Kissik Talks: కిస్సిక్ టాక్స్ 75వ ఎపిసోడ్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. ఈ స్పెషల్ ఎపిసోడ్‌లో . సాధారణ ఎపిసోడ్‌లకు భిన్నంగా ఈసారి సెలబ్రేషన్స్‌లో సరదా ఆటలు, ప్రేమ–పెళ్లి విషయాలపై చర్చ, ఒకరిపై ఒకరు వేసుకున్న పంచులు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విష్ణుప్రియ–సిద్ధు, యాదమరాజు–స్టెల్లా జంటలకు సంబంధించిన ప్రశ్నలతో ఈవెంట్ మరింత ఆసక్తికరంగా మారింది.
విష్ణుప్రియ–సిద్ధు జంట గురించి చర్చ మొదలైంది. విష్ణుప్రియను తన భర్త సిద్ధుకు తనలో ఏ విషయం ఎక్కువగా ఇష్టమని అడిగింది వర్ష .అయితే ఈ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పకుండా కొంత మొహమాటపడిపోయింది విష్ణుప్రియ అయితే అక్కడున్నవారు అంతా అసలు విషయం చెప్పాల్సిందే అంటూ ఆమెను ఆటపట్టించారు. చివరకు వారి మధ్య ఉన్న అనుబంధం గురించి విష్ణుప్రియ మాట్లాడింది.
నాలుగేళ్ళు రిలేషన్ లో ఉన్నాం
తమ రిలేషన్‌షిప్ ఒక్కరోజులో ఏర్పడినది కాదని,పెళ్ళయి పదేళ్ళు అయినా అంతకు ముందు నాలుగేళ్ళు రిలేషన్ లో ఉన్నామని అసలు విషయం చెప్పింది. అలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వచ్చామని, పెళ్లై చాలా సంవత్సరాలు గడిచినా తమ మధ్య ఉన్న బాండింగ్‌లో పెద్దగా మార్పు రాలేదని తమ మధ్య ఉన్న ప్రేమని బయటపెట్టింది. ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టం, అర్థం చేసుకునే విధానం తమ రిలేషన్‌కు బలం అని చెప్పుకొచ్చింది.
ఇక తమ ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు చెప్పిన సందర్భాన్ని కూడా విష్ణుప్రియ గుర్తు చేసుకుంది. తాము ఇద్దరూ కలిసి ఇంట్లో అమ్మానాన్నలకు ఈ విషయం చెప్పినప్పుడు అది తమ జీవితంలో చాలా ప్రత్యేకమైన క్షణంగా నిలిచిపోయిందని తెలిపింది. ప్రేమ విషయం ఇంట్లో చెప్పడం ఒకవైపు టెన్షన్‌గా అనిపించినా, ఆ తర్వాత జరిగిన సంఘటనలు మాత్రం తమకు మంచి జ్ఞాపకంగా మిగిలిపోయాయని వివరించింది.
ఇక సిద్దార్థ్ మాట్లాడుతూ తమ ప్రేమ విషయం వాళ్ళ ఇంట్లో చెప్పడానికి వెళ్ళినప్పుడు డోర్ వెనకాల నుండి విష్ణు ప్రియ తొంగి తొంగి చూసిదంటూ ఆనాటి సంఘటనలని గుర్తు చేయడం అక్కడ నవ్వులు పూయించింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులతో తమ రిలేషన్ ఎలా ఉండేదో కూడా ఆమె చెప్పుకొచ్చింది.
మొదటిసారి థియేటర్‌కు వెళ్లి చూసిన సినిమా
విష్ణుప్రియ తర్వాత యాదమరాజు వైపు ప్రశ్నలని ఎక్కు పెట్టింది వర్ష. స్టెల్లాకు తనలో ఏం ఇష్టం? ఆమె ఏ విషయాలను ఎక్కువగా ఇష్టపడుతుంది? ఇద్దరి మధ్య ప్రేమ ఎలా ఉంటుంది? అంటూ సరదాగా ప్రశ్నించారు. యాదమరాజు కూడా మొదట కాస్త తప్పించుకునే ప్రయత్నం చేసినా, చివరకు స్టెల్లాకు సంబంధించిన కొన్ని చిన్న చిన్న విషయాలను బయటపెట్టాడు.
స్టెల్లా తనకు ఇచ్చే గిఫ్ట్స్, ఆమె చూపించే ప్రేమ, చిన్న చిన్న విషయాల్లో కేర్ తీసుకోవడం తనకు ఇష్టమని యాదమరాజు చెప్పాడు. అయితే ఈ సమాధానాన్ని కూడా అక్కడున్నవారు వదల్లేదు. ఒకరికి ఒకరు గిఫ్ట్స్ ఇవ్వడం మాత్రమే ప్రేమకు గుర్తు కాదని, ఆ గిఫ్ట్ వెనుక ఉన్న ఫీలింగ్ ముఖ్యమని చెబుతూ కామెడీ చేశారు.
ఇక స్టెల్లాను యాదమరాజు అంటే ఎంత ఇష్టమని అడిగినప్పుడు ఆమె చెప్పిన విషయం మరింత ఆసక్తిని రేపింది. తన జీవితంలో మొదటిసారి థియేటర్‌కు వెళ్లి సినిమా చూసిన సందర్భాన్ని ఆమె గుర్తు చేసుకుంది. యాదమరాజుతో కలిసి అర్జున్ రెడ్డి
థియేటర్ లో ఏం చేస్తారు సినిమా చూస్తారు
సినిమా చూడటం తనకు ప్రత్యేకమైన అనుభవంగా అనిపించిందని చెప్పింది. అయితే తాను మాత్రం మూడు సార్లు అర్జున్ రెడ్డి చూశానని కానీ ముగ్గురు అమ్మాయిలతో కాదని అనడంతో అక్కడున్న వారంతా గొల్లున నవ్వారు. ఇక థియేటర్ లో ఏం చేశారన్న ప్రశ్నకి థియేటర్ లో ఏం చేస్తారు సినిమా చూస్తారు. అంటూ యాదమరాజు సెటైర్ వేశాడు.
also read :సింగిల్‌గా ఉండటమే బెస్ట్ అంటున్న వర్ష.. విష్ణుప్రియ కౌంటర్ అదుర్స్!
అయితే అక్కడితో ఆగకుండా సినిమా అయిపోయిన తర్వాత ఏం చేశారని యాంకర్లు అడగడంతో అసలు కామెడీ మొదలైంది. సినిమా పూర్తయ్యాక ఇద్దరూ ఏం చేశారు? థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఎక్కడికి వెళ్లారు? అంటూ వరుస ప్రశ్నలు వేయడంతో స్టెల్లా సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఈ సమయంలో యాదమరాజు కూడా మధ్యలో కల్పించుకుంటూ పంచులు వేయడంతో సెట్లో నవ్వులు పూశాయి.