E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ కు కొత్త టెన్షన్.. దీపావళి పండగ హడావిడి..

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ కు కొత్త టెన్షన్.. దీపావళి పండగ హడావిడి..
Advertisement

Podarillu Today Episode November 14th : షాప్ ఓపెనింగ్ తర్వాత మొదటి రోజు పని చేసుకోవాలి అని మాధవ్ కేశవ కి చెప్పి వెళ్ళిపోతాడు. శైలు మాత్రం ఆ బోర్డు మీద నా పేరు ఎందుకు పెట్టలేదు రా అని చాలా ఫీల్ అవుతుంది. నా పేరు పెట్టుకున్నా నువ్వు మీ నాన్న పేరు ఎందుకు పెట్టావ్ రా అని శైలు కేశవ్ అని అడుగుతుంది. అయితే శైలు ఆ బోర్డు గురించి నాకు తెలియదు అని ఎంతగా కేశవ చెప్పినా సరే మొదట నమ్మరు కానీ ఆ తర్వాత నమ్ముతుంది. ఇక తర్వాత ఈరోజు నువ్వు షాప్ ఓపెన్ చేసావు కదా అందుకే నేను వదిలేస్తున్నాను అని చెప్పగానే కేశవ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కేశవ సిగ్గు పడిపోతూ మురిసిపోతూ ఉంటాడు.

కన్నీళ్లు పెట్టుకున్న మాధవ్..

మాధవ్ ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా భోజనం చేస్తూ సందడిగా ఇల్లంతా ఉండడంతో చూసిన మాధవ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు ఒకప్పుడు ఈ ఇంట్లో భోజనం చేయడానికి కూడా సరిగ్గా తిండి దొరికేది కాదు.. మా నాన్న జైలుకు వెళ్ళిన తర్వాత అందరూ మమ్మల్ని తిట్టేవాళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు.. ఒక్క పూట భోజనం కూడా పెట్టే వాళ్ళు కాదు నేనే ఇటుకలు మూసి నా తమ్ముళ్ళని చదివించుకొని ఇంతటి వాళ్ళని చేసుకున్నాను అని మాధవ్ ఎమోషనల్ అయిపోతాడు. అయితే అందరూ అలా ఉండడం చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. కానీ మహాలక్ష్మి మాటతో చాలా సంతోషంగా ఉంటాడు.

చక్రీకి ప్లాన్ సక్సెస్..

Advertisement

చక్రి దీపావళి పండుగ సందర్భంగా మహాలక్ష్మితో దిగిన ఫోటో ని ఎలాగైనా స్టేటస్ పెట్టుకోవాలి అని అనుకుంటాడు.. దీపావళి పండుగ మొదటి సారి నా భార్యతో జరుపుకుంటున్నాను అని స్టేటస్ పెడితే బాగుంటుంది. తను కూడా ఈ స్టేటస్ చూస్తే నిజంగానే నన్ను మెచ్చుకుంటుంది అని చక్రి అనుకుంటాడు. అయితే ఆ సంతోషంలో వెనకాల బీడీ ఉన్న సంగతి మర్చిపోయి దానిమీద కాలు వేసి కాలు కాల్చుకుంటాడు. ఇక నారాయణ పై సీరియస్ అవుతాడు. కానీ నారాయణ మాత్రం చూసుకోబడులే అని ఒక్క మాటతో మౌనంగా ఉండిపోతాడు.. అయితే మహాలక్ష్మి తో మై బ్యూటిఫుల్ వైఫ్ అని స్టేటస్ పెట్టడంతో ఇంట్లోని వారందరికీ ఈ విషయం గురించి చెప్పాలి అని అనుకుంటాడు. లోపలికి వెళ్లి చాలా సంతోషంగా తను స్టేటస్ పెట్టాను అని చెప్తాడు.

మాధవ్ టెన్షన్..

