Intinti Ramayanam Today Episode April 10th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఆరాధ్య పరీక్షలు అయిపోవడంతో చాలా సంతోషంగా బయలుదేరుతుంది. వాళ్ళ నాన్నతో కలిసి సంతోషంగా ఇంటికి వెళ్తూ సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. మనతో అమ్మవునింటే చాలా బాగుండేది నాన్న. నాకు ఎగ్జామ్స్ అయినప్పుడు నన్ను బాగా చదివించి పూజ చేసి, ఎగ్జామ్ బాగా రాసేలా నన్ను ఎంతో ఎంకరేజ్ చేసేది. అమ్మ మళ్లీ మన ఇంటికి తిరిగి వస్తుందా అని మాట్లాడుతుంది. అప్పుడే అటుపక్కగా వెళ్తున్న అవనీని ఆరాధ్య చూస్తుంది. ఒకసారి కార్ ఆప్ నాన్న అని కారు దిగేసి అవని దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్తుంది. ఆరాధ్య ప్రాణాలను కాపాడుకుంటుంది అవని.. తన కూతురి భాదను చూసి అవని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని ఆఫీస్ కి వస్తుంది ఫ్లవర్ డెకరేషన్ కోసం వస్తుందా లేక అక్షయ మనసులో ప్రేమను సంపాదించడం కోసం వస్తుందని అవని వెనకాలే ఫాలో అవుతూ ఆఫీస్ లోపలికి వస్తుంది. అక్కడ అవని అందరితో సరదాగా మాట్లాడి అక్షయ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్షయ్ రాగానే మీతో నేను కొంచెం మాట్లాడాలని అడుగుతుంది. ఏం మాట్లాడాలి అంటే అవని తన బ్యాగులోంచి ఒక పేపర్ తీయబోతుంది. అప్పుడే అక్షయ అవనీల ఫోటో బయటపడుతుంది. అది చూసిన అక్షయ్ కోపంతో ఊగిపోతాడు. దృశ్యాన్ని పల్లవి చూసి సంతోషపడతుంది.. బయటకు రాగానే అవనీని చూసి అక్క చూసావా బావగారు నీ మీద ఎంత కోపంగా ఉన్నారో.. అదే ఇప్పుడు నిన్ను దూరంగా ఉండేలా చేసింది..
బావగారు మనసులో నువ్వు లేవని తెలిసిపోయింది. ఇంత అవ్వడానికి కారణం నేనే అని నీకు తెలుసు కానీ నువ్వు ఏమి చేయలేవు. త్వరలోనే నిన్ను బావగారిని విడగొట్టేసి బావగారి చేత విడాకులు ఇప్పించి మరో పెళ్లి చేయిస్తాను నా నెక్స్ట్ టార్గెట్ అదే అని పల్లవి అవనికి వార్నింగ్ ఇస్తుంది. నా జీవితం ఇలా అవ్వడానికి కారణం నువ్వే అవును అది నీకు తెలుసు నాకు తెలుసు ఇంకెవరికి తెలియదు కదా అని పల్లవి అంటుంది. ఇంకొకసారి నా జీవితం జోలికి వచ్చావంటే మా మొగుడు పిల్లలు మధ్యలోకి వచ్చావంటే చెప్పు తెగుతుంది అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.
నాకు మా ఆయనకు మధ్యలో ఇంకేదైనా చేయాలని చూసావనుకో రోడ్డు మీద ఇలాంటి 100 చెప్పులతో నీ చెంప పగలగొడతాను అప్పుడు నీకు బుద్ధి వస్తుంది తెలుసు కదా నా సంగతి అని అవని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అక్షయ్ ఒక చెక్కు విషయం గురించి శ్రీకర్ తో మాట్లాడుతూ ఉంటాడు.. అప్పుడే రాజేంద్రప్రసాద్ అక్కడికి వస్తాడు. ఆ విషయం గురించి నాకు మొన్న ఆడిటర్ గారు చెప్తేనే అర్థమైంది నాన్న నేను దాని గురించి మాట్లాడుతున్నాను అంటాడు.
ఆరాధ్య అక్కడికి వచ్చి అందరితో సరదాగా ఉంటుంది. నేను బాబాయిలతో కూర్చుని భోజనం చేస్తానని అంటుంది. అప్పుడు స్పీకర్ వచ్చి నాకు తినిపించవు బంగారం అంటే నీకు పిన్ని ఉంది కాబట్టి పిన్ని తినిపిస్తుంది నేను నాన్నకు భోజనం తినిపిస్తాను మా అమ్మ లేదు కదా అనేసి గుర్తు చేస్తుంది. అప్పుడు ఎక్కడికి పంతులుగారు వస్తారు. శ్రీరామనవమి కాబట్టి మీరు ఎప్పుడు ఇలాగే కళ్యాణం జరిపించండి మీ పెద్దబ్బాయి పెద్ద కోడలు కలిసి కళ్యాణం జరిపిస్తే మంచిది అనేసి పంతులుగారు అంటారు.
పార్వతి మేము ఈసారి ఈ కళ్యాణానికి రావట్లేదు పంతులుగారు అని మొహాన చెప్పేస్తుంది. ఇక రాజేంద్రప్రసాద్ పార్వతి మాటకు ఎదురు చెప్పకుండా కళ్యాణానికి కావాల్సిన డబ్బులు ని అక్షయ్ నివ్వమని చెప్తాడు.. కమ్మలు ఊర్లో ఉన్న వదినని లేదని చెప్తున్నారు చాలా బాగుంది మీరు పెద్ద మనుషులు అని అనగానే పార్వతి కమల్ ని నోరు ముయ్ నీకేం తెలుసు నువ్వు మాట్లాడుతున్నావ్ ఇప్పుడు ఆస్తి కోసం ఎలా చేసింది? తల్లిలాగ చూసుకున్న నన్ను చంపాలని చూసింది.. తల్లి కన్నా ఎక్కువగా గౌరవించినా ప్రణతి పెళ్లిని ఓ అనామకులతో చేసింది ఇవన్నీ చూసి ఇప్పుడు మనం కళ్యాణానికి వెళ్తే అక్కడ నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతారు అవసరమా అని పార్వతి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి చక్రధర్ ని కలుసుకోవడానికి బయటకు వెళ్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో పల్లవికి దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతుంది. అవని.. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..