E-Paper
Advertisement

నెటిజన్లకు బాలు దిమ్మతిరిగే కౌంటర్.. ఆ రూమర్స్ కు చెక్ పడ్డట్లేనా..?

నెటిజన్లకు బాలు దిమ్మతిరిగే కౌంటర్.. ఆ రూమర్స్ కు చెక్ పడ్డట్లేనా..?
Advertisement

Gundeninda Gudigantalu Balu : ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఒకటి. ఈ మధ్యకాలంలో ఈ సీరియల్ కి మంచి క్రేజ్ వస్తుందన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ సీరియల్ టాప్ లోకి రావడం చూస్తూనే ఉంటాం.. స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం 2 సీరియల్ తో ఈ సీరియల్ పోటీ పడుతుంది. ఇటీవల ఈ సీరియల్ కంటే ఎక్కువగానే ప్రేక్షకుల నుంచి ఆదరణ పొంది, మంచి టీఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకుంది. గుండె నిండా గుడి గంటలు సీరియల్ లోని హీరో బాలు ఇకమీదట ఈ సీరియల్ లో కనిపించడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే కొందరు నెటిజన్లు మాత్రం బాలు బిగ్ బాస్ లోకి వెళ్తున్నాడని అనుమానం వ్యక్తం చేశారు. మరికొందరు బాలు ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నాడు అంటూ ప్రచారం చేస్తున్నారు. వీటన్నిటికీ దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్ ఇస్తూ బాలు ఒక వీడియోని షేర్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో బాలు ఏమని మాట్లాడాడు..? నిజంగానే బాలు బిగ్ బాస్ లోకి వెళ్తున్నాడా? ఇలాంటి ప్రశ్నలకు క్లారిటీ రావాలి అంటే కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకోవాల్సిందే..

నెటిజన్లకు బాలు దిమ్మతిరిగే కౌంటర్..

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు గుండెనిండా గుడి గంటలు సీరియల్ హీరో బాలు గురించి అందరికి తెలిసే ఉంటుంది. ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్  మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ జనాలను ఎంతగా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇందులో హీరోగా నటిస్తున్న బాలు అసలు పేరు విష్ణు కాంత్.. తమిళంలో వరుసగా సీరియల్స్లలో నటించిన ఈ హీరో ప్రస్తుతం వరుస సీరియల్స్ తో బిజీగా మారాడు. నిజానికి  బాలు తమిళ నటుడు అయినా కూడా తన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈ మధ్యకాలంలో ఆ బాలు చేస్తున్న సామాజిక కార్యక్రమాలు జనాలని బాగా కట్టిపడేస్తున్నాయి. ఈ క్రమంలో బాలు గురించి సోషల్ మీడియాలో వార్త గత కొద్ది రోజులుగా షికారు చేస్తుంది.. బులితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 10 లోకి బాలు కంటెస్టెంట్గా ఇంటర్వ్యూ పోతున్నాడు అని వార్తలు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతున్నాయి.. తాజాగా ఈ వార్తలపై స్పందించిన బాలు ఒక వీడియోని రిలీజ్ చేశారు.. ఆ వీడియోలో తను బిగ్ బాస్ కి వెళ్లడం లేదు అని తేల్చి చెప్పేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది

బాలు కొత్త సీరియల్ ఏంటంటే..?

Advertisement

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బాలు ప్రస్తుతం వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఒకవైపు తెలుగులో రెండు సీరియల్స్లలో నటిస్తున్న బాలు తమిళంలో కూడా మరో రెండు సీరియల్స్లలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మరో సీరియల్ అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తుంది. మరి అది తెలుగు సీరియల్ లేదా తమిళ సీరియల్ అన్నది తెలియదు. కానీ ప్రస్తుతం అయితే బాలు మరో సీరియల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త ప్రచారంలో ఉంది.. మరి తెలుగులోనే ఇంకొక సీరియల్ చేస్తాడా? తమిళంలో చేస్తాడా అన్నది క్లారిటీ రావాల్సింది.. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం బాలు బాగా బిజీగా గడుపుతూనే ఉన్నాడు.. సోషల్ మీడియాలో కూడా బాలుకి ఫాలోయింగ్ ఎక్కువే..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. అవనికి అడ్డంగా దొరికిన పల్లవి.. అశ్విన్ దెబ్బకు మైండ్ బ్లాక్..

Advertisement

?igsh=cmg4dW91cWlsY2px

Related News

Brahmamudi Serial Today Episode August 11th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఐషు కోసం రంగంలోకి దిగిన నందు   

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఇంట్లో భారీ దొంగతనం!

సుధీర్ పై మండిపడ్డ హీరో శ్రీకాంత్..ఈ ట్విస్ట్ ఏంటి బాస్!

కమిట్మెంట్ ఆరోపణలపై జబర్దస్త్ వెంకీ రియాక్షన్.. నాపై తప్పుగా చూపిస్తే ఊరుకోను..

యష్మీ గౌడ నెలకు అంత సంపాదిస్తుందా? సీరియల్స్ గుడ్ బై చెప్పేస్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కోసం బాధపడ్డ రోహిణి.. మనోజ్ దెబ్బకు కానిస్టేబుల్ షాక్.. బాలు ఎంతైనా గ్రేట్ అబ్బా..

Karthika Deepam 2 Serial Today Episode August 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఇంట్లో వాళ్లకు షాక్ ఇచ్చిన జ్యోత్స్న   

Big Stories

Advertisement
×