Kissik Talks:ప్రముఖ న్యూస్ ఛానల్ బిగ్ టీవీ లో ప్రముఖ యాంకర్ వర్షా(Varsha), బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ డెమోన్ పవన్ (Demon Pawan) హోస్టుగా ‘వినాయక నిమజ్జనానికి వస్తున్నాం’.. కార్యక్రమం నిర్వహించిన సంగతి తెల్సిందే.
ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సోనియా ఆకుల (Sonia aakula) తన భర్త యష్ (Yash) ,అలాగే జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు (Yadamma raju) తన భార్య స్టెల్లా (Stella) తో రాగా , జబర్దస్త్ లేడీ కమెడియన్ ఫైమా (Faima ) తన భర్త ప్రవీణ్ (Praveen) తో వచ్చి ఈవెంట్ ని ఫుల్ కలర్ ఫుల్ గా మార్చేసింది.ఇక సీరియల్స్ తో మనల్ని ఎంతగానో ఆకట్టుకున్న విష్ణు ప్రియ (Vishnu Priya), ఆమె భర్త సిద్ధార్థ్ వర్మ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొనడం విశేషం.
పెళ్లి చేసుకోవాలా? వద్దా?
కార్యక్రమం మొదట్లోనే పెళ్లి గురించి వచ్చిన టాపిక్‌తో సందడి మొదలైంది. పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనే డౌట్‌తో యాంకర్ వర్షా(, డెమోన్ పవన్ సరదాగా మాట్లాడుకుంటూ, తమకు ఉన్న సందేహాలకు క్లారిటీ తెచ్చుకోవడానికి ఫ్రెండ్స్‌ను పిలుద్దామంటూ యాంకర్స్ చెప్పడం నవ్వులు పూయించింది. ముఖ్యంగా పెళ్లి విషయంలో భయం ఎందుకు వస్తుంది? అసలు పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది? అనే విషయాలను సరదా మాటల్లో ఇందులో ప్రస్తావించారు.
ఒకరు ప్రెజర్ కుక్కర్ వాడితే, మరొకరు హార్పిక్
ఈ రోజుల్లో సంసారాన్ని ఈదడం ఎంతో కష్టంగా మారిందని, ఇంట్లో ఒకరు ప్రెజర్ కుక్కర్ వాడితే, మరొకరు హార్పిక్ వాడుతున్నారని, ఒకరు ఫ్లోర్ క్లీన్ చేస్తుంటే, మరొకరు కిచెన్ సర్ఫింగ్ లేదా పనులు పంచుకుంటున్నారని అంటారు. చిన్న చిన్న విషయాలకు పంతాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో, ఇన్ని రకాల పనుల పంపకాలు మరియు గొడవల మధ్య బ్రతకడం కంటే ప్రశాంతంగా “సింగిల్‌గా, సోలోగా” ఉండిపోవడమే చాలా సంతోషకరమైన విషయమని వర్ష , విష్ణుప్రియ ల మధ్య జరిగిన సంభాషణ నవ్వులు పూయించింది. పైగా అవన్నీ కొనకుండా కూడా పెళ్లి చేసుకొని బతికేయొచ్చు అని మధ్యలో విష్ణుప్రియ కౌంటర్లు వేయడం హైలెట్ గా నిలిచింది.
నువ్వు ఇప్పుడు హ్యాపీగానే ఉంటున్నావా
ఇక ఇదిలా కొనసాగుతుండగానే , వేదికపై ఉన్నవారు విష్ణుప్రియ ని ఉద్దేశించి పవన్ డెమోన్ ఆటపట్టించడం మొదలుపెడతాడు . “సిద్దార్థ్ వర్మతో వదినతో నువ్వు ఇప్పుడు హ్యాపీగానే ఉంటున్నావా అనగానే విష్ణుప్రియ ఇంకొక అమ్మాయిని తెచ్చే ఆలోచన ఏమైనా ఉందా? అనగానే సిద్ధార్థ వర్మ నీకేమైనా వేరే ఆప్షన్ ఉందా?” అని కామెడీగా అడుగుతారు. దానికి వర్ష “విష్ణు ఇంకొక అమ్మాయిని ట్రై చేస్తున్నాడు జాగ్రత్త” అని హెచ్చరిస్తే, వెంటనే “మా అన్నయ్య అగ్గి లాంటోడు, నిప్పు లాంటోడు, ఆయన ఎవరికీ ట్రై చేయడు” అని పవన్ సమర్థిస్తాడు.దాంతో సిద్ధార్థ వర్మ చుట్టూ ఉన్నవాళ్లు మాత్రం “మన మీద అందరూ పొత్తులు కాల్చుకుంటున్నారు” అంటూ సెటైర్లు వేస్తాడు.
మనమందరం కలిసి మునిగిపోవడమే ఉత్తమం
దీంతో వర్ష అసహనం వ్యక్తం చేస్తూ, “పెళ్లి చేసుకోవాలా వద్దా అని క్లారిటీ అడిగితే మీరేమీ స్పష్టంగా చెప్పకుండా ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నారు” అని అంటారు. దానికి వేదికపై ఉన్న విష్ణు ప్రియ స్పందిస్తూ, “మేము ఆల్రెడీ పెళ్లి అనే సంసార సాగరంలో దిగి మునిగిపోయాం. అందుకే మిమ్మల్ని కూడా ఇందులో ముంచడానికే ఇక్కడికి వచ్చాం! ఈ వినాయక చవితి వేడుకల సాక్షిగా మనమందరం కలిసి మునిగిపోవడమే ఉత్తమం” అని నవ్వులు పూయించింది