Illu Illalu Pillalu ToIlluday Episode july 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మద మాత్రం సాగర్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఒంటరిగా వస్తూ ఉంటుంది. ఎదురుగా సాగర్ రావడం చూసి సంతోషపడుతుంది. సాగర్ మాత్రం చూసి చూడనట్టు పక్కన ఉన్న షాప్ కి వెళ్తాడు. మా నాన్న బియ్యం ఇచ్చారంట కదా దానికి డబ్బులు తీసుకురామన్నారు అని అంటాడు. నర్మద ను పట్టించుకోకుండా అక్కడినుంచి సాగర్ వెళ్లిపోతాడు. నర్మద పిలుస్తున్న కూడా సాగరు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెనక్కి తిరిగి చూడగానే భాగ్యం కనిపిస్తుంది. నర్మదను భాగ్యం పిలుస్తుంది. నీకు ఎంత కష్టమొచ్చింది అమ్మాయి.. నీ పరిస్థితిని చూస్తుంటే నాకు గుండె తరుక్కుపోతుంది. కట్టుకున్న భార్య పిలుస్తున్న కూడా మీ భర్త పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు అంటూ భాగ్యం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇంత అవమానం ఎలా తట్టుకుంటున్నావు అని భాగ్యం రెచ్చగొడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. ధీరజ్ ఇంకా ఇంటికి రాలేదని ప్రేమ బయట వెయిట్ చేస్తుంది. అటు, ఇటు తిరుగుతూ ఉండడం చూసిన శ్రీవల్లి ఏంటి ప్రేమ నీకు బొట్టు కాటుక పెట్టి చెప్పాలా? టైం పది అవుతుంది లోపలికి రావా అని అంటుంది. ధీరజ్ ఇంకా రాలేదు అక్క వెయిట్ చేస్తున్నానని అంటుంది. నేను ఉదయం చెప్పలేదా మర్చిపోయావా పదిగంట్ల కల్లా ఇంట్లో అందరూ ఉండాలి అని.. ధీరజ్ వస్తే బయట ఉంటాడులే నువ్వు లోపలికి రా అని అడుగుతుంది. ధీరజ్ వచ్చిన తర్వాత తలుపు వేస్తాంలేని ప్రేమ. అదే మాట మావయ్యకి చెప్పు అని ప్రేమతో అంటుంది శ్రీవల్లి. కానీ ధీరజ్ మాత్రం రాలేదు . నువ్వు ఎలా తలపిస్తావో నేను చూస్తాను అని అంటుంది ప్రేమ. ప్రేమను బయటకు గేంటేసి శ్రీవల్లి తలిపెస్తుంది.
ప్రేమ ఈ వల్లి ఎందుకు ఇలా చేస్తుంది అని ఆలోచిస్తూ అక్కడే కూర్చుని ఉంటుంది.. అప్పుడే ధీరజ్ ఇంటికి వస్తాడు. నువ్వేంటి ఇక్కడ బయట కూర్చున్నావు అని అడుగుతాడు. సరే ఇంట్లోకి వెళ్దాం రా నాకు ఆకలేస్తుంది అని అడుగుతాడు.. అయితే ప్రేమ మౌనంగా ఉంటుంది. ధీరజ్ వెళ్లి తలుపు దగ్గరికి వస్తే తలుపు లాకేసారా ఏంటి అని అడుగుతాడు. 10 గంటలకు అలా ఇంటికి రాకపోతే కచ్చితంగా తలుపుకు తాళాలు వేస్తామని చెప్పారు కదా అని ప్రేమ అంటుంది. అయితే ధీరజ్ నాది లేట్ నైట్ 10:00 వరకు నేను చెయ్యాలి.
త్వరగా రావాలంటే ఎలా రావాలి ఇవేం రూల్స్ నాకు అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటాడు. నేనంటే లేటుగా వచ్చాను మరి నువ్వు ఎందుకు ఇంట్లో ఉండకుండా బయట ఉన్నావని ధీరథ అడుగుతాడు. తమరు ఇంకా రాలేదని వెయిట్ చేస్తూ ఉన్నాను ఆవిడ తలుపు వేసేసి వెళ్ళింది అని ప్రేమ అంటుంది. నీకు దండం పెడతానే నాకు బాగా ఆకలేస్తుంది. ఏదైనా ఇంట్లోకి వెళ్లడానికి మార్గం ఉందేమో చూడు అని అంటాడు. ధీరజ్ బాధని తట్టుకోలేని ప్రేమ ఒక కాయిన్ ఇవ్వు అని అడుగుతుంది. ఇప్పుడు బొమ్మ బొరుసు వాడే సమయమా అని అంటాడు.
Also Read :పార్వతి పై అవనికి అనుమానం.. పల్లవి ప్లాన్ తెలిసిపోతుందా..?
అయితే ప్రేమ ఆ కాయిన్ తీసుకొని కిటికీ ని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి అయితే వాళ్ళిద్దరూ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేస్తారు. తర్వాత రోజు ఉదయం శ్రీవల్లి చెప్పిన పనులన్నీ ప్రేమ చేయాలని ఆర్డర్ వేస్తుంది. ఈ పనులన్నీ నాకు చిన్నప్పటినుంచి అలవాటు లేవు ఇప్పుడు కొత్తగా పనులు చేయమంటే ఎలా చేస్తాను అని ప్రేమ తిట్టుకుంటూ పనులు చేస్తుంది. ధీరజ్ అది వింటాడు. అయితే ప్రేమ కోసం ధీరజు షాకింగ్ తీసుకుంటాడా? లేదా శ్రీవల్లి గురించి ఏదైనా ఆలోచిస్తాడు అన్నది సోమవారం ఎపిసోడ్లో చూడాలి..