Kissik Talks:వినూత్నమైన కామెడీతో ఆడియన్స్ ను ఎప్పటికప్పుడు అలరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపున సొంతం చేసుకున్న యూట్యూబర్ శ్రీవిద్య (Sri vidhya) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నాన్ స్టాప్ డైలాగ్ లతో, పంచ్ లతో విపరీతమైన ఆదరణ సొంతం చేసుకున్న ఈమె.. అప్పుడప్పుడు స్టూడెంట్స్ తో కలసి చిన్న చిన్న ఫన్ టాస్కులు నిర్వహిస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అలాంటి శ్రీవిద్య జబర్దస్త్ వంటి కామెడీ షోలలో కూడా సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక అక్కడ జబర్దస్త్ కమెడియన్ గా మంచి పేరు సొంతం చేసుకున్న బాబు (Babu ) డైరెక్టర్ గా మారి చేసిన సీరీస్..లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఇందులో హైపర్ ఆది సరసన నటించిన అందరిని ఆకట్టుకుంది ముఖ్యంగా హైపర్ ఆది పక్కన ఈమె తప్ప మరొకరు నటించలేరు అనే రేంజ్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది శ్రీవిద్య.
అలాంటి శ్రీవిద్య, జబర్దస్త్ కమెడియన్ కం డైరెక్టర్ బాబు బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ విద్యను ఆ స్టార్ హీరోయిన్ తో పోల్చి ఆమె నటనపై ప్రశంసలు కురిపించింది హోస్ట్ వర్ష (Varsha). బాబు మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్ ప్రారంభం అయినప్పుడు ఈ వెబ్ సిరీస్ డిఓపి ఒక తమిళ్ ఆయన. శ్రీవిద్యను చూసిన మొదట్లో తెగ తిట్టేవాడు. కెమెరాలు చూడమంటే డిఓపిని చూసేది.. ఇక పక్కకు చూడమంటే కెమెరాను చూసేది. అసలు ఇలాంటి అమ్మాయిను ఎందుకు పెట్టుకున్నావు? అని నన్ను కూడా తిట్టాడు. కానీ వెబ్ సిరీస్ ముగిసిన తర్వాత శ్రీవిద్య పై ఆయన ప్రశంసలు కురిపించారు. ఇలాంటి అద్భుతమైన నటనా ప్రతిభ కలిగిన అమ్మాయిని ఎక్కడ పట్టుకొచ్చావు అంటూ ఆమెను పొగడ్తలతో ముంచేశాడు. అంతేకాదు నువ్వు తమిళ్ ఇండస్ట్రీలోకి రండి.. అక్కడ నీకు ఆడియన్స్ పట్టం కడతారు. వరుస అవకాశాలు వస్తాయని హామీ ఇచ్చారు అంటూ శ్రీ విద్యపై తమిళ్ డిఓపి చేసిన కామెంట్లను బాబు పంచుకున్నారు.
ALSO READ:శ్రీహరి ఇంట్లో శుభకార్యం.. పెళ్లి పీటలెక్కబోతున్న పెద్ద కొడుకు?
దీనికి వర్షా మాట్లాడుతూ.. శ్రీవిద్య టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ లాగా ఉంటారు. ఆమెను చూసిన ప్రతిసారి నాకు శ్రీవిద్య గుర్తుకొస్తుంది. ఈ విషయాన్ని నేను ఎన్నోసార్లు ఆదితో కూడా చర్చించాను. ఒకవేళ ఐశ్వర్య రాజేష్ లాగా ఈమె కూడా తమిళ్ ఇండస్ట్రీలోకి వెళ్తే అక్కడ స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ వర్షా తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది. మొత్తానికైతే శ్రీవిద్య గురించి వర్షా చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే తాను వైజాగ్ హాస్పిటల్ లో పుట్టానని.. విజయవాడలో పెరగానని, ప్రస్తుతం హైదరాబాద్ కూకట్పల్లిలో ఉంటున్నాను అంటూ తెలిపింది శ్రీవిద్య. ప్రస్తుతం ఏదైనా ఫంక్షన్లు జరిగితే ర్యాపిడోలో వెళ్తున్నానని, తన ఆర్థిక కష్టాలను చెప్పుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది.