BigTV English

Fake Certificate Scam: భారీ స్కామ్.. ఫేక్ సర్టిఫికెట్లతో ఆర్మీ జాబ్స్.. చివరకీ..

Fake Certificate Scam: భారీ స్కామ్.. ఫేక్ సర్టిఫికెట్లతో ఆర్మీ జాబ్స్.. చివరకీ..

Fake Certificate Scam: మీరు పరీక్షలు రాకపోయినా పర్వాలేదు.. సర్టిఫికేట్లు ఇచ్చేస్తాం అని చెప్పేవాళ్ల మాటలు నమ్మకండి.. మోసపోకండి. ఇక తాజాగా ఆదిలాబాద్ జిల్లాల్లో ఫేక్ సర్టిఫికేట్లు కలకలం రేపోతుంది. ఫేక్ నివాస ధ్రువీకరణ పత్రాలతో జిల్లాలో సుమారు.. 15 నుండి 18 వరకు ఆర్మీ ఉద్యోగాలు సాధించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.


వివరాల్లోకి వెల్తే.. ఫేక్ సర్టిఫికేట్లతో ఏకంగా ఆర్మీ జాబ్‌లు కొట్టేసారు దుండగులు. ఉద్యోగం కోసం నివాస పత్రాలు దరఖాస్తు చేసుకొని దొరికిపోయారు కేటుగాళ్లు. స్థానిక జిల్లా అంటూ పక్క రాష్ట్రాల నుంచి వచ్చినవారికి నివాస పత్రాలు జారీ అయ్యాయి. ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్‌లో నివాసం ఉంటున్నట్టుగా ఇతర రాష్ట్రాల వ్యక్తులు ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించి ఉద్యోగాలు పొందారు. అయితే సర్టిఫికెట్లు పొందినవారిలో స్థానికులు లేరని గ్రామస్తులు నిర్ధారించారు. దీంతో అనుమానం వచ్చి వెరిఫికేషన్‌కు ఉన్నత అధికారులు ఆదేశించడంతో వీరంతా ఫేక్ అని తేలింది. ఆర్మీ ఉద్యోగాలకు ఫేక్ సర్టిఫికెట్లు అనే స్కాం వెనుక ఎవరున్నారు? అనేది అంతు ఇప్పటి వరకు చిక్కలేదు.

ఈ ప్రాంతం కానివారికి ఇక్కడ సర్టిఫికెట్లు ఎలా వచ్చాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆధార్‌లో అడ్రస్ మార్చి మీసేవలో దరఖాస్తు చేసినట్టు ప్రాథమికంగా సమాచారం అందుతోంది. ఇచ్చోడ లోని మీసేవ నుంచి ఈ సర్టిఫికెట్లకు దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, తన సంతకం ఫోర్జరీ చేశారని.. గతంలో డిప్యూటీ తహశీల్దార్‌గా పని చేసిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటున్నారు.


ఆర్మీ ఉద్యోగాలకు నివాస ధృవ పత్రాలు నకిలీవి ఇచ్చినట్లు గుర్తించిన పోలీసులు.. వారిని అరెస్ట్ చేశారు. ఈ విషయంలో ఇంకా ఎంత మంది మీ సేవలో అప్లై చేశారు అనే కోణంలో విచారణ జరిపారు పోలీసులు. అంతేకాకుండా రెవెన్యూ అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. ఒక్క ఇచ్చోడ లోనే కాదు రాష్ట్రంలోని వివిధ మీ సేవ కేంద్రాలను నుంచి దరఖాస్తులు వచ్చినట్లు తేలింది. ఎక్కువ ఇచ్చోడ మండలం ఇస్లాం నగర్‌లో నివాసం ఉన్నట్లు అధికంగా ధృవపత్రాల కోసం ధరఖాస్తులు చేసుకున్నారు. అయితే సర్టిఫికెట్‌లు వచ్చిన వారిలో స్థానికులు లేరని.. గ్రామస్తులు నిర్ధారించడంతో అనుమానం వచ్చి వెరిఫికేషన్ కు ఉన్నత అధికారులు ఆదేశించారు. అందులో వీరంతా ఫేక్ అని తేలింది. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మరి ఇస్లాం నగర్‌లో నివాసముంటున్నట్టు అప్లై చేసుకోవడం అంతు చిక్కని మిస్టరీగా మారింది.

Also Read: నా దేశంలో రక్తం పారితే.. మీకే ఎక్కువ ప్రమాదం.. పాక్‌కు ఓవైసీ స్ట్రాంగ్ వార్నింగ్

ఇటీవల రిజక్ట్ అయిన దరఖాస్తుల వివరాలు కూడా సేకరిస్తున్నారు పోలీసులు. నిందితులు ఉత్తర ప్రదేశ్‌లో చదివి ఇస్లాం నగర్‌లో ధృవ పత్రాలు కోసం దరఖాస్తు చేసినట్లు గుర్తించారు. పోలీసులు విచారణ జరపగా ఎలాంటి రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు జారీ చేయలేదని తెలిపారు రెవెన్యూ అధికారులు.

 

 

 

Related News

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Big Stories

×