అయితే ఇంట్లోని వాళ్ళందరిని పిలిచి చాలా సంతోషంగా మీరు నా స్టేటస్ ని చూసారా నేను ఏం పెట్టానో మీరు చూడండి అర్జెంట్ గాని అందరిని బలవంతంగా స్టేటస్ చూసేలా చేస్తాడు. అయితే మాధవ్ నేను చూడలేదు రా నాకు చదువు రాదు కదా నాకు ఇంగ్లీష్ కూడా రాదు రా నువ్వే ఏం రాసావో చెప్పు అని చెక్రి ని అడుగుతాడు.. చక్రి దీపావళి సెలబ్రేషన్ విత్ మై వైఫ్ అని రాశాను అని చెప్పగానే ఆ స్టేటస్ని చూసిన కన్నా కేశవ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ స్టేటస్ ఆవిడ గనక చూసిందంటే నీకు ఈ రోజు మూడు పోతుంది మన ఇంటి గోడలు స్ట్రాంగ్ గానే ఉన్నాయి కదా ఖచ్చితంగా ఊడిపోకుండా ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత మాధవ్ చక్రీ మహాలక్ష్మి ఏమంటుందో ఏంటో అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు..

మహా మాటతో చక్రీ ఫుల్ హ్యాపీ..

Advertisement

మహాలక్ష్మి గదిలోంచి బయటికి రావడం చూసినా కేశవ అదిగో వస్తుంది చూడు కచ్చితంగా ఇప్పుడు పెద్ద రచ్చ జరుగుతుంది అని చెప్పగానే అందరూ టెన్షన్ పడిపోతూ మహాలక్ష్మి ఏమంటుందో ఏంటో అని చూస్తూ ఉండిపోతారు.. మహాలక్ష్మి మనిషా ఇద్దరూ బయటికి వస్తారు మీ ఫోన్ చార్జింగ్ ఫుల్ అయినట్టుంది ఒకసారి చూసుకోండి అని చక్రీ హింట్ఇస్తాడు. మీరు చాలా మంచి వాళ్ళండి ఫోన్ చార్జింగ్ ఫుల్ అయింది. అంతేగాని మెసేజ్లు వచ్చాయని మీరు ఎందుకు చెప్పలేదు అని కాస్త సీరియస్ అవుతుంది. ఇక తర్వాత ఆ ఫోన్లో స్టేటస్ చూడలేదు అని అనుకుంటారు ఇక మహాలక్ష్మికి స్టేటస్ గురించి ఎంత గుర్తు చేస్తున్నా సరే ఏముంది అక్కడ అని అనుకుంటుంది.

చక్రీ సేఫ్.. మాధవ్ హ్యాపీ..

మహాలక్ష్మి స్టేటస్ చూశాను ఏమైంది ఇప్పుడు ఏదైనా కొత్తగా ఉంది అందులో అని కన్నాని అడుగుతుంది. కానీ అది కాదు వదిన అందులో ఏం రాసిందో చూసావా అంటే ఆ చూశాను.. కొన్ని స్టేటస్లుకి నేను లైక్ కూడా కొట్టాను. ఇప్పుడు ఏమైంది ఎందుకు మీరు అంత కంగారు పడుతున్నారు చెప్పండి అని మహాలక్ష్మి ఎంతగా అడిగిన సరే ఎవ్వరు చెప్పరు నువ్వు చూసావు కదా నీకే అర్థమవుతుంది లే అని అనుకుంటారు. ఇక సాయంత్రం అయితే దీపావళి పండుగ సంబరాలు మొదలు పెట్టాలని అనుకుంటారు అందరూ కూడా దీపావళి పండుగ గురించి చాలా గొప్పగా జరుపుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ట్రెడిషనల్ లుక్ లో చూడ్డానికి చాలా అందంగా వాళ్ళందరూ కనిపించడంతో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు.. మొత్తానికి పొదరిల్లు సీరియల్ లో దీపావళి పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతాయి అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో అన్నది చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: వల్లికి ఘోర అవమానం.. చందు మాటతో షాక్.. రౌడీలు రచ్చ..

Related News

దేవిశ్రీ ప్రసాద్ తో స్టేజ్ షో చేస్తే అవమానాలా? దైవిక్ బయటపెట్టిన షాకింగ్ నిజం!

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి ఘోర అవమానం.. చందు మాటతో షాక్.. రౌడీలు రచ్చ..

Brahmamudi Serial Today Episode November 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  ఎక్స్ఫో లోకి ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య 

Yashmi Gowda: నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Gundeninda Gudigantalu Balu : బాలు షాకింగ్ నిర్ణయం..? నిర్మాతలకు చుక్కలే…!

Gundeninda GudiGantalu Today episode: నిజం చెప్పేసిన శృతి.. పాపం మీనా.. ఇది కదా ట్విస్ట్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 14th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: షాపింగ్‌ మాల్‌లో పార్థు కోసం వెతుకుతున్న మనోహరి

Big Stories

Advertisement
×