Basheer Master:బషీర్ మాస్టర్.. ఈ పేరు చెప్పగానే చాలా మందికి ఆయన వేసే స్టెప్పులు , ఇచ్చిన ఇంటర్వ్యూలు, ఆయన పై వచ్చే మీమ్స్ ఎక్కువగా గుర్తుకు వస్తాయి.ముఖ్యంగా ఆయన మాటలను, డ్యాన్స్ మూమెంట్స్‌ను మీమ్స్‌గా మార్చి ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తుంటారు నెటిజన్లు.అయితే, ఈ ట్రోల్స్, మీమ్స్ ఎన్ని వచ్చినా బషీర్ ఎక్కడా తగ్గకుండా తన పని తాను చేసుకుపోవడం ఇక్కడ విశేషం.
రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం
బషీర్ మాస్టర్ డ్యాన్స్ జర్నీ విషయానికి వస్తే .. ప్రముఖ కొరియోగ్రాఫర్,స్వర్గస్థులైన రాకేష్ మాస్టర్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఆయన దగ్గరే బషీర్ మాస్టర్ శిష్యరికం చేసి ఎన్నో టెక్నిక్స్ నేర్చుకున్నారు. ముఖ్యంగా డ్యాన్స్ అంటే ఎదో స్టెప్పులు వేయడం మాత్రమే కాకుండా, బీట్ తగ్గట్టుగా ,పాటలోని ఫీల్‌ను అర్థం చేసుకోవడం, గ్రూప్ డ్యాన్సర్లతో కో ఆర్డినేట్ చేసుకోవడం వంటి విషయాలని అన్నింటిని రాకేష్ మాస్టర్ దగ్గరే తెలుసుకున్నానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు బషీర్ మాస్టర్.
‘ప్లానింగ్ సినిమాలో కోరియోగ్రఫీ
అయితే సినిమాలలో అవకాశాల కోసమే ఎదురుచూడకుండా పెళ్లిళ్లలోని ‘సంగీత్’ ఈవెంట్లకు స్పెషల్ గా డాన్స్ ని కంపోజ్ చేస్తు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అలా అదే సంగీత్‌లో కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరూ ఈజీగా, సరదాగా చేసేలా ఎన్నో మంచి మంచి స్టెప్స్ ని కొరియోగ్రఫీ చేసి తన మార్కు ని చూపించాడు బషీర్ మాస్టర్.
ఇక సినిమాల విషయానికి వస్తే 2019లో వచ్చిన ‘ప్లానింగ్ సినిమా లో ఒక పాటకి బషీర్ మాస్టర్ కోరియోగ్రఫీ కూడా చేయడం విశేషం. అలా ఒకవైపు సంగీత్ లలో డాన్స్ కంపోజ్ చేస్తూనే మరో వైపు సినిమాలలో అవకాశాల కోసం తనదైన ప్రయత్నం చేస్తున్నారు.అలాగే కొత్తగా వచ్చే ఎంతో మంది యూత్ కి కూడా డాన్స్ లో శిక్షణ ఇస్తున్నారు.
సుమారు లక్ష నుండి రెండు లక్షల రూపాయలు
ఇక ఇదిలా ఉంటే బషీర్ మాస్టర్ ఒక్కో సంగీత్ ఈవెంట్ కి ఎంత చార్జ్ చేస్తాడో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందిలో కనిపిస్తుంది.గతంలో బషీర్ మాస్టర్ ఇచ్చిన ఇంటర్వ్యూల ఆధారంగా కేవలం ఐదు రోజుల సంగీత్ కొరియోగ్రఫీకి దగ్గర దగ్గరగా సుమారు లక్ష నుండి రెండు లక్షల రూపాయలు తీసుకుంటాడని తెలుస్తుంది.
ఇక అమెరికాలో ఉండే వారికి ఆన్‌లైన్‌లో ఒక్క పాటకి కోరియోగ్రఫీ నేర్పించడానికి ముప్పై నుండి నలబై వేల రూపాయలని తీసుకుంటానని చెప్పారు.అయితే ఇదే విషయంపై సోషల్ మీడియాలో ఇబ్బడి ముబ్బడిగా బషీర్ మాస్టర్ పై ట్రోల్స్ వచ్చినప్పటికీ ఆయన మాత్రం కెరీర్ లో ఎదగాలని చేస్తున్న ప్రయత్నం నిజంగా మెచ్చుకోతగ్గ విషయం.
బిగ్‌బాస్’ షోలో టైటిల్
అంతేకాకుండా, ఏ మాత్రం అవకాశం వచ్చినా ‘బిగ్‌బాస్’ లాంటి ఎంటర్ టైనింగ్ షోలలో తనదైన స్థాయిలో ఆకట్టుకుని టైటిల్ గెలుచుకుంటానని చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పడం విశేషం.ఏది ఏమైనా నెట్టింట ఎన్ని ట్రోల్స్ ఎన్ని మీమ్స్ వచ్చినా ఎంత హల్‌చల్ చేసినా.. వాటిని పట్టించుకోకుండా డ్యాన్స్ ఫీల్డ్ లో ప్రతి స్టెప్ ని కేర్ ఫుల్ గా వేస్తూ ఎదుగుతుండటమే బషీర్ మాస్టర్ ప్రత్యేకత అని చెప్పాలి.
also read :రూ.200 కోట్లు సాధ్యమేనా..? ‘ప్యారడైజ్’కి అసలు పరీక్ష ఇప్పుడే!