Daiwik Singer:దైవిక్ ..జూనియర్ బాలు అన్న ట్యాగ్ తో సరిగప – ది నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్ లో అదరగొడుతున్నాడు దైవిక్. ఇక ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న దైవిక్ తాజాగా సర్దుకోండి బాస్ అనే సినిమాలో ‘ఏం మాయ ‘ అనే ఒక పాటని కభీర్ రఫీ మ్యూజిక్ డైరెక్షన్ లో పాడాడు కూడా.ఇక ప్రస్తుతం ఒక వైపు సరిగమపలో దూసుకెళ్తూనే ,ఇండస్ట్రీలో అవకాశాలని వెతుక్కుంటున్న దైవిక్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలని ఇలా చెప్పుకొచ్చాడు.
దాదాపు 35 నిమిషాల రిహార్సల్ తర్వాత
చిన్నప్పుడు SP శైలజ గారిని టీవీలో చూశానని ,అలాంటి గొప్ప సింగర్ జడ్జి గా ఉండగా ఆవిడ ముందు తాను పాటలు పాడటం మర్చిపోలేని అనుభూతని తెలిపాడు.ముఖ్యంగా దాదాపు 35 నిమిషాలు రిహార్సల్ చేసిన తర్వాత SP శైలజ గారు తన తల్లి తండ్రిలా వద్దకి వెళ్లి మంచి ఫ్యూచర్ ఉందని, భవిష్యత్ లో దైవిక్ గొప్ప సింగర్ అవుతాడని చెప్పడం తనకి ఎక్కడ లేని ఆనందాన్ని ఇచ్చిందని మనసులోని మాటని బయట పెట్టాడు.మరీ ముఖ్యంగా బాలు గారిలా తాను పాడటం చాలా బాగుందని,ఆయన వాయిస్ టెక్చర్ నాలో ఉండటం మంచి ఆశీర్వాదమని ఆవిడ మెచ్చుకున్న తీరు ని గుర్తు చేసుకున్నాడు.
ఇక తాను స్టేజీపై అన్నుల మిన్నల అనే పాట పాడిన తర్వాత ఇక ప్రత్యేకంగా తనకి మ్యూజిక్ అంటే ఏంటో చెప్పడం అవసరం లేదని చెప్పడం మరింత ఆనందాన్ని ఇచ్చిందని పొంగిపోయాడు.ఒక రకంగా తనకి వచ్చిన కాంప్లిమెంట్స్ లో అదే పెద్దదని మురిసిపోయాడు.
బాధ పెటిన సంఘటన
అయితే తన మనసుని బాధ పెటిన సంఘటనని గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు దైవిక్. సరిగప లోకి ఎంట్రీ ఇచ్చే ముందు దైవిక్ దేవీశ్రీ తో విశాఖపట్నంలో కాన్సర్ట్ చేసిన సంగతి తెల్సిందే.అయితే ఈ కాన్సర్ట్ లో దైవిక్ పాట పాడటానికి దేవిశ్రీ ప్రసాద్ కి వెయ్యి రూపాయలు ఇచ్చానని చాల మంది ఎగతాళి చేశారని చెప్పుకొచ్చాడు.ఇక ఆ మాటలు విన్నప్పుడు తాను నెల రోజుల పాటు బాధ పడ్డానని వాపోయాడు.
అయితే వారితో గొడవ పడటం కంటే బాగా ఎదిగి ,తన అభివృద్ధితోనే వారికి సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నాని,ఇక అప్పుడే ఒక పదేళ్ళ తర్వాత కలుద్దాం,అప్పుడు ఎవరు ఏ స్థాయిలో ఉంటారో చూద్దాం అని తనకి తాను సమాధానం ఇవ్వాలని అనుకున్నానని చెప్పుకొచ్చాడు.
ఇక ప్రస్తుతం షూటింగ్స్ అప్పుడు హైదరాబాద్ లో ఉంటూ షూటింగ్ లేని సమయంలో వైజాగ్ కి వెళ్లి చదువుకుంటున్నానని,ఇక తనకి సంగీతంలో కంప్లీట్ గా ట్రైనింగ్ లేనందున ఆశీర్వాద్ లుక్ వద్ద ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నానని చెప్పాడు దైవిక్.
ఎవరు ఏ స్థాయిలో ఉంటారో చూద్దాం
మొత్తంగా దేవిశ్రీ వద్ద పాట పాడటం కోసం వెయ్యి రూపాయలు ఇచ్చానన్న మాటలకి దైవిక్ పదేళ్ళ తర్వాత కలుద్దాం,అప్పుడు ఎవరు ఏ స్థాయిలో ఉంటారో చూద్దాం అంటూ దైవిక్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది.
ALSO READ :రూ.4000 కోట్ల రామాయణం అవసరమా? ఏఐతో లక్షల్లో సినిమా తీయొచ్చు: వర్మ