Brahmamudi serial today Episode: ఇంట్లో వాళ్లతో కలిసి రుద్రాణి రాజ్‌ను ఇంటికి తీసుకొస్తారా..? లేకపోతే డెత్ సర్టిఫికెట్ తెస్తారా..? అంటుంది. దీంతో అపర్ణ కోపంగా రాజ్ బతికే ఉన్నాడని చెప్తే ఇంకా డెత్ సర్టిఫికెట్ అంటావా..? అంటూ తిడుతుంది. ఇంతలో కావ్య కోపంగా రుద్రాణి గారు మీకు కావాల్సింది వాళ్లతో ఉన్న డీల్ సక్సెస్ చేయడమే కదా.ఆవే డబ్బులు తీసుకొచ్చి 24 గంటల్లో వాళ్లకు ఇస్తాను అంటూ బయటకు వెళ్లిపోతుంది. వెనకాలే వచ్చిన అపర్ణ కావ్య అంత కాన్ఫిడెంట్‌గా ఆ రుద్రాణితో చాలెంజ్ చేశావు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావే అని అడుగుతుంది. దీంతో కావ్య కోపంగా లేకపోతే ఆయన డెత్ సర్టిఫికెట్ అడుగుతుందా..? వయసులో పెద్దది అని ఊరుకున్నాను అత్తయ్యా లేకపోతే చెంపలు పగులగొట్టేదాన్ని అంటుంది.
దీంతో అపర్ణ దాని సంగతి నేను చూసుకుంటాను కానీ ముందు ఇప్పుడు వచ్చిన సమస్య గురించి ఏం ఆలోచించావు. రాజ్ వచ్చి కాంట్రాక్ట్ పూర్తి చేయడానికి అసలు వాడికి గతం గుర్తు లేదు కదా..? అలాంటప్పుడు రేపటి లోపు వాళ్లకు రెండు కోట్లు ఎలా ఇస్తావు అని అడుగుతుంది. వాళ్లకు రెండు కోట్లు ఇవ్వడానికి ఆయన రావాల్సిన అవసరం లేదు అత్తయ్యా..? నా పేరు మీద పవర్ ఆప్ అటార్ని ఉంటే చాలు పెండింగ్‌లో ఉన్న పనులన్నీ నేను పూర్తి చేస్తాను అని చెప్తుంది. అయితే నీ ఆలోచన బాగానే ఉంది. కానీ అలా జరగాలన్నా నీ పేరు మీద పవర్ ఆప్ అటార్ని ఇస్తున్నట్టుగా రాజ్ సంతకం చేయాలి కదా..? ఇప్పుడు వాడికి వాడి పేరే గుర్తుకు లేదు అలాంటప్పుడు వాడు సంతకం ఎలా చేస్తాడు అని అడుగుతుంది అపర్ణ. ఏం చేయాలో తెలియడం లేదు అత్తయ్యా.. ఆయన్ని కలవమని చెప్పాను.
కలిశాక ఈ సమస్యను ఏదో రకంగా పరిష్కరిస్తాను అని కావ్య చెప్పగానే.. అపర్ణ బాధగా ఏం చేస్తావో ఏమో నాకేమో కాళ్లు చేతులు ఆడటం లేదు. వాడు ఉన్నట్టు ఒప్పుకోలేమూ.. అలాగని వీళ్లు అడిగినట్టు సర్టిఫికెట్ తీసుకురాలేము అంటుంది. దీంతో కావ్య అత్తయ్యా నేను ఒక విషయాన్ని బలంగా నమ్ముతాను. మన వైపు న్యాయం ఉన్నప్పుడు ఎటు వెళ్లాలో దిక్కుతోచనప్పుడు ఈ పంచభూతాలు మనకు తోడుగా నిలబడి మనల్ని ముందుకు నడిపిస్తాయి. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. ఆ దేవుడే మనకు దారి చూపిస్తారు అని చెప్పి కావ్య వెళ్లిపోతుంది.
కారులో వెళ్తూ రాజ్‌కు ఫోన్ చేస్తుంది కావ్య. ఎక్కడున్నారు.. మిమ్మల్ని ఒకసారి కలవాలి అని అడుగుతుంది. మీరు నన్ను కలవాలని అడుగుతున్నారా..? అని ఆశ్చర్యంగా రాజ్ అడగ్గానే.. ఏం అడగకూడదా మీతో ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అందుకే కలవాలని అడుగుతున్నాను అని చెప్తుంది కావ్య. కాఫీ షాపులో ఉంటాను వెంటనే వచ్చి కలవండి అని చెప్తుంది. దీంతో రాజ్ ఇంతగా అడుగుతుందంటే వెంటనే వెళ్లి కలవాలి అనుకుంటాడు రాజ్.
