Krishnagiri: ఫ్యామిలీలో చిన్న చిన్న సమస్యలు అగాధాన్ని సృష్టిస్తున్నాయి. ఫలితంగా గొడవలు, ఆపై హత్యలు చేసుకునే వరకు వెళ్లిన సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా తమిళనాడులో ఊహించని ఘటన వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ సాక్షిగా అల్లుడి చిక్కాడు, ఆపై జైలుకి వెళ్లాడు. అసలు ఏం జరిగింది?
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా మాథుర్ సమీపంలోని కన్నండ అల్లి ప్రాంతంలో నారాయణ స్వామి ఫ్యామిలీ ఉంటోంది. ఆయన వయస్సు 70 ఏళ్లు. ఆయన అల్లుడు చంద్రశేఖరన్ – అతడి భార్య మధ్య తరచుగా కలహాలు జరిగేవి. దీని కారణంగా గడిచిన 6 నెలలుగా తండ్రి నారాయణ స్వామి వద్దకు కూతురు వచ్చి ఉంటోంది. తన భార్య ఎంతకూ రాకపోవడంతో చంద్రశేఖరన్ తట్టుకోలేక పోయాడు. రోజురోజుకూ ఆవేశం పెరిగిపోవడంతో తట్టుకోలేక పోయాడు.
చివరకు 14న చంద్రశేఖరన్ తన భార్యను తీసుకు వెళ్లడానికి మామ నారాయణ స్వామి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో మామ-అల్లుడు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే గొడవ కాస్త జఠిలం కావడంతో ఆగ్రహానికి గురైన చంద్రశేఖరన్, సుత్తి, కత్తితో మామపై దాడి చేశాడు. తల, శరీరంపై దారుణంగా దాడి చేశాడు. చంద్రశేఖరన్ భార్య, కుటుంబసభ్యులు ఆపినప్పటికీ చంద్రశేఖరన్‌ను ఏ మాత్రం కంట్రోల్ కాలేదు.
పదేపదే మామపై దాడి చేశాడు. కుటుంబ సభ్యుల అరుపులు విన్న ఇరుగు పొరుగు వారు అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చారు. వారంతా వచ్చేలోపు చంద్రశేఖరన్ అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న నారాయణస్వామిని బంధువులు చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రి తరలించారు. ఇంటెన్సివ్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు వైద్యులు. మామపై అల్లుడు దాడి చేసిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ALSO READ: డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్.. ఇండియన్ అమెరికన్ సర్వేలో షాకింగ్ ఫ్యాక్ట్స్?
ఈ ఘటనపై బాధితుల కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాథుర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న చంద్రశేఖరన్‌ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు తీవ్రతరం చేశారు. 17న చంద్రశేఖరన్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు.
In #TamilNadu #Krishnagiri district, in the Kannandahalli area, due to a family dispute, the 70-year-old father-in-law was brutally attacked with a stick and knife by his son-in-law who entered the house.
The elderly man, who sustained serious injuries in this incident, has been… pic.twitter.com/xeNGUoLFU7
— Siraj Noorani (@sirajnoorani) October 27, 2026