Plane Crash: అమెరికాలో మరో విమాన ప్రమాదం తప్పింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో మంటలు చెలరేగాయి. డెన్వర్ నుంచి మియామికి వెళ్లేందుకు రన్‌వేపైన సిద్ధమైన విమానంలో మంటలను గుర్తించారు. వెంటనే ప్రయాణీకులను ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ల ద్వారా బయటికి పంపారు. ల్యాండింగ్ గేర్‌లో సమస్య కారణంగా మంటలు చెలరేగినట్టు గుర్తించారు. ప్రమాద సమయంలో విమానంలో 173 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ ప్రమాదంలో అంతా సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలైనట్టు అధికారులు ప్రకటించారు. ఇక టైర్ మెయింటనెన్స్‌లో లోపంతోనే మంటలు వచ్చినట్టు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఇక ఈ ప్రమాదంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు ప్రారంభించింది. మంటలను అదుపు చేసి విమానాన్ని తరలించామని ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రకటించింది.
Also Read: పకోడి, క్యాబేజీ కట్ చేస్తే ఆస్పత్రి.. స్కూల్లో 64 మందికి..
ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ చూస్తుంటే ప్రమాద తీవ్రత అర్థమవుతోంది. మంటలు, దట్టమైన పొగ విమానాన్ని కమ్మేసింది. విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత మంటలను గుర్తిస్తే జరగరాని ఘోరం జరిగేదని చెబుతున్నారు నిపుణులు. విమానం టేకాఫ్ అయ్యే సమయంలోనే గ్రౌండ్ సిబ్బంది మంటలను గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.
క్యాబిన్లో పొగలు.. మరో విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం!
డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఘటన
నార్త్ కరోలినాలోని షార్లెట్‌కు వెళ్లాల్సిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం.. రన్‌వేపై వేగంగా వెళుతుండగా గుర్తించిన సమస్య
ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడం వల్ల టేకాఫ్‌ను… pic.twitter.com/DnOUKCLApc
— BIG TV Breaking News (@bigtvtelugu) July 27, 2025