Love Gill: బిగ్‌బాస్..ఈ రియాలిటీ షో ఎప్పుడూ ఎదో రకంగా సరికొత్త కాంట్రవర్సీలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంటుందని చెప్పక్కర్లేదు.ఈ క్రమంలోనే బిగ్‌బాస్ 20 హౌస్‌లో పంజాబీ నటి లవ్ గిల్ చేసిన కామెంట్స్ ఇపుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హౌస్‌లో తోటి కంటెస్టెంట్ గుల్లూతో మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు ఇలా చెప్పేసింది. భవిష్యత్తులో తాను చేసుకోబోయే భర్త కోసమే తాను పెళ్లికి ముందు ఇతరులతో ఫిజికల్ అఫైర్స్ పెట్టుకోకుండా తను ఇప్పటికీ కన్యగానే ఉన్నానని సెన్సేషన్ కామెంట్స్ చేసింది. అయితే లవ్ గిల్ చేసిన ఈ కామెంట్స్ బయటకు రాగానే, గతంలో ఆమెని చుట్టుముట్టిన వివాదాలు, రూమర్లు మరోసారి వార్తల్లో నిలిచాయి.
గతంలో లవ్ గిల్, పంజాబీ ప్రముఖ నటుడు, కమెడియన్ గురుప్రీత్ ఘుగ్గీతో కలిసి ‘ఫుర్లో’ అనే చిత్రంలో కలిసి నటించిన సంగతి తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి.
కెనడాకు చెందిన ఓ యూట్యూబర్ చేసిన అలిగేషన్స్ తో ఈ వ్యవహారం మరింత కాంట్రవర్సీగా మారిపోయింది. వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడిచిందని, లవ్ గిల్ ప్రెగ్నెంట్ కూడా అయ్యిందని, ఈ ఇష్యూ బయటకు రాకుండా ఉండేందుకు ఏకంగా ఐదు కోట్ల రూపాయల సెటిల్మెంట్ జరిగిందంటూ నెట్టింట వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి.అయితే ఈ ఈ ఆరోపణలకు ఎలాంటి ప్రూఫ్స్ లేనప్పటికీ నెటిజన్లు మాత్రం తెగ వైరల్ చేసేశారు.
అయితే ఈ రూమర్లపై అప్పట్లో గురుప్రీత్ ఘుగ్గీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు కూడా. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా కల్పితమని, తన పరువు ప్రతిష్ఠలను దెబ్బతీసేందుకే కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు లవ్ గిల్ కూడా తనపై వస్తున్న ఈ రూమర్స్ ని ఖండించింది. ఏ ఆధారాలు లేకుండా తన వ్యక్తిగత జీవితంపై ఇలాంటి అబద్దాలు స్ప్రెడ్ చేయడం సరికాదని అసహనం వ్యక్తం చేసింది.
ఇక తాజాగా లవ్ గిల్ బిగ్‌బాస్ 20లో పార్టిసిపేట్ చేయడంపై మీడియా గురుప్రీత్ ఘుగ్గీని ప్రశ్నించగా.. తాను ఆ షో చూడనని, తనకు దానికంటే సమాజంలో చర్చించాల్సిన ముఖ్యమైన సమస్యలు చాలా ఉన్నాయని ఆన్సర్ ఇవ్వడం గమనార్హం. మొత్తానికి బిగ్‌బాస్ హౌస్‌లో లవ్ గిల్ చేసిన కామెంట్స్ ఆమె గత వివాదాలను మరోసారి ట్రెండింగ్‌లోకి తెచ్చాయనే చెప్పాలి !
ALSO READ :బ్రేకప్ తర్వాత తమన్నా సంచలన కామెంట్స్.. ఆ అదృష్టవంతుడు ఎవరంటే?