Jordan Cox: ది హండ్రెడ్ మెన్స్ లీగ్ 2025 టోర్నమెంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్లో 16 మ్యాచ్లు పూర్తికాగా.. జరిగిన ప్రతి మ్యాచ్లో అద్భుతం ఏ జరిగింది. మొన్నటి రోజున బ్రూక్ అద్భుతమైన షాట్స్ తో అదరగొడితే… లేటెస్ట్ గా మరో ఆటగాడు మెరిసాడు. జోర్డాన్ కాక్స్… నిన్నటి మ్యాచ్ లో విధ్వంసం సృష్టించాడు. 300 స్ట్రైక్ రేట్ తో.. బౌలర్లకు చుక్కలు చూపించాడు జోర్డాన్ కాక్స్ ( Jordan Cox ). ఈ నేపథ్యంలోనే 29 బంతుల్లోనే మూడు బౌండరీలు అలాగే 10 సిక్సర్లతో ఏకంగా 86 పరుగులు చేసి దుమ్ము లేపాడు డేంజర్ ఆటగాడు జోర్డాన్ కాక్స్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Praggnanandhaa : నుదిట విభూది పెట్టుకోవడం వెనుక రహస్యం ఇదే.. చెస్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్
300 స్ట్రైక్ రేట్ తో రెచ్చిపోయిన జోర్డాన్ కాక్స్ ( Jordan Cox)
ది 100 మెన్స్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( The Hundred Mens Competition 2025 ) భాగంగా… తాజాగా వైల్స్ ఫైర్ ( Welsh Fire ) వర్సెస్ ఓవల్ ఇన్విన్సిబుల్స్ ( Oval Invincibles) మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో… ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఆటగాడు జోర్డాన్ కాక్స్ అద్భుతమైన సృష్టించాడు. బంతి ఎటు వచ్చిన సిక్సర్లు అలాగే బౌండరీలు బాది చుక్కలు చూపించాడు. ఇలా కూడా బ్యాటింగ్ చేయవచ్చా అన్న రీతిలో రెచ్చిపోయాడు జోర్డాన్ కాక్స్.
ఈ నేపథ్యంలోనే కేవలం 29 బంతులు ఆడి మూడు బౌండరీలతో పాటు 10 సిక్సర్స్ కొట్టేశాడు. దీంతో 86 పరుగులు చేసి రఫ్పాడించాడు. దీంతో అతని స్ట్రైక్ రేట్ 300 కు చేరింది. 86 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు ఈ ఆటగాడు జోర్డాన్ కాక్స్. ఇక ఇతని ఇన్నింగ్స్ దెబ్బకు ఓవల్స్ ఏకంగా 83 పరుగులు తీయడంతో గ్రాండ్ విక్టరీ కూడా కొట్టింది. మ్యాచ్ వివరాలు ఒకసారి పరిశీలిస్తే… ది హండ్రెడ్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ఓవల్ ఇన్వెంన్సిబుల్స్, వర్సెస్ వెల్స్ ఫైర్ మధ్య 16వ మ్యాచ్ జరిగింది.
ఇక ఈ మ్యాచ్ లో మొదట ఓవల్ బ్యాటింగ్ చేసి 100 ఓవర్ల లో నాలుగు వికెట్లు నష్టపోయి 226 పరుగులు చేసింది. ఇందులో విల్ జాక్స్ 38 పరుగులు చేయగా… మూయేయే 33 పరుగులు సాధించాడు. జోర్డాన్ కాక్స్ ముందుగా చెప్పుకున్నట్లు 86 పరుగులు తీసి నాటౌట్ గా నిలిచాడు. సామ్ కరణ్ 34 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. డోనో వన్ 18 పరుగులు చేయగా టామ్ కరణ్ 5 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ప్రత్యర్థి జట్టు వెల్స్ ఫైర్… 93 ఓవర్సలో 143 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. దీంతో…. ఈ మ్యాచ్ లో ఓడిపోయింది వెల్స్ ఫైర్. ఏకంగా 83 పరుగుల తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. జోర్డాన్ కాక్స్ కారణంగానే ఈ విజయం సాధించింది ఓవల్ టీం.
Also Read: Neeraj Chopra’s wife : నీరజ్ చోప్రా భార్యకు పట్టిన దరిద్రం.. 1.5 కోట్ల జాబ్, సర్వం కోల్పోయిందిగా!
FOUR SIXES IN FIVE BALLS 🤯
Jordan Cox, that is sensational 🤩#TheHundred pic.twitter.com/xiWDnXpaf8
— The Hundred (@thehundred) August 16, 2025