Rahul Dravid: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో సోమవారం రోజున రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Rajasthan Royals vs Gujarat Titans ) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ కొత్త ప్లేయర్ వైభవ్ సూర్య వంశీ దుమ్ము లేపాడు. 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi ). ఈ తరుణంలోనే పలు రికార్డులను కూడా నమోదు చేసుకున్నాడు. అయితే రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్య వంశీ దుమ్ము లేపడంతో ఆ జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్.. దెబ్బకు కోల్కున్నాడు.
Also Read: Vaibhav Suryavanshi: బుడ్డోడు అనుకున్నార్రా.. 14 ఏళ్ళ వైభవ్ సూర్యవంశీ సెంచరీ
వీల్ చైర్ పైనుంచి వచ్చిన రాహుల్ ద్రావిడ్ ( Rahul Dravid)
రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తాజాగా ఆసుపత్రి పాలయ్యారు. ఐపీఎల్ 2025 ప్రారంభం కంటే ముందు ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది. అయినప్పటికీ వీల్ చైర్ పైనే గ్రౌండ్లోకి వచ్చి…. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లలో… విశ్వాసం నింపుతున్నారు. దీనికి సంబంధించిన చాలా వీడియోలు అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజుల నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నారు రాహుల్ ద్రావిడు.
అయితే తాజాగా 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ దెబ్బకు.. రాహుల్ ద్రావిడ్ కోలుకున్నాడు. వీల్ చైర్ పైనుంచి లేచి మరి… వైభవ్ సూర్య వంశీ సెంచరీని ఎంజాయ్ చేశాడు. అతడు కొట్టిన షాట్లను ఆస్వాదించిన రాహుల్ ద్రావిడ్ ఎంజాయ్ చేశాడు. రాహుల్ ద్రావిడ్ ఒక్కడే కాదు… గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లతో పాటు అభిమానులు కూడా… లేచి నిలబడి మరి చప్పట్లు కొట్టారు. అంతా భయంకరమైన ఇన్నింగ్స్ ఆడాడు వైభవ్ సూర్య వంశీ. ఆటో రాహుల్ ద్రావిడ్ కూడా వీల్ చైర్ పైనుంచి లేచి వచ్చి చప్పట్లు కొట్టాడు. తన కాలు కాస్త నొప్పిగా ఉన్నా కూడా భరించాడు. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి.
Also Read: Shubman Gill Sister: గిల్ సెంచరీ చేయాలని.. ఈ అందమైన అమ్మాయి ఏం చేసిందంటే
చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 35 బంతుల్లోనే… సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన వీరుడు ఎవరూ లేరు. కానీ తాజాగా ఆ రికార్డు సృష్టించాడు 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ. అటు క్రిస్ గేల్ కూడా… 30 బంతుల్లోనే గతంలో సెంచరీ చేశాడు. అతని తర్వాత… ఇప్పుడు వైభవ్ వైభవ్ సూర్య వంశీ 30 బంతుల్లోనే సెంచరీ చేశాడు. కాగా,ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే.
Rahul Dravid appreciating Vaibhav Suryavanshi 100 pic.twitter.com/QcnzqaHBjL
— Out Of Context Cricket (@GemsOfCricket) April 28, 2025