Illu Illalu Pillalu ToIlluday Episode August 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. వ్రతం చెయ్యాలంటే ఖచ్చితంగా నగలను పూజలు పెట్టాలని నర్మదా అంటుంది. నగల కోసం వెళ్లిన శ్రీవల్లి లోపలి నుంచి ఎంతసేపటికి బయటికి రాదు. అయితే రామరాజు మాత్రం పూజకు టైం అవుతుందని, తిరుపతిని వాళ్ళని పిలవమని అక్కడికి పంపిస్తాడు రామరాజు.. ఎప్పుడూ నాకు మొదటి నుంచి గండికోట రహస్యం లాగే కనిపిస్తున్నారు.
అయిపోయింది మొత్తం అయిపోయింది నాకు కాపురం కూలిపోయింది అని వల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. వల్లి తన నగలని ఒక ప్లేట్లో పెట్టుకుని ముసుగేసుకుని వస్తుంది. నర్మదా ప్రేమలకు ఇద్దరికీ డౌట్ వస్తుంది.. ఆ మూసుకుని తీసి అక్క ఏంటి నగలు తీసుకురమ్మంటే ఇలా తెచ్చావు అని అడుగుతారు. ఆ కలశంలోని నగలను తీసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ అవి బయటికి రాకపోవడంతో కలశాన్ని పూజలో పెడతారు.. ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. నర్మద వాళ్ళకి మనం దొరికితే ఖచ్చితంగా మన బండారం బయట పెడతారని అక్కడనుంచి ఎలాగైనా ఊడయించాలని భాగ్యం ఆనందరావు అనుకుంటారు.. ఉదయం భాగ్యం ఆనందరావు ఇంటిని కాళీ చేసి వెళ్లిపోవాలని అనుకుంటారు. అయితే తలుపు తీయగానే ఎదురుగా నర్మదా ప్రేమలు అక్కడ ఉంటారు. మేము ఇంత పగడ్బందీగా ప్లాన్ చేస్తే మీరు ఎలా వచ్చారు అని ఆనందరావు అడుగుతారు. అయితే ఇలా వచ్చాము అని నర్మదా లొకేషన్ అడ్రస్ ని చూపిస్తుంది. అది చూసిన ఆనంద్ రావు భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతారు.
మాకు రెండిల్లు ఉన్నాయి. కోట్ల ఆస్తుంది.. మేము కోటీశ్వరులం అని చాలా గొప్పగా చెప్పుకున్నారు కదా ఇవేనా మీకున్న ఆస్తి అని నర్మదా అంటుంది. మీ ఇల్లు చాలా బాగుంది ఈ విషయాన్ని వెంటనే మావయ్య గారికి చెప్పాలి అని నర్మదా, ప్రేమ బయలుదేరుతారు.. ఈ విషయం రామరాజు బావ గారికి తెలిస్తే ఇంక మన పని అంతే అని ఆనందరావు టెన్షన్ పడుతూ ఉంటాడు. అటు వాళ్ళిద్దరూ ఎంత చెప్తున్నా సరే నర్మదా ప్రేమలు వినకుండా బయటికి వచ్చేస్తారు.
ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు ఒకచోటికి వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. రామరాజు ఏంట్రా పెద్దోడా 10 లక్షలు ఎగ్గొట్టినట్లు ఆ మొహం ఏంటి అలా పెట్టావని అనగానే చందు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక వేదవతి, రామరాజు ఇద్దరు మాట్లాడుకోవడం చూసి ముగ్గురు కొడుకులు అమ్మానాన్న ఇంత సంతోషంగా ఉండడం చూసి చాలా రోజులైంది అని అనుకుంటారు.. వేదవతి కూడా ఇంట్లో చాలా సంతోషంగా అందరూ కనిపిస్తున్నారు. వ్రతం జరిగిన తర్వాత ద్వేషాలు అన్నీ పోయి అందరూ సంతోషంగా ఉన్నట్లు ఉంది కదా అని రామరాజుని అడుగుతుంది.
ముగ్గురు కోడళ్ళు కలిసి వ్రతం చేయడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి ఇది మీరు గమనించారా అని వేదవతి రామరాజుని అడుగుతుంది. ఇక అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే ప్రేమ నర్మదా ఇంట్లోకి ఆవేశంగా వస్తారు. శ్రీవల్లి మీతో ఒక విషయం మాట్లాడాలి పక్కకు రండి అని అడుగుతుంది. ఏంటి మా ఇంటికి వెళ్లొచ్చారంట అని అడుగుతుంది. అవును వెళ్లొచ్చాము. మొత్తం మావయ్య గారికి ఈరోజు చెప్పేస్తాము అని నర్మద ప్రేమ శ్రీవల్లికి మార్నింగ్ ఇస్తారు.
శ్రీవల్లి మాత్రం ఎక్కడ తగ్గకుండా నా గురించి నా ఇంటి విషయాల గురించి చెప్పడానికి నువ్వు ఎవరు అని వాళ్ళతో అంటుంది.. ఎక్కడ పశ్చాత్తాపం పడకుండా మా గురించి చెప్పడానికి నువ్వెవరు అని అడుగుతున్నావు అని ప్రేమ దిమ్మ తిరిగిపోయేలా శ్రీవల్లికి క్లాస్ పీకుతుంది. చూసావా అక్క మనము ఎంత జాలి చూపిస్తున్నా ఈమె ఇంకా రెచ్చిపోతుంది అని ప్రేమ అంటుంది. నర్మద కూడా ఇక మమ్మల్ని మేము ఆగము. బండారు మొత్తం బయటపెట్టేస్తాము అని అంటారు.
Also Read: పల్లవికి దిమ్మతిరిగే షాకిచ్చిన పల్లవి.. ఇంట్లోంచి వెళ్ళిపోయిన ఆరాధ్య..
ఆఖరికి శ్రీవల్లి ఈ నిజం తెలిస్తే మావయ్య గారు గుండె ఆగిపోతుందని చెప్పినా సరే ప్రేమ నర్మద మాత్రం వినకుండా.. ఖచ్చితంగా మావయ్య గారికి విషయాలన్నీ చెప్పాలని లోపలికి వెళ్తారు.. నర్మదాప్రేమ రామరాజు దగ్గరికి వచ్చి మావయ్య గారు మీకు ఒక విషయం చెప్పాలి అని అడుగుతారు.. ఏంటమ్మా ఎవరి గురించి అని రామరాజు అడుగుతాడు. వల్లి అక్క గురించి అని అనే లోపల రామరాజుకి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ రాగానే టెన్షన్ పడుతూ ఉంటాడు. వేదవతి ఏమైందని అడుగుతుంది.. మన రైస్ మిల్లులో దొంగలు పడి ఐదు లక్షలు దోచుకుని వెళ్లారంట నేను వెళ్తున్నాను అని వెళ్తాడు. శ్రీవల్లి మాత్రం ఇప్పుడు ఆగిపోయారు మరి కాసేపట్లో ఈ విషయాన్ని చెప్పేసి నాకు కాపురాన్ని కూల్ చేస్తారని టెన్షన్ పడుతూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో భాగ్యం ఆనందరావు అసలు నిజాన్ని చెప్పబోతారు… ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..