Podarillu Serial Chakri Son: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో పొదరిల్లు సీరియల్ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీరియల్లో హీరో పాత్రలో నటుడు దీపక్ (Deepak) నటిస్తున్నారు. దీపక్ చక్రి పాత్ర(Chakri Role) ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇలా అద్భుతమైన రేటింగ్ తో ఈ సీరియల్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న నటుడు దీపక్ వ్యక్తిగత విషయానికి వస్తే ఈయనకు పెళ్లి జరిగి ఒక అబ్బాయి ఉన్న సంగతి తెలిసిందే. నిత్యం తన భార్య కొడుకు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు.
ఇదిలా ఉండగా తాజాగా దీపక్ తన కొడుకుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తన కుమారుడు ధ్రువన్(Dhruvan) మూడేళ్ల వయసులోనే ఏకంగా రెండు ప్రపంచ స్థాయి రికార్డులను(World Records) సొంతం చేసుకోవటం విశేషం. ఈ విషయాన్ని దీపక్, తన వైఫ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇలా వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్స్ తో పాటు తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను ఈ జంట సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ..
మా అబ్బాయి గురించి చాలా గర్వపడుతున్నాను చెప్పడానికి మాటలు సరిపోవటం లేదు.. మా అబ్బాయి 2 ప్రపంచ రికార్డులను సాధించారని తెలిపారు. ఇందులో మొదటి అవార్డు దేనికి ఇచ్చారు అనే విషయాలను కూడా తెలిపారు.. మూడు సంవత్సరాలు వయసు ఉన్న అబ్బాయి రాష్ట్రాల పేర్లు చెప్పగానే వాటి రాజధానులను కేవలం 19 సెకండ్లలో చెప్పడంతో మొదటి వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నట్టు దీపక్ తెలియజేశారు. ఇక రెండవ ప్రపంచ రికార్డు విషయానికి వస్తే.. కేవలం మూడు సంవత్సరాల వయసులోనే 25 మీటర్ల పరుగును కేవలం 6 సెకండ్లలో పూర్తి చేసి మరో ప్రపంచ రికార్డు సాధించినట్లు తెలిపారు.
ఇలాంటి గొప్ప ఘనత సాధించినందుకు ధన్యవాదాలు పుట్టు .. అంటూ తమ కొడుకు సాధించిన ఈ ఘనత పట్ల ఈ తల్లితండ్రులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు చిన్నారి టాలెంట్ కు ఫిదా అవుతూ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.. ఇంత చిన్న వయసులోనే ప్రపంచ స్థాయి గుర్తింపు సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇలా చిన్నారి సాధించిన ఘనతపై నెటిజన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా అభినందనలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. ఇక దీపక్ కెరియర్ విషయానికి వస్తే ఈయన ఇదివరకు పలు తమిళ సీరియల్స్ లో నటించినప్పటికీ తెలుగులో మాత్రం పొదరిల్లు సీరియల్ ద్వారా మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు .ఇలా మొదటి సీరియల్ తోనే ఎంతోమంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు.
Also Read: ఎప్పటికీ నువ్వే నా సూపర్ స్టార్… తండ్రిని గుర్తు చేసుకుంటూ మహేష్ ఎమోషనల్!