Bigg Boss AgniPariksha:బుల్లితెర ప్రేక్షకులను గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏడాది నిర్విరామంగా అల్లరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg boss) . ఎన్టీఆర్ (NTR) తో మొదలైన తెలుగు సీజన్ వన్ ఇప్పుడు నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా మరింత వేగంగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ తెలుగు షో ఇప్పుడు 9వ సీజన్ కి సన్నహాలు సిద్ధం చేసుకుంటుంది. అయితే మునుపెన్నడూ లేని విధంగా ఈసారి కామన్ మ్యాన్ క్యాటగిరిలో ఏకంగా 5 మంది హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. అంతేకాదు వీరందరికీ ‘అగ్నిపరీక్ష’ అంటూ ముందే టెస్ట్ పెట్టి, ఆ తర్వాత హౌస్ లోకి పంపించబోతున్నారు. ఇకపోతే అగ్నిపరీక్ష షోలో హైలెట్గా నిలిచిన వ్యక్తి మాస్క్ మ్యాన్. ఇతడి గురించి తెలుసుకోవడానికి ఆడియన్స్ సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఎవరో ఇప్పుడు చూద్దాం.
బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనడానికి 20వేల దరఖాస్తులు..
డబుల్ హౌస్.. డబుల్ డోస్.. డబుల్ ఎంటర్టైన్మెంట్ అంటూ బుల్లితెర ఆడియన్స్ ను అలరించడానికి సిద్ధమవుతోంది టీవీ షో బిగ్ బాస్. సెప్టెంబర్ 5వ తేదీ నుండి ఈ షో ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే సెలబ్రిటీలతోపాటు సామాన్య ప్రజలకి కూడా ఈ రియాల్టీ షోలో పాల్గొనే అవకాశాన్ని ఈసారి నిర్వహకులు కల్పిస్తున్నారు.. ఇందులో భాగంగానే బిగ్ బాస్ అగ్నిపరీక్ష అంటూ ఒక కొత్త కాంటెస్ట్ ని కూడా ప్రకటించడం జరిగింది. దీనికోసం సుమారుగా 20వేల మంది దరఖాస్తు చేసుకోగా దశలవారీగా వారిని ఫిల్టర్ చేసి వంద మందిని ఎంపిక చేశారు ఆ వంద మందిలో మళ్ళీ 45 మందిని ఎంపిక చేసి వీరికి అగ్నిపరీక్ష అనే కార్యక్రమంలో రకరకాల టాస్కులు నిర్వహించబోతున్నారు.
అగ్నిపరీక్షలో హైలెట్ గా నిలిచిన మాస్క్ మ్యాన్..
ఈ టాస్కుల్లో గెలిచిన ఐదు మందిని బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కి ఎంపిక చేయనున్నారు. ఇలా ఎంపిక చేయడం కోసం జడ్జీలుగా బిందు మాధవి (Bindu Madhavi), అభిజిత్(Abhijith ), నవదీప్(Navadeep )ను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 5 వరకు ఈ బిగ్ బాస్ అగ్నిపరీక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు హౌస్ లోకి వెళ్లబోయే ఐదు మంది ఎవరో తెలిసిపోయింది. అందులో ఒకరు మాస్క్ మ్యాన్. ఈయన పేరు హరీష్ (Harish)అట.. అగ్నిపరీక్షలో భాగంగా ఇచ్చిన టాస్కులు అన్నింటిని కూడా అవలీలగా కంప్లీట్ చేసి తన స్పీడుతో జడ్జిలను కూడా ఆశ్చర్యపరిచారట . బిగ్బాస్ 9 లోకి కంటెస్టెంట్గా అడుగుపెడితే ఫన్ అదిరిపోతుందని అటు బిగ్ బాస్ యాజమాన్యం కూడా భావించిందట. అందుకే చూడడానికి ఫన్నీగా కనిపించే ఈ మనిషిని ఇప్పుడు కంటెస్టెంట్ గా సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సీజన్ 9కి అవకాశం కొట్టేసినట్టేనా..?
ఇకపోతే హౌస్ లో రాణించాలి అంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. కానీ ఈ మాస్క్ మ్యాన్ లో అది కనిపించడం లేదని తెలుస్తోంది.. ఒకవేళ ఇతడు హౌస్ లోకి అడుగుపెడితే అందరితో కలిసిపోతాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా ఇతను షో మొత్తం మాస్క్ పెట్టుకునే కనిపిస్తాడట. మరి దీనిని బిగ్ బాస్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికైతే మాస్క్ మ్యాన్ అనుమానాలు రేకెత్తిస్తున్నారు. మరి హౌస్ లోకి అడుగు పెడతారో లేదో చూడాలి.
also read:Jr.NTR: దేవర 2 అందుకే ఆగిపోయింది.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన మేకర్స్!