Kuldeep Slaps Rinku: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… మంగళవారం రోజున కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా కొనసాగగా…. సొంత గడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఏకంగా 14 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది కోల్కతా నైట్ రైడర్స్ జట్టు. ఈ దెబ్బకు ప్లే ఆప్స్… ఆశలను కూడా సజీవంగా ఉంచుకుంది కేకేఆర్. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.
Also Read: Vaibhav Suryavanshi : మటన్, పిజ్జా విపరీతంగా తింటాడా… అందుకే సెంచరీ బాదేశాడా..వైభవ్ హెల్త్ డైట్ ఇదే
రింకు సింగ్ చెంప పగలగొట్టిన కుల్దీప్ యాదవ్
కోల్కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగిన నేపథ్యంలో…. కుల్దీప్ యాదవ్ కాస్త ఓవరాక్టింగ్ చేశాడు. కేకేఆర్ డేంజర్ ఆటగాడు రింకు సింగ్ చెంప పగలగొట్టాడు కుల్దీప్ యాదవ్. మ్యాచ్ అనంతరం… ఇరుజట్ల ప్లేయర్ లందరూ మాట్లాడుకుంటున్న నేపథ్యంలో…. కేకేఆర్ ప్లేయర్ రింకు సింగ్ ను చూసి కోపం తెచ్చుకున్న దిలీప్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. చెంప చెల్లుమనిపిచ్చాడు. అందరూ చూస్తుండగానే రింకు సింగ్ చెంపపై గట్టిగా కొట్టాడు కుల్దీప్ యాదవ్.
అందరూ చూస్తుండగా కుల్దీప్ యాదవ్ చెంప పైన కొట్టడంతో… అప్పటిదాకా నవ్వుతూ ఉన్న రింకు సింగ్ చాలా సీరియస్ అయ్యాడు. అతని ముఖ కదలికలు మారిపోయాయి. అయినా ఏదో చెబుతూ.. మరోసారి కుల్దీప్ యాదవ్ రెచ్చిపోయాడు. రింగు సింగ్ చెంప రెండో సారి కూడా చెంప పగలగొట్టాడు. ఆ తర్వాత రింకు సింగ్ అలాగే కుల్దీప్ యాదవ్ మధ్య గొడవ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలు కుల్దీప్ యాదవ్ ఇలా ఎందుకు రెచ్చిపోయాడు..? రింకు సింగ్ ను కొట్టేంత పగ ఎక్కడిది? అంటూ ఈ వీడియో చూసిన నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. స్టేడియంలో ఒక ప్లేయర్ ను ఇలా చెంప పైన కొట్టడం చాలా పెద్ద తప్పు అంటూ కుల్దీప్ యాదవ్ పై ఫైర్ అవుతున్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రింకు సింగ్ ను కొట్టడాన్ని చాలామంది క్రికెట్ అభిమానులు జీర్ణించుకోవడం లేదు. సీనియర్ ప్లేయర్ అయి ఉండి ఇలా ఓవర్ యాక్టింగ్ చేయడం తప్పని కుల్దీప్ యాదవ్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు.
కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో రెచ్చిపోయిన రింకు సింగ్
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కుల్దీప్ యాదవ్ను ఒక ఆట ఆడుకున్నాడు రింకు సింగ్. అతడు వేసిన ఒక ఓవర్లో ఏకంగా 22 పరుగులు బాదేశాడు రింకు సింగ్. ఈ దెబ్బకి ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. అయితే తన బౌలింగ్ లో ఎక్కువ పరుగులు చేశాడనే కోపంతో… రింకు సింగ్ ను కుల్దీప్ యాదవ్ కొట్టినట్లు తెలుస్తోంది. క్రికెట్ అభిమానులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Memes on RCB : RCBకి ఇదేం కర్మ రా.. కప్పు రావడం లేదని..వెల్డింగ్ షాప్ లో చేసుకున్నారు
Yo kuldeep watch it pic.twitter.com/z2gp4PK3OY
— irate lobster🦞 (@rajadityax) April 29, 2025