Kissik Talks: కిస్సిక్ టాక్స్ 75వ ఎపిసోడ్ సెలబ్రేషన్స్ సందడిగా జరిగాయి. ఫైమా, యాదమరాజు, విష్ణుప్రియ, డెమోన్ పవన్, వర్ష తదితరులు పాల్గొన్న ఈ వేడుకల్లో సరదా సంభాషణలు, ఆటపట్టింపులు, డ్యాన్స్ మూమెంట్స్‌తో సెట్ పూర్తిగా కామెడీగా మారిపోయింది. ముఖ్యంగా పెళ్లి విషయాన్ని ప్రస్తావిస్తూ జరిగిన సంభాషణలు అక్కడున్న వారందరినీ నవ్వించాయి.
బిజినెస్ లో పార్టనర్ షిప్ ఏమైనా ఇస్తారేమో
ఈ సెలబ్రేషన్స్‌లో ముఖ్యంగా పెళ్లి గురించి ప్రస్తావన రావడంతో మాటల మధ్యలోనే ఫుల్ ఫన్ మొదలైంది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సోనియా ఆకుల (Sonia aakula) తన భర్త యష్ (Yash) కలిసి రాగా వర్ష “నా పెళ్లి ఈరోజే” అంటూ చేసిన కామెంట్ నవ్వులు పూయించింది.
ఇక వర్ష, యష్ (Yash) తో మనం కలిసి డాన్స్ చేద్దాం అనగా సోనియా ఆకుల మీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే గ్రాండ్‌గా పెళ్లి చేస్తానంటూ సరదాగా చెప్పడంతో అక్కడున్నవారంతా నవ్వులో మునిపోయారు.దీనికి వర్ష నేనింకా మీ బిజినెస్ లో పార్టనర్ షిప్ ఏమైనా ఇస్తారేమో అనుకున్నా అంటే దానికి కూడా సిద్దం అని చెప్పుకొచ్చింది సోనియా.
అలాగే “గుర్రానికి గుర్రాన్నే అంటగట్టాలి.. దున్నపోతుని తీసుకెళ్లి గుర్రంతో కలపకూడదు” అంటూ సోనియా చేసిన సరదా కామెంట్స్ కూడా హైలైట్‌గా నిలిచాయి.ఇక సోనియా, యష్ ల పాప గిన్నీస్ రికార్డ్ కొట్టడంతో వారిద్దరికీ విషెస్ తెలిపాడు పవన్.
ఫైమా చాలా అందమైన అమ్మాయి
ఇక వీరి తర్వాత జబర్దస్త్ లేడీ కమెడియన్ ఫైమా (Faima ) తన భర్త ప్రవీణ్ (Praveen) తో వచ్చి ఈవెంట్ ని ఫుల్ కలర్ ఫుల్ గా మార్చేసింది.ముఖ్యంగా ఫైమా తన డాన్స్ తో ఈవెంట్ లో రచ్చ చేసిందనే చెప్పాలి. ఇక ఫైమా ని చూసి అదే విన్నాను ఫైమా వాళ్ళ ఆయనని చేస్తుంది ఖైమా అంటూ చెప్పడంతో ఖైమా కాదు కాని డామినేట్ చేస్తుంది అంటూ నవ్వులు పూయించాడు ప్రవీణ్. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఎలా అనిపిస్తుంది అని ఫైమా అడగడంతో చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నా అని చెప్పాడు ప్రవీణ్. ప్రపంచంలో తెలివైన ,చాలా అందమైన అమ్మాయి ఫైమా అనడంతో సిగ్గుపడిపోయింది ఫైమా.
డైలాగులో ఉన్న పవర్ మొహంలో లేదు
చివరగా యంగ్ కపుల్ యాదమ్ రాజు, స్టెల్లా జంట ఎంట్రీతో వాతావరణం మరింత జోష్‌గా మారింది. ఫోక్ సాంగ్ వీరు వేసిన మాస్ డాన్స్ పెర్ఫార్మెన్స్ షోకి హైలైట్‌గా నిలిచాయి. యాదమ్ రాజు పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత ఎలా మారిపోయాడు అనే అంటూ అక్కడున్న వారు చేసిన కామెంట్స్ నవ్వులు పూయించాయి. డైలాగుల్లో పవర్ ఉన్నా, మొహంలో ఆ పవర్ కనిపించడం లేదంటూ రాజుపై వేసిన వర్ష వేసిన సెటైర్లు కార్యక్రమాన్ని మరింత ఎంటర్ టైనింగ్ గా మార్చాయి .
.ఈ సందర్భంగా తమ మధ్య ఉన్న అనుబంధం గురించి కూడా పలువురు మాట్లాడుకున్నారు. చాలా కాలంగా ఒకరితో ఒకరు పరిచయం ఉండటం వల్ల తమ మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉందని చెప్పుకొచ్చారు. కొత్తగా వచ్చిన వాళ్లతో పోలిస్తే పాత పరిచయాల వల్ల ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకోగలుగుతున్నామని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
ఫైమా బాగుందా.. వర్ష బాగుందా?
కార్యక్రమంలో ఫైమా గురించి కూడా సరదా ప్రశ్నలు వచ్చాయి. ఆమె ఎలా ఉంటుంది, ఎవరి లుక్స్ బాగుంటాయి అనే విషయాలను కూడా సరదాగా ప్రస్తావించారు. “ఫైమా బాగుందా.. వర్ష బాగుందా?” అంటూ వర్ష వేసిన ప్రశ్న వేసింది, దానికి ముందు వర్పైష బాగుంది అంటూ ఆన్గాసర్ ఇచ్చాడు సిద్దార్థ్ .వర్ష మాట్లాడుతూ ‘సిద్దు నువ్వు నా నడుము చూశావ్’ అనడంతో నువ్వు సిద్దు అంటే అక్కడ గుద్దే అంటూ అని ఫైమా సెటైర్ వేసింది.
క్యాట్‌వాక్ చేసిన వర్ష,ఫైమా
అంతేకాదు.. వేదికపై వర్ష,ఫైమా నడిచిన క్యాట్‌వాక్ మరియు డిస్కో డాన్స్ విన్యాసాలు విపరీతంగా ఆకట్టుకున్నాయనే చెప్పాలి . ఫైమా వేసే కామెడీ టైమింగ్, ఇచ్చే కౌంటర్లు అక్కడున్న వారందరినీ పొట్టచెక్కలయ్యేలా నవ్వించాయి. పెళ్లి తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పులను, బాధ్యతలను ఆమె సరదాగా పంచుకుంది.