Brahmamudi serial today Episode: గుడిలో కావ్య వాళ్లను చూసిన యామిని ఇక ఎలాగైనా రాజ్‌ను అక్కడి నుంచి తీసుకుని వెళ్లాలనుకుంటుంది. వెంటనే వైదేహికి చెప్తుంది. దీంతో వైదేహి రాజ్ ఏమనుకుంటాడోనని అంటుంది. దీంతో యామిని నేను ఎలాగైనా మేనేజ్ చేస్తాను మీరు నాకు సపోర్టు చేయండి అని అడుగుతుంది. దీంతో వైదేహి సరే అంటుంది. యామిని వెంటనే బావ మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం పద. అత్తాపూర్ గుడిలో ఇక్కడి కన్నా గ్రాండ్‌గా చేస్తున్నారట. పైగా మనల్ని ముందు వరుసలో కూర్చోబెడతారని నా ఫ్రెండ్ ఫోన్ చేసింది అని చెప్తుంది. అక్కడికి వెళ్దాం పద బావ అంటుంది. దీంతో రాజ్ అక్కడికా వద్దు పర్వాలేదు ఇక్కడే ఉందాం.. అంటాడు రాజ్. అది కాదు బావ మనం వచ్చాకే కళ్యాణం ప్రారంభిస్తామని చెప్తున్నారు. వాళ్లు పిలిచాక వెళ్లకపోతే బాగుండదు బావ అని చెప్తుంది.
దీంతో రాజ్ ఇంతసేపు నేను కళావతి కోసం వెయిట్ చేశాను. నా టైం బాగుంది తను కనిపించింది అని హ్యాపీగా ఫీలయ్యే లోపు యామిని ఏంటి వెళ్లిపోదాం అంటుంది. ఇప్పుడు నేను వెళ్లిపోతే కళావతిని మిస్ అయిపోతాను. అని మనసులో అనుకుని వాళ్లకు ఫోన్ చేసి మేము చాలా దూరంలో ఉన్నాం ఇక్కడి నుంచి రావడం కుదరదు అని ఏదో ఒకటి చెప్పేయ్ యామిని.. మళ్లీ అంత దూరం ట్రావెల్ చేసేంత ఎనర్జీ లేదు కదా అంటాడు. దీంతో యామిని వాళ్ల డాడీ ఆ గుడి కట్టించిన దాతలు మనకు బాగా తెలుసు బాబు అని చెప్తాడు. దీంతో రాజ్ తప్పదా అంటూ లేచి వెళ్లిపోతాడు. కావ్య అంతా గమనిస్తుంది. బయటకు వెళ్లిన రాజ్ యామిని మీరు వెళ్లి గేటు దగ్గర ఉండండి.. నేను పార్కింగ్ లోకి వెళ్లి కారు తీసుకొస్తాను అని చెప్తాడు. దీంతో యామిని వాళ్లు వెల్లిపోతారు. ఇంతలో రాజ్ కావ్యను ఎలాగైనా కలవాలని ట్రై చేస్తాడు. లోపల ఉన్న కావ్య కూడా రుద్రాణి గారు బయటే ఉన్నారు ఒకవేళ ఆయన్ని చూస్తే.. అని బయటకు వస్తుంది.
