవ్వడం కాదు అక్క నువ్వు మంచి దానివి అని నిరూపించుకో అప్పుడు నేనే అందరితో మాట్లాడి నిన్ను ఆ ఇంటికి తీసుకుని వెళ్తాను అని చెప్పగానే.. సరే చెల్లి నేనేంటో నేను నిరూపించుకుంటాను. నా గురించి నేను చూసుకుంటాను అని నర్మదా తో వల్లి అంటుంది మరి వల్లి అక్క నిజంగానే మారిపోయిందా లేదు అంటే నేనేం చేయలేను అని అనుకుంటుంది అయితే మళ్లీ నిజంగానే మారిపోతుందా లేదా అని నర్మదా అనుకుంటూ లోపలికి వెళ్తుంది. అక్కడ ఒక పర్మిషన్ నేను ఫైల్ మీద సాగర సంతకం చేసి ఉండడం చూసి షాక్ అవుతుంది ఎలాగైనా సరే లంచాలు తీసుకుంటున్న సాగర్ ని పట్టుకోవాలి అని అనుకుంటుంది.

మరో ఫ్రాడ్ లో సాగర్..

సాగర్ చిన్న చిన్న వాటితో సరిపోవట్లేదు ఒకేసారి పెద్దపెద్ద తిమింగలలో కావాలి అని వాళ్ళ సార్ తో అనగానే అతను ఒక మంచి ఫైల్ ఇస్తాడు. అయితే ఈసారి నాకు 20 లక్షలు కావాలి అని సాగర్ అంటాడు. ఏకంగా 30 లక్షలు ఫైలుని వాళ్ళ సారు ఇవ్వగానే దానిమీద సంతకం పెట్టి బయటికి వస్తాడు. అయితే తన ఫ్రెండ్ తనకు ఐదు లక్షలు ఇవ్వమని చెప్పినా కూడా రిక్వెస్ట్ చేసిన ఇవ్వడు అయితే నీ గురించి నీ భార్య తెలియకుండా నేను ఎంతో మేనేజ్ చేశాను కదా దాని గురించి ఇప్పుడు చూసుకుంటాను అని అనుకుంటాడు.. ఎలాగైనా సరే నిన్ను ఇరికించేలా నేను చూసుకుంటాను అని అనుకుంటాడు..

ధీరజ్ కు షాక్..

Advertisement

ధీరజ్ తన ట్రావెల్ బిజినెస్ కోసం డబ్బులు కోసం అందరిని వెతుకుతూ ఉంటాయి. అయితే తనకి డబ్బులు ఇవ్వడానికి ఎవ్వరు ముందుకు రారు. ఎలాగైనా సరే ఆ డబ్బు లేని సంపాదించి బిజినెస్ ని మొదలు పెట్టాలి అని అనుకుంటారు. అయితే అది చూసిన తర్వాత అందరూ 15 లక్షల కంటే ఎక్కువ ఒక్క రూపాయి కూడా ఇవ్వము అని అంటారు కానీ చింతామణి నేను ఇస్తాను.. ఇప్పుడు నేను తప్ప నీకు ఎవరూ లేరు బిజినెస్ బిజినెస్ ఫ్యామిలీ ఫ్యామిలీని అంటుంది. ఆ మాటను నమ్మి ధీరజ్ ఒప్పుకుంటాడు అయితే భద్ర ప్లాన్ ప్రకారం చింతామణి ఇలా చేస్తుందని తెలియక ఇరుక్కుంటాడు.. అయితే భద్రావతి మాత్రం ధీరజ్ని ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటుంది. వల్లి అడ్డుపెట్టుకొని ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నాను కానీ ఇలా నువ్వు చేస్తావని అస్సలు ఊహించలేదని వల్లిని అడుగుతుంది. అయితే వల్లి నేను ఇకమీదట నుంచి ఏ తప్పు చేయను మారిపోతాను అని అనగానే భద్రావతి షాక్ అవుతుంది..

నర్మదకు దొరికిపోయిన సాగర్..

వేదవతి అలాగే వాళ్ళ అమ్మ ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అప్పుడే వల్లి గురించి ఎంత చెప్పినా కూడా అసలు వినకుండా.. మధ్యలో సుకన్య కూడా మాట్లాడడంతో అందరూ సుకన్య పై సెటైర్లు వేస్తూ ఉంటారు అయితే. కానీ వేదవతి మాత్రం నువ్వు కూడా ఇలానే మాట్లాడితే కచ్చితంగా నిన్ను కూడా ఆ ఇంట్లో నుంచి పంపించేసి అక్కడి కూర్చో పెడతాను. అయితే ఇద్దరూ కలిసి చమ్మచక్క ఆడుకోవచ్చు అని వేదవతి అంటుంది. కానీ నేను ఫోన్ అండి నేను ఇక్కడే ఉంటాను అండి నీకు కాఫీ తీసుకొని వస్తాను అని వెళ్తుంది. అయితే ఎన్నిసార్లు కాఫీ చేసినా కూడా ఆ కాఫీని మాత్రం ఎవరో ఒకరు తీసుకుంటూనే ఉంటారు. సుకన్య ఎన్నిసార్లు కాఫీ పెట్టుకుని వచ్చినా కూడా ఎవరో ఒకరు తీసుకోవడంతో కంగారు పడిపోతూ ఉంటుంది..

