Bigg Boss 10 Telugu Buzz: బిగ్ బాస్ తెలుగు సీజన్ కార్యక్రమం మూడు వారాలను పూర్తి చేసుకుని ముగ్గురు కంటెస్టెంట్ లో హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలాంటి బిగ్ బాస్ కార్యక్రమంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు సరాసరి బిగ్ బాస్ బజ్(Bigg Boss Buzz) కార్యక్రమానికి హాజరవుతున్న సంగతి తెలిసిందే .శనివారం ఎపిసోడ్ లో భాగంగా హౌస్ నుంచి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన కామనర్ మిథిలేష్ రెడ్డి 15 లక్షల రూపాయల సూట్ కేస్ తో బయటకు వచ్చారు. ఈయన హౌస్ లో ఉన్నది కేవలం మూడు రోజులు మాత్రమే ఇలా మూడు రోజులకు గాను బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ ద్వారా 15 లక్షల రూపాయల సూట్ కేస్ ద్వారా బయటకు వచ్చారు.
ఇలా హౌస్ లో ఉన్నది మూడు రోజులకే గాను ఈయన 15 లక్షల రూపాయలు తీసుకొని బయటకు రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఇలా హౌస్ నుంచి బయటకు వచ్చిన మిథిలేష్ బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా శివాజీ మిథిలేష్ రెడ్డికి వరుస ప్రశ్నలు వేస్తూ ఉక్కిరిబికిరి చేశారని తెలుస్తుంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా శివాజీ మాట్లాడుతూ…
బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చావు అని ప్రశ్నించడంతో విజిబులిటీ కోసమే హౌస్ లోకి వచ్చానని మిథిలేష్ సమాధానం చెప్పారు. వెంటనే ఏం విజీబిలిటీ అంటూ శివాజీ ప్రశ్నించడంతో మిథిలేష్ రెడ్డి అనే వ్యక్తి బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు తనకంటూ ఒక సెటాఫ్ స్కిల్స్ ఉన్నాయని నిరూపించుకోవడానికి వచ్చానని సమాధానం ఇచ్చారు. దీంతో వెంటనే ఇవన్నీ నిరూపించుకోవాలి అంటే నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఉండాలి కదా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. నిన్ను మీ నాన్న ఎల్కేజీలో వేసినప్పుడు ఒకేసారి టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఇస్తామంటే నువ్వు వెళ్ళిపోతావా అంటూ శివాజీ మాట్లాడారు. బిందు మాధవిది కూడా మీ ఊరే కదా.. అదే ఊరి నుంచి వచ్చిన ఆమె కప్పు కొట్టింది ఆమె ఆడ పులి.. నువ్వు ఆడ లేక బయటకు వచ్చావు అంటూ శివాజీ సెటైర్లు పేల్చారు.
ఇక ఐదు లక్షల రూపాయలు చిన్న అమౌంట్ కాదు పది లక్షలు కూడా చిన్న అమౌంట్ కాదు ఎందుకు 15 లక్షలకే టెంప్ట్ అయ్యావు.. ఇంకా పెరిగేదేమో మూడు వారాలలో టాప్ ఫైవ్ కంటెస్టెంట్లను ఎలా ఫిక్స్ అయ్యావు అంటూ శివాజీ వరుసగా ప్రశ్నలు వేశారు. బిగ్ బాస్ 10 సీజన్లు జరిగాయి వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారు ఎంతమంది టాప్ పై కంటెస్టెంట్ లోగా వెళ్లారో మీరే చెప్పండి అంటూ శివాజీకి ఎదురు ప్రశ్న వేశారు దీంతో శివాజీ పొటెన్షియాలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే టాప్ ఫైవ్ లోకి వెళ్తారు. నీకు పొటెన్షియాలిటీ లేదని ఒప్పుకుంటున్నావా అంటూ శివాజీ అడిగారు. ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమాన్ని మీరు ఎలా భావిస్తున్నారో తెలియదు కానీ మాకు మాత్రం బిగ్ బాస్ ముందు తర్వాత అనేలాగా ఉందని తెలిపారు. నీ దృష్టిలో టాప్ పై కంటెస్టెంట్లు ఎవరు అంటూ కూడా శివాజీ ప్రశ్నించడంతో మిథిలేష్ పలువురి పేర్లను సూచించారు వారు ఎవరు అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం కావాలి.
Also Read: బూతులు తిడుతూ..చచ్చిపో అంటూ శాపాలు… రేణు దేశాయ్ ఎమోషనల్!