Podarillu Today Episode October 29th: కన్నా నారాయణని తప్పుగా మాట్లాడడంతో మహాలక్ష్మి చాలా కోపంగా ఉంటుంది. నీకు ఎన్ని సార్లు చెప్పాను. ఆయనకు మీ అమ్మకు ఎటువంటి సంబంధం లేదు అని కానీ నువ్వు అస్సలు వినకుండా ఇలా ఆయనపై సీరియస్ అవుతున్నావు. మర్యాదగా ఉండు అనేసి ఎంతగా చెప్తున్నా సరే కన్నా మాత్రం మా అమ్మని చంపేశాడు అనేసి అంటుంది. అయితే మహా ఎంత చెబుతున్న సరే కన్నా మాత్రం అస్సలు వినకపోవడంతో కన్నాని కొడుతుంది ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఆయన గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు ఎందుకు నువ్వు ఆయనని ఇలా తప్పుగా అనుకుంటున్నావు నీ కన్నతండ్రి గురించి నువ్వు ఇలా మాట్లాడటం అవసరమా అని వార్నింగ్ ఇస్తుంది.. కానీ ఎంతగా చెబుతున్నా సరే అసలు వినకపోవడంతో మహాలక్ష్మి సీరియస్ అవుతుంది. దాంతో అక్కడితో కన్నా వెళ్లిపోతాడు.
మహాలక్ష్మి నారాయణని అంతగా సపోర్ట్ చేయడంతో ఇంట్లో వాళ్ళందరికీ ఒక్కసారిగా అనుమానం వస్తుంది. అయితే అక్కడికి ఏం జరిగింది అని తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. క చక్రి నారాయణ గురించి మీకేం తెలుసు అని మీరు ఆయనని సపోర్ట్ చేస్తున్నారు. అసలు నారాయణ గురించి మీకేం తెలుసు కన్నా గురించి మీకేం తెలుసు అని మహాలక్ష్మిని చక్రి అడుగుతాడు. ఆ నిజం తెలిసి తట్టుకునే శక్తి మీకుందా..? అసలా నిజమంటే మీకు చెప్తాను అని మహాలక్ష్మి అనగానే మాధవ్ మాత్రం అస్సలు వద్దు అని అంటాడు.. అయితే మహాలక్ష్మి చెప్పిన నిజం విని ఇంట్లోని వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు. నారాయణ గ్రేట్ అని అనుకుంటారు అయితే మా అమ్మ ఎందుకు చనిపోయింది అని ఆలోచిస్తారు మొత్తానికి నారాయణ గురించి భయంకరమైన నిజం తన కొడుకులకు తెలిసిపోవడంతో నారాయణ మీద ప్రేమ పెరిగిపోతుంది.
కన్నా తన సొంత తమ్ముడు కాదని తెలుసుకున్న చక్రి చాలా ఫీల్ అయిపోతుంటాడు. వాడు మా తల్లి కొడుకు కాదు అన్నప్పుడు మాకు ఇంత బాధపడలేదు కానీ.. అయితే ఈరోజు కన్న తండ్రి కూడా కాదు అని తెలిసిన తర్వాత మాకు ఇంకా బాధగా ఉంది అసలు నమ్మలేకపోతున్నాము అని చక్రీ అంటాడు.. ఎంత జరిగినా కూడా ఈ విషయాన్ని మాత్రం అసలు నమ్మలేకపోతున్నాను అని చక్రి చాలా బాధపడిపోతూ ఉంటాడు. అయితే వాడు నా సొంత తమ్ముడు కాదు అన్నా నిజాన్ని నేను అసలు జీర్ణించుకోలేకపోతున్నాను అని చక్రి అనగానే మాధవ్ వాడు ఎవడు ఏమనుకున్నా కూడా వాడు మన తముడే.. తల్లి తండ్రి వేరైనా కూడా మన ఆప్యాయత పంచుకొని పుట్టాడు కాబట్టి వాడు కచ్చితంగా మన తమ్ముడే దేవుడు ఇచ్చిన తమ్ముడే అని మాధవ అంటాడు..
కేశవ ఏంటి అన్నయ్య అలా మాట్లాడుతున్నావ్? ఎవరేమనుకున్నా కూడా వాడు మన తమ్ముడే మన రక్తం పంచుకొని పుట్టకపోయిన కూడా వాడు నా తమ్ముడే అని కేశవ అంటాడు.. వాడు ఎవరేమనుకున్న మన తమ్ముడే మనం ఎప్పటిలాగే.. మనం చూసుకుందాము అని కన్నీళ్లు పెట్టుకుంటాడు అంతేకాదు మహాలక్ష్మి వాన్నీ కొట్టినందుకు నా మనసు జివ్వుమని అంది. మీరు కన్నా నీ కొట్టినప్పుడు నేను చాలా బాధపడ్డాను.. నా మనసు ఏదోలా అనిపించింది కానీ, మీరు ఒక తల్లిలాగా వాన్ని కొట్టారని నాకు అర్థం అయింది. ఇప్పుడు మిమ్మల్ని చూసి నాకు చాలా గర్వంగా ఉంది అని మహాలక్ష్మి దగ్గరికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంటాడు కేశవ..
కన్నా కోసం అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు వాడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటో వెతకాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే కన్నా కోసం నారాయణ వెళ్ళాడు కదా కొడుకుని ఎలాగో వదిలిపెట్టడు వెతుక్కుంటూ వెళ్ళాడు కదా తీసుకొని వస్తాడులే అని మహాలక్ష్మి అంటుంది. వాడికి నిజం తెలిస్తే ఎంతో బాధపడిపోతాడు. అయితే కన్న మాత్రం బయట నడుచుకుంటూ వెళ్తూ నన్ను ఎవరూ వద్దనుకుంటున్నారు. నారాయణని గ్రేట్ అని అంటున్నారు వదిన కూడా నారాయణ గ్రేట్ అని అంటుంది. అయితే నారాయణ తన కొడుకుని ఫాలో అవుతూ ఎమోషనల్ అవుతాడు అక్కడ సత్య కనిపించడంతో నా కన్నా చాలా కోపంగా మాట్లాడుతాడు. సత్య చాలా ఫీల్ అవుతుంది కన్నా ఆ మాటలు అనగానే నారాయణ కూడా చాలా ఫీల్ అవుతాడు.
రాత్రి మహాలక్ష్మి ఫోన్ చేసి నువ్వు ఇంటికి రాకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని మహాలక్ష్మి అనగానే.. కన్నా చాలా సీరియస్గా ఇంటికి వస్తాడు. అయితే కన్నా ఇంట్లోకి రాగానే మీరు అసలు నా అన్నయ్య లేనా నిజంగానే నా సొంత అన్నయ్యలా మీరు అని అడుగుతాడు. అయితే ఇంట్లోకి రాగానే ఏంట్రా మాటలు ఎందుకురా నువ్వు అలా అంటున్నావు అని మాధవ్ చాలా ఫీల్ అవుతాడు ఇంట్లోని వాళ్ళందరూ కూడా కన్నతో మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా తను మాత్రం అస్సలు వినడు. అయితే కన్నా మాటలు విన్న మహాలక్ష్మి కూడా షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..