Intinti Ramayanam Today Episode April 3rd : నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ ని అరెస్ట్ చేయాలి అటెంప్ట్ మర్డర్ కేసు కింద అనేసి పోలీసులు చెప్తారు. ఇక అవన్నీ ఇలాంటి పనిచేస్తదని అసలు ఊహించలేదు అంటూ పల్లవి అవనిపై చాడీలు చెప్పే ప్రయత్నం చేస్తుంది. కేసు పెట్టింది అవని వదిన కాదు నేను అనేసి కమలంటాడు. మీ నాన్న మీద నువ్వు కేసు పెట్టడమేంటి అనేసి కమల్ ని అందరూ తిడతారు. వేరే వాళ్ళు చేస్తే తప్పు నాన్న చేస్తే తప్పు కాదా అనేసి కమల్ అందరితో గట్టిగానే వాదిస్తాడు. పోలీసులు మాత్రం రాజేంద్రప్రసాద్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది మీరు రండి అనేసి అంటారు.
రాజేంద్ర ప్రసాద్ ను పోలీసులు తీసుకెళ్తుంటే బయట అవని వస్తుంది. ఎవరు చంపాలని ప్రయత్నించలేదు పొరపాటున తగిలింది. నేను కేసు పెట్టలేదు కదా హత్య ప్రయత్నం చేస్తే నేను కేసు పెట్టాలి. అవని అరెస్ట్ చేస్తారా నిజా నిజాలు తెలుసుకొని అరెస్ట్ చేయడం మేలు అనేసి ఎస్ఐతో అంటారు.. ఇక పోలీసులు రాజేంద్రప్రసాద్ వదిలేసి వెళ్లిపోతారు. ప్రణతి ప్రెగ్నెన్సీ గురించి స్వరాజ్యంకు దయాకర్కు నిజం తెలిసిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే..కమల్ భానుమతి పల్లవిలకు మధ్య ఫిట్టింగ్ పెడతాడు. పల్లవిని భానుమతి నా మొగుడు ఫోటో ఎందుకు తీసావ్ అంటూ చితక్కొట్టేస్తుంది. పెద్ద దానివని ఊరుకుంటున్నా అని పల్లవి అంటుంది. నన్ను కొట్టేంత పెద్ద దానివి నువ్వు అనేసి ఇద్దరు ఒకరినొకరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు. కమల్ మాత్రం వీళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటాడు. నేను వేసిన ప్లాను ఇంత బాగా వర్క్ అవుతుందని అని అస్సలు అనుకోలేదు అని అంటారు.. ఆ తర్వాత కమ్మలు వీళ్లిద్దరు చేసిందానికి బాగా తిక్క కుదిరిందని అంటాడు. ప్రణతి మాత్రం అవని వదిన అవమానాలు పడుతుందని బాధపడుతూ ఉంటుంది.
అక్షయ్ ఆఫీసులో కొత్త స్టాక్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక అవని ఆఫీస్కు రావడం చూసి షాక్ అవుతాడు. అందరూ చెయ్యికి ఏమైందని అడుగుతారు. అవని మాత్రం అసలు నిజం చెప్పకుండా చిన్న యాక్సిడెంట్ జరిగిందని ఆఫీసులోని స్టాఫ్ తో అంటుంది. యాక్సిడెంట్ అయితే మీరు అతని పట్టుకున్నారా? మీకు యాక్సిడెంట్ చేశాడు అంటే వాడికి ఎంత ధైర్యం ఉండాలి మీకు ఇప్పుడు ఎలా ఉంది మేడం మన అందరూ అడుగుతారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా అని అవనిని అడుగుతారు. కానీ అవని మాత్రం చిన్న యాక్సిడెంట్ నాదే పొరపాటు కింద పడ్డాను అని అంటుంది.
ఇక అవని లోపలికి వెళ్ళగానే అక్షయ్ కి గుడ్ మార్నింగ్ చెప్తుంది. కానీ అక్షయ్ మాత్రం అవనితో మాట్లాడను కూడా మాట్లాడడు. ఇక టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతాడు. మనసుకు తగిలిన గాయాలకి టాబ్లెట్స్ లేవు కదా అనేసి అంటాడు. నేను చేతి గాయం గురించి అడిగాను అని అంటే మనసుకు తగిలిన గాయం గురించి అడగ లేదన్నమాట మనసుతో మీకు పని లేదన్నమాట అనేసి అంటుంది అవని..
