IND Vs ENG : మాంచెస్టర్ వేదికగా ప్రస్తుతం టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే టీమిండియా డ్రా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా డ్రా కావాలంటే టీమిండియా బ్యాటర్లు వికెట్లు కోల్పోకుండా బ్యాటింగ్ చేయాలి. ఒకవేళ వికెట్ కోల్పోతే.. టీమిండియా ఓటమి ఖాయం అవుతోంది. ఈ మ్యాచ్ డ్రా కావాలంటే టీమిండియా కీలక బ్యాటర్ రిషబ్ పంత్ ఆడాల్సిందే. మాంచెస్టర్ టెస్టులో రిషబ్ పంత్ కాలికి గాయం కావడంతో.. ఈ సిరీస్ లో ఇకపై పాల్గొనలేడు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ ను ఎంపిక చేయాలనే చర్చ జరిగింది. కానీ ఇప్పుడు అతని స్థానంలో తమిళనాడు వికెట్ కీపర్ కు ఈ అవకాశం లభించింది.
Also Read : Ben Stokes : ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ లో హిస్టరీ క్రియేట్ చేసిన స్టోక్స్..!
టీమిండియాకి గాయాల బెడద
ముఖ్యంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత జట్టుకు గాయాల బెడద వెంటాడుతోంది. మాంచెస్టర్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో రిషబ్ పంత్ కాలికి గాయం కావడంతో చివరి టెస్టుకు అతని స్థానంలో తమిళనాడుకు చెందిన వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ ఎన్.జగదీశన్ ను ఎంపిక చేశారు. ఇది జగదీశన్ కి భారత టెస్ట్ జట్టులోకి తొలి పిలుపు కావడం విశేషం. నాలుగో టెస్ట్ తొలి రోజున బ్యాటింగ్ చేస్తున్న సమయంలో క్రిస్ వోక్స్ వేసిన బంతి తగిలి పంత్ కాలికి గాయం అయింది. తీవ్ర నొప్పి ఉన్నప్పటికీ పంత్ రెండో రోజున బ్యాటింగ్ కి వచ్చి హాఫ్ సెంచరీ చేశాడు. అతని పోరాట పటిమను చూసి అంతా హాట్సాప్ చెప్పారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ మ్యాచ్ లో వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు రిషబ్ పంత్. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ కీపింగ్ చేశాడు. స్కానింగ్ లో పంత్ కి కాలి బొటనవేలుకు ఫ్రాక్చర్ అయినట్టు తేలింది. దీంతో అతను మిగిలిన సిరీస్ కి దూరం కానున్నాడు.
జగదీశన్ కి అద్భుత అవకాశం
టీమిండియా వైస్ కెప్టెన్, కీలక వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ లేకపోవడం జట్టుకు పెద్ద లోటు అనే చెప్పాలి. ఇక ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు చేసి భారత బ్యాటింగ్ కి వెన్నెముకగా నిలిచాడు. ఇషాన్ కిషన్ కూడా చీలమండ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో సెలెక్టర్లు ఎన్. జగదీశన్ వైపు మొగ్గు చూపారు. 29 ఏళ్ల జగదీశన్ దేశీయ క్రికెట్ లో తమిళనాడు తరపున నిలకడగా రాణిస్తున్న వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతని రికార్డు ఆకట్టుకుంటోంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 52 మ్యాచ్ ల్లో 47.50 సగటుతో 3,373 పరుగులు చేశాడు. అందులో 10 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.