E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode October 28th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు, రాజుల పెళ్లికి లక్కీ స్కెచ్ వేశాడా..?  

Brahmamudi Serial Today Episode October 28th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు, రాజుల పెళ్లికి లక్కీ స్కెచ్ వేశాడా..?  
Advertisement

Brahmamudi serial today Episode: వెంకీ కేసు కొట్టేశాడని చెప్పడానికి చలపతి ఇంటికి వెళ్లిన నందును డోర్‌ దగ్గరే నిలబెట్టి మాట్లాడతారు. నందు బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతుంటే.. లక్ష్మీ బాధగా వెంకీ దగ్గరకు వెళ్లి ఒరేయ్‌ నువ్వన్నా మాట్లడదరా నందు వెళ్లిపోతుంది అని రిక్వెస్ట్‌ చేస్తే.. వెంకీ. చలపతి వైపు చూస్తూ చలపతి వెళ్లి మాట్లాడు అన్నట్టు సైగ చేస్తాడు. వెంకీ బయటకు వెళ్లి నందుకు థాంక్స్‌ చెప్తాడు. ఎందుకు నీ కేస కొట్టేసినందుకా అని నందు అడిగితే.. నా విషయంలో నువ్వు చాలా రిస్క్‌ తీసుకున్నావు అంటూ వెంకీ మాట్లాడుతుంటే..

మనసులో ఉన్నదే బయటకు మాట్లాడు నువ్వు అలా మాట్లాడిన రోజు నేను నీతో మాట్లాడతాను అంటూ వెళ్లిపోతుంది నందు. ఇంట్లో లక్ష్మీ కోపంగా చలపతిని తిడుతుంది. నందు చాలా మంచి అమ్మాయి. వెంకీ కోసం ఎంత కష్టపడింది. తాను చెప్పినట్టే వెంకీని ఈ కేసును నుంచి బయట పడేసింది. కనీసం థాంక్స్‌ అమ్మా అని ఒక్కమాట కూడా చెప్పాలనిపించలేదా..? నీకు అంటూ నిలదీస్తుంది. లక్ష్మీ మాటలకు చలపతి ఎమోషనల్‌ అవుతాడు. నేనే తప్పు చేశాను. తనకు కృతజ్ఞతలు చెప్పకుండా తప్పు చేశాను. అంటూ బాధపడతాడు.

Advertisement

ఇంటికి వెళ్లిన రాజు, ఇందు కోపంగా ఐశ్వర్యను పిలుస్తారు. ఐశ్వర్య రాగానే కిందకు వచ్చి ఏంటి అరుస్తున్నారు అంటే రాజు కోపంగా తన చేతిలో ఉన్న పేపర్స్‌ విసిర కొట్టి నా తమ్ముడిని ఎందుకు అరెస్ట్‌ చేయించావు అంటూ ప్రశ్నిస్తాడు. దీంతో ఐశ్వర్య తిడుతుంది. నేనెందుకు అరెస్ట్‌ చేయిస్తాను.. మీ తమ్ముడిని అరెస్ట్ చేయించడంలో నాకేం లాభం అంటూ ప్రశ్నిస్తుంది. రేఖ, భ్రమరాంబ కూడా రాజును తిడతారు. అపర్ణ అడ్డుపడుతుంది. వాళ్ల తమ్ముడు ఏ తప్పు చేయలేదని డాక్యుమెంట్స్‌ చూపిస్తున్నాడు కదా.. అంటే.. ఐశ్వర్య కూడా తాను ఏ తప్పు చేయలేదని చెప్తుంది. కదా ఇప్పుడు నా ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్తారు అంటూ అడగ్గానే.. నందు పోలీసులతో వచ్చి నేను చెప్తాను అంటుంది. నందును చూసి అందరూ షాక్‌ అవుతారు. నందు ఇంట్లోకి వచ్చి మేనేజర్‌ వీడియో అందరికీ చూపిస్తుంది.

