Intinti Ramayanam Today Episode April 29th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంటికి వాళ్లంతా రాజేంద్ర ప్రసాద్ కు నిజం చెప్పి బాధ పడతారు. అక్షయ్ కూడా ఆ ప్రశాంత చెప్పిన మాటలు నమ్మి అవని పై ద్వేషాన్ని పెంచుకుంటాడు. ఆ అవని ఎంత మోసం చేయాలని చూసినా కూడా ప్రణతి అవనిని గుడ్డిగా నమ్మేస్తుంది. మనం ఇప్పుడు ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో లేదు. ప్రతిరోజు పోతే తనే అర్థం చేసుకొని రియలైజ్ అవుతుంది అప్పుడు వెళ్లి తీసుకు వస్తాను నాన్న అని అక్షయ్ అంటాడు. అవని చేసింది దానికి నన్ను క్షమించండి నాన్న అని అక్షయ్ అనగానే రాజేంద్రప్రసాద్ మీరంతా ఆ ప్రశాంత్ మాటలు నమ్ముతున్నారా అని అడుగుతాడు. వాడు చూపించిన ఆధారాలు అలా ఉన్నాయి మావయ్య అవని అక్క ఇదంతా చేసిందని అక్కడ తెలిసిపోయింది అని పల్లవి అంటుంది. రాజేంద్రప్రసాద్ మాత్రం ఆ ప్రశాంత్ ఎదవని తెలుసుకుంటాడు. అవని తప్పు చెయ్యలేదు అని తెలుసుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని ఆరాధ్య కోసం బాక్స్ తీసుకొని వెళ్తుంది.. అప్పటికే ఆరాధ్యకు అన్నం పెట్టడం చూసి షాక్ అవుతుంది. అది చూసిన అవని షాక్ అవుతుంది. నా కూతురికి అన్నం పెట్టే బాధ్యతలు నీకు ఎవరు ఇచ్చారు అని అవని పల్లవిని అడుగుతుంది. అప్పుడు అక్కడికి వచ్చిన అక్షయ్ నేనే పల్లవిని చూసుకోమని చెప్పాను. ఆరాధ్య బాధ్యతలని పిన్నిగా పల్లవి చూసుకుంటుంది. నేనే ఆ అధికారాన్ని ఇచ్చాను నీలాంటి మోసగత్తేలు ఇలా నా కూతురు జీవితంతో ఆడుకుంటే అస్సలు సహించను అని అవనికి వార్నింగ్ ఇస్తాడు.. ఎవరిని చెప్పినా మీరు గుడ్డిగా నమ్మేస్తారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని అవని అంటుంది. పల్లవి ఇక ముందు ముందు నీకు వరుస షాక్ లు తగులుతాయని అంటుంది.
ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను తట్టుకోలేక గుడికి వెళ్లొద్దామని రాజేంద్రప్రసాద్ వెళ్తాడు. అలాగే ప్రశాంత్ ఎంత మోసగాడు అని తన ఇంటికి వెళ్లి మరి అవని ప్రణతి చెప్పగానే తెలుసుకుంటాడు. ఇంట్లో వాళ్ళందరితో మన కళ్ళతో చూసింది నిజం అని మనం నమ్మలేము అని రాజేంద్రప్రసాద్ అంటాడు. కమల్ కూడా దేవుడు మనకు కనిపించడు అయినా దేవుడు నన్ను నమ్ముతున్నాం కదా అలాగే అవని వదిన కూడా తప్పు లేదని నేను నమ్ముతున్నాను అని అంటాడు. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు అవని వదిన గురించి మాట్లాడుతున్నారని శ్రియ అనగానే కమల్ అవని వదిన గురించి అయితే నాతో మాట్లాడొద్దు వదినా అనేసి చెప్తాడు.
అప్పుడే ఆరాధ్య కోపంగా ఇంటికి వస్తుంది.. ఏమైంది బంగారం అలా ఉన్నావు అంటే అమ్మ నా కోసం అన్నం తీసుకొని వస్తే పల్లవి పిన్ని నాన్న అమ్మ నువ్వు తిట్టారు నాతో మాట్లాడొద్దని చెప్పారు అని బాధపడుతుంది. ఇంట్లో కొచ్చినా పల్లవి పై కమల్ సీరియస్ అవుతాడు. ఆ కోపంతో వెళ్లి అన్నం తింటాడు. అంతన్న నువ్వు ఒక్కడివే తినేసావ్ ఏంట్రా పల్లవి తినలేదు అని భానుమతి అంటుంది. దానికి కమల్ ఆరాధ్య తినకపోతే అవని వదిన తినదు. అవని వదిన తిన్నప్పుడు పల్లవి తింటే ఎంత తినకపోతే ఎంత అందుకే కడుపు మంట వచ్చేలా చేసానని కమలంటాడు.
తల్లి లేని పిల్లని తల్లిలాగ చూసుకోవడం తప్పేంటి రా అని పార్వతి అడుగుతుంది. అన్న పిల్లల్ని తల్లిలాగా చూసుకున్నా భార్య దొరకడం మీ అదృష్టం రేపు నీ పిల్లల్ని అంతకుమించి బాగా చూసుకుంటున్న నేను ఆలోచించవేంట్రా అని పార్వతి అరుస్తుంది. మన పిల్లల్ని మన హక్కులతో పెంచొచ్చు వదిన పిల్లని ఇష్టమొచ్చినట్లు ఉంచాలి కదా ఆ హక్కు మనకు లేదన్న విషయం తెలియదా అని కమల్ సీరియస్ అవుతాడు.
ఇంటికొచ్చిన అవన్నీ బాధపడుతూ కనిపించడంతో స్వరాజ్యం అడుగుతుంది.ఏమైంది అవన్నీ తీసుకెళ్లిన బాక్స్ బరువుగానే ఉంది తినలేదా అంటే.. ఆరాధ్యకు నేను అన్నం పెడుతుంటే ఆయన పెట్టద్దని తిట్టారు పిన్ని అందుకే తినలేదు అంటుంది. పొద్దున కూడా ఏమీ తినలేదు అక్క ఇప్పుడు అన్నం తిను అనేసి భరత్ అంటాడు. అప్పుడే ఆరాధ్య ఇంటికి వస్తుంది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అనగానే తాతయ్య తీసుకొచ్చాడు అని అంటుంది. రాజేంద్రప్రసాద్ అందరితో కలిసి సరదాగా భోజనం చేస్తాడు. ఆరాధ్యను మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాడు. కమల్కు ఆరాధ్య అవని దగ్గరికి వెళ్లిన విషయాన్ని చెప్తుంది. అది విన్న పల్లవి అక్షయ్ పార్వతీతో చెప్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఆరాధ్యను స్కూల్ మారిపిస్తాడు అక్షయ్.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..