Karthika Deepam 2 serial today Episode: జ్యోత్స్న రెస్టారెంట్‌కు వెళ్లిన శివనారాయణ ఫ్రెండ్స్.. తాము పెద్ద ఆర్డర్ ఇవ్వడానికి వచ్చామని చెప్తారు. మాలిని ముందే శివనారాయణ గొప్పదనం గురించి మాట్లాడుకుంటారు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అయినా ఎక్కడా అహంకారం చూపని మంచి మనిష అంటారు. ఇలా శివనారాయణ గురించి ఎక్కువ పొగుడుతుంటే.. మాలిని ఇరిటేట్ అవుతుంది. సార్ పొగిడింది చాలు వెళ్లి మీరు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పాలని ఉంది కానీ వద్దులే అనుకుంటూ కామ్‌గా ఉండిపోతుంది. వాళ్లు దీప దగ్గరకు వెళ్లి ఆర్డర్ చేసి వెళ్లిపోతారు.
వాళ్లు వెళ్లిపోగానే.. కార్తీక్ వెళ్లి ఫస్ట్ ఆర్డర్ సక్సెస్ చేయాలి అంటాడు. మాలిని వెళ్లి ఎందుకురా వాళ్లకు నిజం చెప్పలేదు.. అని అడుగుతుంది. ఒక్క నిజం చెప్పాల్సి వస్తే మిగతా నిజాలు అన్ని చెప్పాలి… అవి మీ దగ్గర మొదలుపెట్టి మీ దగ్గరే ఎండ్ అయ్యేంత నిజాలు అంటూ కార్తీక్ చెప్పగానే.. మాలిని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తన సీట్‌లో కూర్చుని అంతా గమనిస్తున్న జ్యోత్స్న, మాలిని దగ్గరకు వెళ్లి అత్తా నీ కొడుకు కూడా నిజం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు కదా అది అడగవా నువ్వు అంటుంది. నా కొడుకు ఏం నిజం చెప్పలేదే..? అని మాలిని అడిగితే.. అదే అత్త సూరజ్, జ్యోత్స్నలు భార్యాభర్తలు కదా అంటే.. నీ కొడుకు వింటూ ఉన్నాడు తప్ప నిజం చెప్పలేదు.. ఆ విషయం గురించి నువ్వెందుకు సూరజ్‌ను అడగలేదు అంటే.. మాలిని కోపంగా జ్యోత్స్నను తిట్టి పంపిచేసి ఆలోచనలో పడిపోతుంది.
తర్వాత మేనేజర్‌ను పిలిచి మాలిని..శివనారాయణ ఫ్రెండ్స్ ఎంత ఆర్డర్ ఇచ్చారని అడుగుతుంది. వెయ్యి ప్లేట్ల భోజనానిక ఆర్డర్ ఇచ్చారని.. ఒక్కో ప్లేట్ 15 వందలు మేడం అంటూ మేనేజర్ చెప్పగానే.. ఎంత మిగులుతుంది అని మాలిని అడిగితే.. ఒక్కో ప్లేట్ మీద మూడు వందల దాకా మిగులుతుంది మేడం అంటూ మేనేజర్ చెబితే.. సగానికి సగం మిగిలేలా ప్లాన్ చేయండి అంటూ ఆర్డర్ వేస్తుంది మాలిని. అలా అయితే నాసిరకం మెటీరియల్ వాడాల్సి వస్తుంది మేడం.. అంటూ మేనేజర్ చెప్పినా వినకుండా అయినా సరే నాసిరకం వాడతారో ఇంకే చేస్తారో నాకు తెలియదు కానీ ఒక్కో ప్లేట్ మీద సగం డబ్బులు మిగలాలి అని చెప్తుంది మాలిని.. మేనేజర్ అలాగే మేడం అంటూ వెళ్లిపోతాడు. ఆలా నాసిరకం వంటకాలు సిద్దం చేస్తేనే కదా జ్యోత్సన్ రెస్టారెంట్ బ్రండ్ పడిపోయేది అని మనసులో అనుకుంటుంది మాలిని.
సుమిత్ర వంట మనిషిగా కుదరిని ఇంటికే పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి వెళ్తాడు దశరథ. సుమిత్ర వంట చేస్తూ.. దశరథ రావడం గమనిస్తుంది కానీ కిచెన్‌లోంచి బయటకు రాదు. వంట పూర్తయ్యాక ఆ రుచులు చూసిన వ్యక్తులు జీతం కొంచెం ఎక్కువ ఇస్తామని తమ ఇంటికి వంట మనిషిగా రమ్మని అడిగితే.. సుమిత్ర తిరస్కరిస్తుంది. ఇక అదే ఇంట్లో ట్యూషన్ల చెప్పడానికి పదివేలకు దశరథ జాయిన్ అవుతాడు.
శివనారాయణ ఫ్రెండ్స్ తమను భార్యాభర్తలు అంటుంటే ఎందుకు అడ్డు చెప్పలేదని సూరజ్, జ్యోత్స్నను అడుగుతాడు. మీరెందుకు చెప్పలేదు సార్ అని జ్యోత్స్న అడుగుతుంది. తన పెళ్లి జరగలేదని ఎలా చెప్పగలను.. అంటూ జ్యోత్స్న ఎమోషనల్ అవుతుంది. వేయి ఆశలతో పెళ్లి పీటలెక్కిన నాకు ఎంత పెద్ద గాయం చేశావో నీకు తెలుసా..? అంటూ సూరజ్‌ను ప్రశ్నిస్తుంది. దీంతో సూరజ్, జ్యోత్స్న మధ్య గొడవ జరుగుతుంది. ఇంతలో జ్యోత్స్న పడిపోబోతే సూరజ్ పట్టుకుంటాడు. ఇద్దరి మధ్య చూపుల సంభాషణ జరుగుతుంది.
తర్వాత శివనారాయ ఒక్కడే టిఫిన్ బండి పనులు చేసుకుంటుంటే.. దీప వెళ్లి సాయం చేస్తా అంటుంది. అందుకు శివనారాయణ వద్దని సుమిత్ర వస్తుందిలే అంటాడు. అయినా వినకుండా దీప వెళ్లి పని చేయబోతుంటే.. జ్యోత్స్న వచ్చి చూసి నువ్వుండు దీప నేను చేస్తాను అంటుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.