చెప్పు ఐషు ఇంకా ఏవైనా మాటలు ఉన్నాయా..? అంటూ అడుగుతుండగానే.. జీఆర్‌ కంపెనీ నుంచి మేనేజర్‌ వస్తాడు. ఇంకా వాళ్లతో మాటలేంటండి వాళ్లను వెంటనే జైళ్లో వేయించండి అంటాడు. మిమ్మల్ని నమ్మి మేము నిలువునా మునిగిపోయాము అంటాడు. వెంకీ తప్పు చేశాడని తెలిసిన వెంటనే అరెస్ట్‌ చేశారు కదా ఇప్పుడు ఈ అమ్మాయిని అరెస్ట్‌ చేయండి అంటాడు. ఐశ్వర్య కోపంగా ఏంటి అది వచ్చి నన్ను అరెస్ట్‌ చేస్తుంటే.. చూస్తూ ఊరుకుంటాను అనుకున్నారా..? నాకున్న ఇన్లియెన్స్‌తో నందును సస్పెన్షన్‌ చేయిస్తాను అంటుంది. అపర్ణ కోపంగా ఐశ్వర్యను తిట్టి అరెస్ట్‌ చేయమని చెప్తుంది. నందు అరెస్ట్‌ చేస్తుంటే.. ఇందు అడ్డుపడుతుంది. ఐశ్వర్యను అరెస్ట్‌ చేసే పోయేది దుగ్గిరాల ఫ్యామిలీ పరవేనని చెప్తుంది. జీఆర్‌ కంపెనీ మేనేజరుకు జరిగిన నష్టాన్ని తాను భర్తీ చేస్తానని చెప్తుంది. తిరిగి వాళ్లకు పూర్తి క్వాలిటీతో అభరణాలు చేయిస్తానని మాటిస్తుంది. మీరు కంప్లైంట్‌ వెనక్కి తీసుకోండి అని చెప్పగానే.. మేనేజర్‌ సరే అంటూ వెళ్లిపోతాడు.

Advertisement

ఇంకోసారి ఇది రిపీట్‌ అయితే ఈ ఇంట్లో నీ స్థానం ఉండదు అంటూ వార్నింగ్‌ ఇస్తే.. భలే నాటకం ఆడుతున్నారు ఇద్దరూ నన్ను కాపాడినట్టు మీరు చేయడం తర్వాత నేను నిన్ను దేవతలా చూడాలనే కదే నువ్వు కోరుకునేది అంటూ తిడుతుంది. ఆస్థి కోసం నువ్వు ఇంట్లో అద్బుతంగా నటిస్తున్నావు అంటుంది. నీలా నేను ఆస్థి కోసం అడ్డదారులు తొక్కలేదు. తప్పులు చేయలేదు అంటూ ఇందు తిడుతుంది. దీంతో ఐశ్వర్య కోపంగా నన్నే అంత మాట అంటావా..? అంటూ ఇందును కొట్టబోతుంటే.. రాజు కోపంగా ఐషు అంటూ కొట్టబోతుంటే.. లక్కీ రేయ్‌ అంటూ రాజు చేయి పట్టుకుని చేయి దించు మామ.. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా భార్య మీద చేయి ఎత్తుతావు అంటాడు. అందరూ షాకింగ్‌గా చూస్తుంటారు. రేఖ నవ్వుకుంటుంది. రాజు, లక్కీ మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. లక్కీని భ్రమరాంబ ఇంకాస్త రెచ్చగొడుతుంది.

దీంతో లక్కీ ఆవేశంలో ఇందు, రాజుల మధ్య పెళ్లి జరగలేదని డబ్బుల కోసం అద్దెమొగుడిగా వచ్చిన నీకేందుకు ఇందు మీద అంత ప్రేమ అంటూ నిజం చెప్పేస్తాడు. రేఖ ఏంటి లక్కీ ఏంటో చెప్పు అంటే ఇందు డైలీ పేమెంట్‌ ఇచ్చి అద్దెమొగుడిగా నటిస్తున్నాడు అంటూ ఈ ఇంటికి అసలైన అల్లుడిని నేనే అసలు ఎవడివిరా నువ్వు అంటాడు. ఇంతలో  ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda GudiGantalu Today episode: బాలుకు దిమ్మతిరిగే షాక్.. శోభా, చింతామణి కలిసిపోయారు.. గుణ అవుట్..

Karthika Deepam 2 Serial Today Episode October 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ రూంలోకి వెళ్లిన జ్యోత్స్న షాక్ అవ్వడానికి కారణం ఏంటి..? 

Podarillu Today Episode : కన్నాపై మహా సీరియస్.. పాపం మనీష.. నిజం తెలిసిపోతుందా..?

Illu Illalu Pillalu Today Episodes: భద్ర ప్లాన్ సక్సెస్.. అడ్డంగా దొరికిపోయిన సాగర్.. వల్లికి విడాకులు..?

సీరియల్ హీరోయిన్లకు డిమాండ్ ఎందుకు ఎక్కువ..? ఇదే నిజమా..?

Wedensday TV Movies : బుధవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 28th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును రామ్మూర్తి సేఫ్ గా హైదరాబాద్ తీసుకొస్తాడా..?        

Big Stories

Advertisement
×