యామిని కూడా రాజ్ ను నమ్మడానికి వీల్లేదు నేను వెళ్తాను మీరు గేటు దగ్గర ఉండండి అంటూ గుడిలోకి వస్తుంది. గుడిలోకి వచ్చిన యామినిని చూసిన రాజ్ పక్కకు వెళ్లిపోతాడు. రాజ్ వెళ్లిన వైపే కావ్య వస్తుంది. కావ్యను చూసిన రాజ్.. అటుగా యామిని రావడం చూసి కావ్యను తీసుకుని పక్కనే ఉన్న టెంపుల్ స్టోర్ రూంలోకి వెళ్తాడు. కావ్య టెన్షన పడుతుంది. ఎందుకు మీరిలా చేయి పట్టుకుని గదిలోకి తీసుకొస్తే నలుగురు చూస్తే ఏమనుకుంటారు అంటూ నిలదీస్తుంది. ఇంతలో బయట నుంచి పూజారి వచ్చి రూం కు తాళం వేసి వెళ్లిపోయాడు. మీరే అన్నారు కదా.? నాతో మాట్లాడాలి అంటే ఇబ్బంది గా ఉంటుంది అన్నారు అందుకే ఇలా పక్కకు తీసుకొచ్చాను అని చెప్తాడు రాజ్. దీంతో కావ్య మాట్లాడాలి అంటే పిలిస్తే సరిపోతుంది కదా..? ఇలా చేయి పట్టుకోవాలా..? అంటుంది. రాజ్ చేయ్యే కదా పట్టుకున్నాను అంటాడు రాజ్. దీంతో కావ్య మన పురాణాల్లో చేయి పట్టుకోవడం పాణిగ్రహణం అంటారు. అంటే సగం పెళ్లి అయిపోయినట్టే అంటారు. అలా మీరు నా చేయి పట్టుకోవడం మా వాళ్లు చూస్తే అలాగే అనుకుంటారు.
అనగానే రాజ్ వామ్మో మీకు దండం పెడతానండి.. నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను అంటూ డోర్ ఓపెన్ చేయబోతే రాదు. దీంతో కావ్య కంగారు పడుతుంది. సీతారాముల కళ్యాణం మిస్ అవుతున్నాను అంటూ బాధపడుతుంది. అయ్యో రామయ్యా నీ కళ్యాణం చూసే భాగ్యం నాకు లేదయ్యా అంటూ ఏడుస్తుంది. దీంతో రాజ్ ఏవండి మీరు కాస్త ఆగండి మీరెలాగైనా కళ్యాణం చూసేలా చేస్తాను.. ఆ రాములోరి దగ్గరకు మీరు వెళ్లడం కాదు. ఆయనే మీ దగ్గరకు వస్తారు అని రాజ్ చెప్తాడు. మనకి కష్టం వస్తే ఆ దేవుడి దగ్గరకే వెళ్తాం.. మీరు ఆ దేవుడినే ఇక్కడికి తీసుకొస్తారా..? అంటూ ప్రశ్నిస్తుంది. మీరు కళ్లు మూసుకోండి.. నేను చెప్పేంత వరకు కళ్లు తెరవకండి అని చెప్పిన అక్కడే ఉన్న ఫోటోలు, పూల దండలతో మొత్తం కళ్యాణం సెట్‌అప్ చేస్తాడు. కళావతి గారు ఇప్పుడు మీరు కళ్లు తెరవండి అని చెప్పగానే.. కళ్లు తెరచి చూసిన కావ్య షాక్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు స్వామి వారి కళ్యాణం జరిపించండి అని చెప్తాడు. ఒక్కదాన్నే ఎలా జరిపిస్తాను మీరు కూర్చోడి అని ఇద్దరూ కలిసి కళ్యాణం జరిపిస్తుంటారు. అపర్ణ కావ్యను వెతుకుతుంది. పూజ జరిగే ప్లే్‌కు వెళ్లిన యామని కూడా అందరూ ఇక్కడే ఉన్నారు కానీ కళావతి లేదేంటి అంటూ బావ ఇద్దరూ కలిశారా ఏంటి అని అనుమానంగా అక్కడి నుచి వెళ్లిపోతుంది.
పూజ అయిపోయాక కళావతి గారు ఇప్పుడు మీరు హ్యాపీయా..? అని రాజ్ అడగ్గానే.. చాలా సంతోషంగా ఉన్నానండి అంటుంది కావ్య.. ఇంతలో పూజారి వచ్చి లాక్ తీయగానే.. రాజ్, కావ్య బయటకు వస్తారు. యామిని వెయిట్ చేయడం చూసి వెళ్లి యామనిని తీసుకుని వెళ్లిపోతాడు. కావ్య కూడా కళ్యాణం జరిగే చోటకు వెళ్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?