ఇక అప్పుడే ఒకతను వచ్చి సార్ మా చెల్లెలికి సీమంతం జరిపిస్తున్నాను సార్ నాకు లీవ్ కావాలని అడుగుతాడు. మీ చెల్లెలికి పెళ్లయిన విషయం కూడా నాకు ఎప్పుడూ చెప్పలేదు అని అడిగితే.. మా చెల్లి పెళ్లి గురించి నాకు కూడా తెలియదండి తను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్. ఎవరికోసమో రక్తసంబంధాన్ని వదులుకోలేము కదా అనేసి అతను అంటాడు. మా చెల్లి ప్రెగ్నెంట్ కాబట్టి ఇంట్లో వాళ్ళందరిని నేనే ఒప్పించి తన సీమంతానికి తీసుకెళ్తున్నాను అని అతను అంటాడు. దానికి అక్షయ్ ఒక్కరోజు కాదు రెండు మూడు రోజులు తీసుకున్న పర్లేదు మీ చెల్లెలు సంతోషమే ముఖ్యం అనేసి అంటాడు.
అవనికి డబ్బులు ఇవ్వబోతాడు. ఈ డబ్బులు ఎందుకు అని అవని అడుగుతుంది. మా చెల్లెలు ప్రెగ్నెంట్ నీ దగ్గర ఇప్పుడు ఉంటుంది కాబట్టి తనకి మంచి హెల్తీ ఫుడ్ పెట్టాలి అందుకే నేను ఈ డబ్బులు ఇస్తున్నానని అక్షయ్ అంటాడు. నేను ఇవ్వడం ఎందుకు మీరే వచ్చి మీ చెల్లెలుకు డబ్బులు ఇవ్వచ్చు కదా అనేసి ఆవని అంటుంది. ఇక ఆ విషయం ప్రణతితో అవని చెప్తుంది. మీ అన్నయ్య నీకోసం చూడ్డానికి వస్తాడు నువ్వు మంచిగా మాట్లాడు అనేసి అంటుంది. నేను చేసిన పాయసం అంటే మీ అన్నయ్యకు చాలా ఇష్టం ఇది నేను చేశాను అని కాకుండా అసలు నేను ఇంట్లో ఉన్నాను అని కూడా కాకుండా నువ్వు చూసుకోవాలని ప్రణతితో అంటుంది.
అనుకున్నట్లుగానే అక్షయ్ ఇంటికి వస్తాడు. ప్రణతితో ప్రేమగా మాట్లాడుతాడు. తనకోసం ఫ్రూట్స్ డ్రైఫ్రూట్స్ లాంటివి తీసుకొని వస్తాడు. ఆ తర్వాత ప్రణతి తన అన్నని ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఇక అవని చేసిన పాయసాన్ని ప్రణతి అక్షయ్కిస్తుంది. ఆ పాయసం తిని ఇది అవని చేసింది కదా నేను నా చెల్లెలు కోసం వచ్చాను మళ్లీ నీ ప్రేమలు నటించాలని అనుకుంటున్నావా అని అంటుంది. నువ్వంటే ఎప్పటికీ నా మనసులో ప్రేమ లేదు అని అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇక ఎప్పటికీ ఇంటికి రానివ్వకుండా చేయాలని పల్లవి కంకణం కట్టుకుంటుంది. ఈ విషయాన్ని పార్వతి దగ్గర చెప్తుంది అవనీని మోసాన్ని అందరి ముందే బయట పెట్టాలి నేను ఒక ప్లాన్ చెప్తాను ఆ ప్లాన్ ప్రకారం చేద్దాం అత్తయ్య ఆ తర్వాత అవనిని శాశ్వతంగా ఇంట్లోంచి బయటికి పంపించేద్దాం. అందరి మనసులో అవని చెడ్డది అయిపోతుంది కదా అని అంటుంది. పార్వతీ ఇలా చేస్తే తప్పేమో అని అనుకుంటుంది. కానీ పల్లవి మాత్రం ఇలా చేస్తేనే కరెక్టు అత్తయ్య ఇంకొకసారి అవని మన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటుంది మన వాళ్ళు ఎవరు అవనీని ఇంట్లోకి రానివ్వరు అని అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఎపిసోడ్లో అవనిని ఇంటికి తీసుకొస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..