Intinti Ramayanam Today Episode August 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని ఆ పెళ్లి కొడుకు వాళ్ళు మోసగాళ్లు అని ఎంత చెప్పినా సరే అక్షయ్ మాత్రం వినడు. నీ తమ్ముడు మాత్రమే మంచోడా ఎవర్ని ఎలా నమ్మలో నాకు బాగా తెలుసు అని అక్షయ్ అవనితో వాదిస్తాడు.. నా చెల్లెలు పెళ్లి మా అమ్మ చూసిన వ్యక్తితోనే జరుగుతుంది అని అక్షయ్ తేల్చి చెప్పేస్తాడు. భరత్ ఏ తప్పు చేయలేదని చెప్పినా సరే అక్షయ్ మాత్రం నా చెల్లి పెళ్లి భరత్ తో చేయడానికి వీల్లేదు అని మొండిగా కూర్చుంటాడు. నా తల్లి నిర్ణయాన్ని నేను కాదనలేను అతనికి ఇచ్చిన చెల్లి పెళ్లి చేస్తాను అని మొండిగా ప్రవర్తిస్తాడు. ఈ తండ్రి చచ్చాడు అనుకున్నావా నా నిర్ణయానికి విలువ ఇవ్వరా అని రాజేంద్రప్రసాద్ ఆవేశపడతాడు. పార్వతి వచ్చి పెళ్లి ఆపండి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. రాజేంద్రప్రసాద్ ప్రణతి పెళ్లి పీటల వరకు వచ్చింది ఇక మనం ఈ పెళ్లిని భరత్ తో చేసేస్తే బాగుంటుందని రాజేంద్రప్రసాద్ పార్వతిని ఒప్పిస్తాడు. పార్వతి పంతులుగారు వాళ్ళిద్దరు పెళ్లిని జరిపించండి అని అంటుంది. ఆ మాట వినగానే పల్లవి, శ్రీయలు ఇద్దరు అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోతారు. అక్షయ్ కూడా ఎంత చెప్పినా పార్వతీ వినడం లేదని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మొత్తానికి ప్రణతి భరత్ల పెళ్లి సవ్యంగా సాగుతుంది.
నా కూతురు పెళ్లి నా ఇష్టం వచ్చినట్టు జరిపించాలని అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదని పార్వతి ఆలోచిస్తూ ఉంటుంది. నా కూతురు కోసం నేను నిన్ను అనుకున్నాను ఇలా జరుగుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అని పార్వతి అనుకుంటుంది. మొత్తానికైతే రాజేంద్రప్రసాద్ కోరిక మేరకు భరత్ ప్రణతిల పెళ్లి సవ్యంగా జరుగుతుంది. వాళ్ళ పెళ్లి అయినందుకు అందరూ సంతోషంగా ఉంటారు. అవని గుడి నుంచి వాళ్ళని ఇంటికి తీసుకుని వెళుతుంది.
స్వరాజ్యం హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్తుంది. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఏది ఏమైనా కూడా అవని అనుకున్నట్లుగానే చేసేసింది అని స్వరాజ్యం అంటుంది. ప్రేమించుకున్న ఈ జంటను అవని ఒక్కటి చేసింది. మాకు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న వదినా అని ప్రణతి అవనితో అంటుంది. ఇంటికొచ్చిన పార్వతి సీరియస్ అవుతారు.
అక్షయ్ పల్లవి ఇద్దరు రెచ్చిపోయి మాట్లాడతారు. నువ్వు ఇలా వచ్చేస్తావని అసలు ఊహించలేదు అత్తయ్య అని పల్లవి అంటుంది. అక్షయ్ కూడా నీకు నచ్చిన వాడితో పెళ్లి చేయాలనే కదా ఇంత చేశాను.. అసలు ఇలా ఎందుకు చేసావ్ అమ్మ అని నేను తీస్తాడు. ఆ దుర్మార్గుడు గురించి పోలీసులు చెప్పగానే షాక్ అయిపోయాను.. ఇలాంటి వాడికి నా కూతుర్ని ఇవ్వకూడదు అని అనుకున్నాను. భానుమతి దాని తలరాత అలా రాసి ఉంది అందుకే అలా జరిగిపోయింది అని అంటుంది. ఇక దీని గురించి ఎవరూ మాట్లాడొద్దు.
కొత్తగా పెళ్లయింది కదా ప్రణతి భరత్లను మన ఇంటికి తీసుకొని వద్దామని నేను అనుకుంటున్నాను అని అంటుంది. భానుమతి కరెక్ట్ నేనేం తీసుకున్నావు పార్వతి అని అంటుంది.. అక్షయ మాత్రం వాళ్ల ముందర నా తలెత్తుకునేలాగా చేసావు అని తల్లి పై సీరియస్ అవుతాడు. పార్వతి మాత్రం అవని వాళ్ళ ఇంటికి వెళ్లి ప్రణతి భరత్లను మన ఇంటికి తీసుకెళ్లామని అనుకుంటున్నాను అని అంటుంది. ఇక హారతి ఇచ్చి భరత్ ప్రణతిలను పార్వతితో పంపిస్తుంది.
Also Read: బాలును ఇరికించేసిన గుణ.. గుండెలు పగిలేలా ఏడ్చిన మీనా.. విడిపోతారా..?
అవని వాళ్ళ ఇంటికి వచ్చిన అక్షయ్ తన లగేజ్ ని తీసుకుని వెళ్లిపోవాలని అనుకుంటాడు. ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు ఏం జరిగిందని మీరు వెళ్లిపోవాలని అనుకుంటున్నానని అవని అంటుంది. వినకుండా అక్షయ్ తన బ్యాగులు తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. సోమవారం ఎపిసోడ్లో ప్రణతి భరత్లను విడగొట్టేందుకు పల్లవి ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…