సాగర్ దొరికిపోతాడా..?

Advertisement

సుకన్య చేసిన టీ ని తాగినందుకు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎన్నిసార్లు టీ పెట్టిన కూడా తీసుకొని వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు.. అయితే సుకన్య ఎన్నిసార్లు టీ పెట్టుకుని వచ్చిన ఎవరో ఒకరు తీసుకుంటున్నారు కదా.. ఈసారి ఎవరు తీసుకొని ఇవ్వకుండా తీసుకోవాలి అని అంటారు.. అయితే అప్పుడే అక్కడికి సాగర్ రాగానే నర్మదా చాలా సీరియస్ గా ఉంటుంది.. అయితే సాగర్ టీ తాగిన తర్వాత 20 లక్షలు సెట్ అయ్యాయని చెప్పగానే ఎలా సెట్ అయ్యాయి లంచలు తీసుకుంటున్నావా అని అడుగుతుంది. అయితే నేను లంచాలు తీసుకుంటున్నానని నీకు ఎవరు చెప్పారు అని సాగర్ అంటాడు.. నా గురించి తెలుసుకోకుండా ఎవరు ఏదో చెప్పారని నువ్వు ఇలా మాట్లాడటం నాకు అస్సలు నచ్చలేదు అని సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

సాగర్ పై అనుమానం..

నర్మదా సాగర్ ఫైల్ మీద సంతకం పెట్టిన దాన్ని చూపించి ఇది నువ్వే నా చేసింది అని అడుగుతుంది. ఏదో ఒకటి చేశారు కదా అని నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు.. ఇక సాగరు నేను లంచాలు తీసుకున్నానని నువ్వు నిరూపించగలవా ఏం మాట్లాడుతున్నావో తెలుసా నర్మదా నీకు అని సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఏంటే నర్మదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు సాగరు ఎందుకు అలా లంచాలు తీసుకుంటాడు ఏం మాట్లాడుతున్నావో కొంచమైనా అర్థమవుతుందని వేదవతి అంటుంది.. కానీ అందరూ కూడా నర్మదా బాధపడుతుంటే వాడు అలా చేసి ఉండడే వాడు కచ్చితంగా చెబుతున్నాడు కదా అని అంటారు కానీ నర్మద మాత్రం చాలా కన్నీళ్లు పెట్టుకొని బాధపడిపోతూ ఉంటుంది..

వల్లి కన్నీళ్లు..

వల్లి తన జీవితం ఇలా అవడానికి కారణం తన తల్లి అని చాలా బాధపడిపోతూ ఉంటుంది. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన భాగ్యం నువ్వు వాళ్ల మీద కేసు పెట్టి నిన్ను అత్తారింటికి పంపించాలి అని అనుకున్నాము కానీ నువ్వు మొత్తం వృధా చేశావు కాబట్టి నీ జీవితం నువ్వే చేతులారా నాశనం చేసుకున్నావని భాగ్యం అంటుంది. కానీ వల్లి నా జీవితం ఇలా అవడానికి కారణం నువ్వే కదా నీ వల్లే నా జీవితం ఎలా మారిపోయింది అని బాధ పడిపోతూ ఉంటుంది. ఇక ఆనంద్ రావు వల్లి చేత భోజనం తినిపిస్తాడు అది కన్న తండ్రి కూతుర్ల సెంటిమెంట్ సీన్ కి హైలైట్ గా నిలుస్తుంది. అటు చందు తన భార్యకి విడాకులు ఇవ్వాలని అనుకుంటాడు. అక్కడితో ఎపిసొడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. కమల్ ప్రేమలో పడతాడా..? పార్వతికి టెన్షన్..

Related News

Ye Devi Varamo Neevu: అంజలి నెలకు అంత సంపాదిస్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: బాలుకు దిమ్మతిరిగే షాక్.. శోభా, చింతామణి కలిసిపోయారు.. గుణ అవుట్..

Karthika Deepam 2 Serial Today Episode October 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ రూంలోకి వెళ్లిన జ్యోత్స్న షాక్ అవ్వడానికి కారణం ఏంటి..? 

Podarillu Today Episode : కన్నాపై మహా సీరియస్.. పాపం మనీష.. నిజం తెలిసిపోతుందా..?

Brahmamudi Serial Today Episode October 28th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు, రాజుల పెళ్లికి లక్కీ స్కెచ్ వేశాడా..?  

సీరియల్ హీరోయిన్లకు డిమాండ్ ఎందుకు ఎక్కువ..? ఇదే నిజమా..?

Wedensday TV Movies : బుధవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..

Big Stories

Advertisement
×