Intinti Ramayanam Today Episode August 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతీపై పల్లవి సీరియస్ అవుతుంది. మీరు పెళ్లి చేశారు మళ్లీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని పల్లవి అంటుంది. అక్షయ్ కూడా భరత్ ని ఉద్యోగం లేదు అంటూ దారుణంగా అవమానిస్తాడు. వాళ్లు మాటలు విన్న ప్రణతి భరత్ ఇప్పుడు నా భర్త నా భర్తను అనే హక్కు మీకు లేదు అని అంటుంది. మన ఇంట్లో వంట మనిషి కూడా ఏదో ఒక జీతం ఏదో ఒక సొంత ఇల్లు అద్దె కొంప ఉంటుంది. వీడికి మాత్రం అవేవీ లేవు అని అక్షయ్ అంటాడు. నువ్వు కూడా వదినని చేసుకున్నావు కదా ఎందుకు ఇప్పుడు మమ్మల్ని ఇలా అంటున్నావు అమ్మ మమ్మల్ని అవమానించాలని ఇక్కడికి తీసుకొచ్చావా అని ప్రణతి అడుగుతుంది.. ప్రణతిని ఇంట్లోకి తీసుకొస్తుంది పార్వతి. ఎవరిని అంటున్న సరే మాటలు పట్టించుకోకుండా లోపలికి తీసుకొస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి నన్ను అసలు పట్టించుకోకుండానే పడుకున్నావు. అసలు ఉన్నావా లేదా అని కూడా నువ్వు ఆలోచిస్తున్నావా అని కమల్ ని అడుగుతుంది. ఇంట్లోని వాళ్ల గురించి వాళ్ళ సమస్యల గురించి నువ్వు పట్టించుకుంటున్నావా..? జరుగు నేను బెడ్ మీద పడుకుంటాను అంటే.. నువ్వు ఈ రూమ్ లో పడుకోవాలంటే నేల మీద పడుకోవాలి అని అంటాడు. పల్లవి నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు అని అంటుంది.
అక్షయ్ అవని దగ్గర్నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే ఆరాధ్య ఇంట్లోకి వస్తూ ఉంటుంది.. అయితే బయటికి వెళ్లిపోతున్న అక్షయ్ ని చూసి ఏమైంది ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతుంది.. నేను మీ అమ్మ దగ్గర ఉండలేనమ్మ ఏదిరి ఇంట్లోనే ఉంటాను కదా ఎప్పుడు కాబట్టి అప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి చూడొచ్చు అని అంటాడు. అక్షయ్ అలా వెళ్ళగానే ఆరాధ్య కూడా బ్యాగ్ ఇంట్లో వేసి బయటకు వెళ్ళిపోతుంది.. అక్షయ్ తన ఇంటికి వెళ్ళిపోతాడు.
ఆరాధ్య ఇంకా రాలేదు ఏంటి మావయ్య గారు ట్యూషన్ నుంచి వస్తుంది కదా ఆకలేస్తుందేమో ఏదైనా తీసుకొచ్చి పెడతానని అంటుంది. ఆరాధ్య బ్యాగు ఉంది కానీ తినెక్కడికి వెళ్ళింది అని అవని టెన్షన్ పడుతూ అక్షయ్ దగ్గరికి వెళ్తుంది. అక్షయ్ మాత్రం ఆరాధ్య నా దగ్గర లేదు అని అంటాడు. ఎక్కడికి వెళ్లిందో నాకు తెలీదు అని అంటాడు. నాతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు అని అరుస్తాడు. అవని మాత్రం ఆరాధ్య కోసం వెతుకుతూ ఉంటుంది.
ఈ టైంలో ఆరాధ్య ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అక్షయ్ కూడా బయటికి వెళ్లి వెతుకుతూ ఉంటారు. ఇద్దరూ కలిసి బయట వెతకడం మొదలు పెడతారు. అయితే.. ఆరాధ్య వెళ్ళిపోతుంటే వెనకాల బండి వస్తుంది. అయితే ఆరాధ్యను చూసి ఏంటమ్మా ఇలా వచ్చావు అంటే అమ్మానాన్న కలిసి ఉండకపోతే ఏం చేయాలి అని ఆరాధ్య అంటుంది. ఆరాధ్య కోసం మళ్లీ అక్షయ్ అవని ఇద్దరూ ఒకటవుతారు..
పార్వతి వాళ్ళ ఇంట్లో ప్రణతి అక్షయ్ భోజనానికి కిందకు వస్తారు.. వాళ్లొచ్చి కూర్చొని పల్లవి లేచి వెళ్ళిపోతుంది. అర్హత లేని వాళ్ళతో కూర్చొని తినడం నాకు అలవాటు లేదు అని పల్లవి అంటుంది. శ్రియను భరత్ కి వడ్డించమంటే నేను వడ్డించను అని వెళ్ళిపోతుంది.. ప్రణతి పల్లవికి దిమ్మదిరిగిపోయేలా సమాధానం చెబుతుంది. భానుమతి ఎవరు తిన్న తినకపోయినా అంటుంది.
Also Read :బాలు పై సత్యం సీరియస్.. బాలును వదిలేసిన మీనా.. ప్రభావతి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..
రాజేంద్రప్రసాద్ ఎక్కడికి వెళ్లారు అని అడుగుతారు.. అయినా వీడు రానని ఇంట్లోంచి వెళ్లిపోయాడు కదా మరి ఇప్పుడు ఎలా వచ్చాడు అని అడుగుతాడు.. ఆరాధ్యను ఏమి చెప్పద్దని అవని చెప్పడంతో ఏమి చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతుంది. పిల్లల మనసుని మీరు అర్థం చేసుకోవాలి అని అవని అక్షయకి క్లాస్ పీకుతుంది.. రాజేంద్ర ప్రసాద్ కు జరిగిన విషయాన్ని అవని చెప్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..