వైదేహి పంతులును పిలిపించి యామిని, రాజ్‌కు పెళ్లి ముహూర్తం గురించి అడుగుతుంది. ఇంతలో యామిని వాళ్ల డాడీ రాజ్‌కు కూడా ఒక మాట చెప్పు.. అంటాడు. దీంతో యామిని ఎందుకు డాడీ అంత టెన్షన్ హాస్పిటల్ లోనే ఒప్పుకున్నాడు కదా..? మళ్లీ ఇప్పుడు కొత్తగా చెప్పడం ఏంటి అంటుంది. దీంతో ఆయన ఎందుకైనా మంచిది ఒక మాట చెబితే బాగుంటుంది అంటాడు. ఇంతలో రాజ్ బయటకు వెళ్తుంటే.. బాబు నీ గురించే అనుకుంటున్నాము నువ్వే వచ్చావు రా వచ్చి కూర్చో అని చెప్తాడు. దీంతో రాజ్ నేనొక చిన్న పని మీద వెళ్తున్నాను. ఏంటి విషయం చెప్పండి.. అంటాడు. దీంతో వైదేహి ఏం లేదు అల్లుడుగారు పెళ్లికి మీ ఇద్దరి జాతకాలు చూపించి మంచి ముహూర్తం పెట్టుకుంటే పని అయిపోతుంది కదా అని పంతులు గారిని పిలిపించాం. నువ్వు కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పగానే.. రాజ్ టైం అవుతుందని అనుకుని పెద్దవాళ్లు మీరు ఉన్నారు కదా..? మీరు ఎలా అంటే అలానే మీరు కానిచ్చేయండి అని చెప్పి రాజ్ వెళ్లిపోతాడు.
కాఫీ షాప్‌కు వచ్చిన రాజ్‌తో కావ్య తాను ఒక ప్రాబ్లమ్ లో ఉన్నానని దాని వల్ల తన జాబ్ పోయే పరిస్థితి వచ్చిందని చెప్తుంది. దీంతో రాజ్ బాధగా నేను ఏమైనా హెల్ప్ చేయగలనా అని అడుగుతాడు. దీంతో మా బాస్ లాగా ఒక చిన్న సంతకం చేయండి అని కావ్య అడుగుతుంది. దీంతో ఒకరి సంతకం ఫోర్జరీ చేయడం నా వల్ల కాదండి అంటాడు రాజ్. దీంతో కావ్య బాధపడుతూ నేను ఇంత కష్టంలో ఉన్నప్పుడు మీరు ఇలా చేయడం కరెక్టేనా అని అడుగుతుంది. దీంతో రాజ్ నా వల్ల కాదండి అంటూ కరాకండిగా చెప్తాడు. దీంతో కావ్య కోపంగా అయితే మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ చెప్పగానే.. రాజ్ వెళ్లిపోతాడు. దీంతో కావ్య ఈయన చేయకపోతే ఏంటి..? నేనే ప్రాక్టీస్ చేసి చేసుకుంటాను అనుకుంటుంది.
తర్వాత కావ్య తమకు రెండు కోట్లు ఇచ్చిందని రుద్రాణికి ఫోన్ చేసి చెప్తాడు బిజినెస్ పార్ట్‌నర్. దీంతో కావ్యకు పవర్ ఆఫ్ అటార్ని లేదు కదా ఎలా ఇచ్చిందని అడుగుతుంది రుద్రాణి. దీంతో రాజ్ పవర్ ఆఫ్ అటార్ని ఇచ్చాడట అందుకు సంబందించిన డాక్యుమెంట్స్ కూడా నాకు సెండ్ చేసింది అని చెప్పగానే ఆ డాక్యుమెంట్స్ నా మెయిల్‌కు సెండ్ చేయ్ అని చెప్తుంది రుద్రాణి.
తర్వాత అందరూ హాల్లో కూర్చుని ఉండగా డాక్యుమెంట్స్ ఫ్రింట్ తీసుకొచ్చి అందరి ముందు వేస్తుంది రుద్రాణి. కావ్య చేసిన డాక్యుమెంట్స్ మోసం గురించి అందరికీ చెప్తుంది. దీంతో రాజ్ లేకుండా కావ్య పేరు మీదకు పవరాఫ్ అటార్ని ఎలా వస్తుందని సీతారామయ్య అడుగుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. దీంతో రుద్రాణి షాక్ అయ్యారా..? నేను కూడా మీలాగే షాక్ అయ్యాను అని చెప్తుంది. ఇంతలో కావ్య వస్తుంది. చనిపోయిన రాజ్ ఎప్పుడు బతికొచ్చాడు. నీ పేరు మీద పవరాఫ్ అటార్ని ఎప్పుడు రాసిచ్చాడు అని అడుగుతూ పేపర్స్ తీసుకొచ్చి కావ్యకు ఇస్తుంది రుద్రాణి. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?