Karthika Deepam 2 serial today Episode: అందరూ భోజనం చేస్తుంటే.. సుమిత్ర, దశరథ జ్యోత్స్న పెళ్లి విషయం తీసుకొస్తారు. నెల రోజుల్లో మంచి సంబంధం చూసి జ్యోత్స్నకు పెళ్లి చేయాలని అంటారు. అందుకు తలా ఒక సలహా ఇస్తారు. జ్యోత్స్న మాత్రం మౌనంగా అందరి మాటలు వింటుంది. దీంతో పారిజాతం ఏంటి జ్యోత్స్న మౌనంగా ఉన్నావు.. పెళ్లి చేసుకోను.. నాకు పెళ్లి ఇష్టం లేదు లాంటి మాటలు చెప్తుంటావు కదా ఈరోజు ఏంటి సైలెంట్‌గా ఉన్నావు అని అడిగితే.. జరగని వాటి గురించి ఆలోచించడం టైం వేస్ట్ అని నా అభిప్రాయం అందుకే మౌనంగా ఉన్నానని చెప్తుంది జ్యోత్స్న. జ్యోత్స్న మాటలకు అందరూ షాక్ అవుతారు. కార్తీక్ మాత్రం జ్యోత్స్నకు టైం ఇవ్వాలని చెప్తాడు. శివనారాయణ కోపంగా కార్తీక్‌ను తిడతాడు.
తర్వాత సూరజ్, జ్యోత్స్నకు కాల్ చేస్తాడు. నీతో మాట్లాడాలి అని సూరజ్ చెబితే.. ఏం మాట్లాడతావు.. ఒక గొడవ గురించి మాట్లాడుతూ మరో గొడవ పెట్టుకోవడమే కదా మన మధ్య జరిగేది అంటుంది. అలా ఎందుకు అనుకోవాలి.. నచ్చిన మనిషితో మన విషయాలు షేర్ చేసుకోవడం అని చెప్పొచ్చు కదా అంటాడు సూరజ్.. సూరజ్ మాటలకు జ్యోత్స్న నచ్చిన మనిషి మనసులో మనం ఉండాలి కదా అని అడుగుతుంది. అయితే నువ్వు ఉన్నావా..? అని సూరజ్ అడిగితే.. కచ్చితంగా ఉన్నానని తెలుసు.. నన్ను ఇష్టపడే వ్యక్తి దిండు కింద ఎప్పుడైతే నా ఫోటో చూశానో అప్పుడే నాకు అర్థం అయింది. ఆ వ్యక్తి మనసులో నేను ఉన్నానని అంటూ జ్యోత్స్న చెప్తుంది. అయినా పగతో రగిలిపోయే వ్యక్తులకు ప్రేమ గురించి ఎంత చెప్పినా టైం వేస్ట్ మాటలే అవుతాయి.. మనసే లేని నీలాంటి వాడికి మనుషుల ప్రేమలు ఎలా అర్థం అవుతాయి అంటూ తిడుతుంది జ్యోత్స్న. అందుకు సూరజ్ అసలు ఇది నన్ను పొగుడుతుందా..? తిడుతుందా..? అని మనసులో అనుకుంటాడు..
అప్పుడే జ్యోత్స్న తనకు ఇంట్లో వాళ్లు పెళ్లి చేయాలని చూస్తున్నారు.. అని చెప్తుంది. మరి నువ్వేం చెప్పావని సూరజ్ అడిగితే.. సమాధానం ఉంటే కదా చెప్పడానికి అంటూ జ్యోత్స్న రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న విషయాల గురించి చెప్పి ఎమోషనల్ అవుతుంది. అందుకు సూరజ్ ఈ రెండు కుటుంబాల మధ్య ఈ గొడవకు కారణం నేనే నా వల్ల మొదలైన గొడవలు నా వల్లే అంతం కావాలి. రేపే ఈ గొడవలకు పులిస్టాప్ పెడతాను అందుకు నువ్వు కూడా రెడీగా ఉండాలి అంటూ సూరజ్ చెప్తాడు. సూరజ్ ఫోన్ మాట్లాడటం చాటు నుంచి అంతా వింటుంది మాలిని. సూరజ్‌ను అనుమానిస్తుంది. ఎదురుగా వెళ్లి అదే విషయం అడిగితే. నీ కొడుకు మీద నీకు నమ్మకం లేదా అమ్మా అంటాడు సూరజ్. ఉందని మాలిని చెబితే.. సరే థాంక్స్ అమ్మా అంటూ వెళ్లిపోతాడు సూరజ్.
తర్వాత సూరజ్, జ్యోత్స్న పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్తారు. వాళ్లను చూసిన దక్షిణమూర్తి సంతోషంతో ఉప్పొంగిపోతుంటాడు. నా మనవరాలు నా ఇంటికి వచ్చింది ఇక నా కూతురు కూడా నా ఇంటికి వస్తుంది అని ఆనందపడుతుంటే.. మాలిని మాత్రం కోపంతో రగిలిపోతూ జ్యోత్స్నను తిడుతుంది. అసలు మిమ్మల్ని ఇంట్లోకే రానివ్వను అంటూ గట్టిగా అరుస్తుంది. ఉలిక్కిపడి లేచి చూస్తుంది. అంతా కలా అనుకుంటుంది. మాలిని అరుపులకు దక్షిణమూర్తి హడలిపోయి ఏంటమ్మా అని అడిగితే.. పీడకల మామయ్య అని చెప్తుంది. తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయని దక్షిణమూర్తి చెబితే.. ఈ కల నిజం కాకూడదని కోరుకుంటున్నాను అని మనసులో అనుకుంటుంది మాలిని. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.