Intinti Ramayanam Today Episode April 24th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రణతి చెప్పిన నిజం విని రాజేంద్ర ప్రసాద్ చలించిపోయాడు. రాజేంద్రప్రసాద్ హాస్పిటల్లో అవని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అవని రాగానే మావయ్య గారు మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. నేను ప్రణతిని ఈ స్థితిలో చూసి తట్టుకోలేకపోయాను అమ్మా అని అంటాడు. నిన్ను ఎన్నిసార్లు అవమానించినా కూడా నువ్వు కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నావు అవని అనే పేరు నీకు అందుకే పెట్టారేమో అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. వయసులో నీకంటే పెద్దవాన్ని కాబట్టి నేను చేతులు పట్టుకొని క్షమించు అని అడగలేను. నీకే ఆయుష్ క్షణం అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. మొత్తానికి రాజేంద్రప్రసాద్ మాత్రం ప్రణతి, అవనిని ఇంటికి తీసుకోని వెళ్లాలని అనుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ అవని డబ్బులు తీసుకున్న విషయాన్ని అందరికి చెప్తాడు. అది విన్న రాజేంద్ర ప్రసాద్ నీ దగ్గర డబ్బులు తీసుకునింది తన సొంత ప్రయోజనాల కోసం కాదు నీ చెల్లెలు ప్రాణాలు కాపాడటానికి అని రాజేంద్రప్రసాద్ అంటాడు. చెల్లెలు ప్రాణాలు ఏంటి నాన్న ఏమైంది ప్రణతికి అని అందరూ అడుగుతారు. ప్రణతికి అబార్షన్ అయింది. తనకు సడన్గా యాక్సిడెంట్ అవడంతో చనిపోవాలని అనుకుంది. తాను చేసిన తప్పుని తెలుసుకొని అందరికీ దూరం అవ్వాలని ప్రణతి అనుకుంది. మళ్లీ అవని ప్రణతిని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసింది. అబార్షన్ అయిపోయిందని రాజేంద్రప్రసాద్ అంటాడు. అయితే అందరూ అవని గురించి తెలుసుకొని బాధపడతారు. అందరూ కలిసి ప్రణతిని చూద్దామని అంటారు.. రాజేంద్రప్రసాద్ నీకు ఫోన్ చేసి ప్రణతి ఆరోగ్యం ఎలా ఉందో నేను కనుక్కుంటానని అంటారు.
అయితే ప్రణతిని డిశ్చార్జ్ చేశారని అవని రాజేంద్రప్రసాద్ కి చెప్తుంది. ఆ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ రాజేంద్రప్రసాద్ చెప్తాడు.. ప్రణతిని మన ఇంటికి తీసుకొద్దామండి అని పార్వతి అంటుంది. అందరు వెళ్తుంటే పల్లవి ఇవాళ కాదు. రేపు మంచి రోజు కాబట్టి రేపు వెళ్లి తీసుకొని వద్దామని పల్లవి అంటుంది.
ఇక పల్లవి ఎలాగైనా సరే ప్రణతిని ఇంటికి తీసుకురాకుండా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడే శ్రీయా అక్కడికి వచ్చి పల్లవి నువ్వు చేసింది ఏమైనా బాగుందా? ప్రణతి వస్తే అవని వస్తుందని నీకు తెలియదా అని అడుగుతుంది. అదే నేను ఆలోచిస్తున్నానని పల్లవి అంటుంది అప్పుడే చక్రధర్ ఫోన్ చేసి నీకు అర్జెంటుగా ఒక గుడ్ న్యూస్ చెప్పాలి నేను లొకేషన్ షేర్ చేస్తాను అక్కడికి వచ్చేసేయ్ అని అంటాడు.
పల్లవి వాళ్ళ నాన్న చెప్పిన లొకేషన్ కి వెళ్తుంది. చాలా పెద్ద టెన్షన్లో ఉన్న నాన్న ఏంటో చెప్పు అని అడుగుతుంది. ఒక వ్యక్తి బయటకు వస్తాడు. ఈ కొత్త శాల్తీ ఎవరు డాడ్ అనేసి పల్లవి అడుగుతుంది. మీ ఆడపడుచు ప్రణతిని కడుపు చేసి మోసం చేసి పారిపోయిన వాడు వీడే వీడి పేరు ప్రశాంత్ అని చెప్తాడు.. వీడు పారిపోయాడు ఎందుకైనా మంచిదని వెతికితే దుబాయిలో దొరికాడు అని పల్లవికి చెప్తాడు. టైం పాస్ కి ఎంజాయ్ చేసాం ఇప్పుడు కడుపు వచ్చింది పెళ్లి చేసుకుంటే నేను అందుకే పారిపోయాను అని అతను అంటాడు.
పల్లవి అతనికి డబ్బులు ఇవ్వమని అంటుంది. ఈ డబ్బులు ఎందుకు ఇస్తున్నారు కడుపులు చేసినందుకానంటే కాదు. మాకు కావలసినప్పుడు నిన్ను వాడుకుంటాం నేను చెప్పినట్టు నువ్వు చెప్పాలి అని ఒక ప్లాన్ ని అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు.. అక్షయ్ అవని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. చెల్లెలు కాపాడినందుకు థాంక్స్ అని చెప్తాడు. మా చెల్లెలు కాపాడే కాబట్టే నీ మీద గౌరవం ఉంది నువ్వు ఆస్తి విషయంలో చేసిందానికి నీ మీద ఎప్పటికీ అసహ్యమే ఉంటుందని అక్షయ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇక రాజేంద్రప్రసాద్ అవనీకి ఫోన్ చేసి ప్రణీతితో మీ అత్తయ్య మాట్లాడుతుందట ఒకసారి ఇవ్వమ్మా అని అడుగుతాడు. ఆ తర్వాత అవని వెళ్లి ప్రణతికి ఫోన్ ఇస్తుంది.. ఇంట్లో వాళ్ళందరూ ప్రణతికి ధైర్యం చెప్తారు. ఏం కాదు మేము రేపు వచ్చి నేను తీసుకెళ్తామని అందరూ గొప్పగా మాట్లాడుతారు. ఇక అవనీ స్వరాజ్యం నీ కష్టాలు ఇంత త్వరగా తీరిపోతాయని అస్సలు అనుకోలేదు నీకు అభాషణ ఇవ్వడం కూడా ఒకందుకు మంచికే అని అంటారు. ఎక్కడిదో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో పల్లవి ప్లాన్ చేసినట్లు ప్రశాంత్ అక్కడికి వచ్చి చెప్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాల్సిందే..