Intinti Ramayanam Today Episode August 2nd : నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతి ప్రణతికి తెచ్చిన పెళ్లి సంబంధం గురించి బయట పెడుతుంది. తాను తెచ్చిన సంబంధం నే ప్రణతికి చేస్తానని అంటుంది పార్వతి.. కానీ రాజేంద్రప్రసాద్ ఎంత చెప్తున్నా కూడా పార్వతి తన మాట వినకుండా ఉంటుంది. కూతురికి తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేస్తానని తెగేసి చెప్పేస్తుంది. అవని ఎంత చెప్తున్నా సరే పార్వతీ మాత్రం వినకుండా.. నా కూతురు జీవితం నా ఇష్టం అంటూ వాదిస్తుంది. ప్రణతి నా ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు ఏ సంబంధం తెచ్చిన నేను చేసుకోను అని తెగేసి చెప్పేస్తుంది. పార్వతి మాత్రం నీకేం తెలీదు నువ్వు చిన్నపిల్లవి నేను చెప్పినట్లే నువ్వు వినాలి అని రచ్చ రచ్చ చేస్తుంది. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ నా కూతురు ఇష్టప్రకారమే తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. నీకు ఎంత అధికారం ఉందో నా కూతురు విషయంలో నాకు అంతే అధికారం ఉంది అని అంటాడు. అవని అడిగితే నా కూతురు పెళ్లి చేసుకోవడానికి నీ పర్మిషన్ తీసుకోవాలని రెచ్చిపోతుంది. మొత్తానికి గొడవ అయితే గట్టిగానే జరుగుతుంది. ప్రణతిని తీసుకొని అవని, రాజేంద్ర ప్రసాద్ అక్కడ నుంచి వెళ్లిపోతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పార్వతి నిర్ణయాన్ని అందరూ కాదని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పార్వతీ మాత్రం తనకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ బాధపడుతుంది తన కన్న కూతురు తన మాట వినలేదని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది..తల్లి బాధను చూసి అక్కడికి వచ్చిన అక్షయ్.. తనకి మాటిస్తాడు. నీ మాట ప్రకారమే నేను నువ్వు కోరుకున్న వాడితో చెల్లి పెళ్లి చేసేలా చేస్తాను అని మాటిస్తాడు. అక్షయ్ అవని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు.. అవని దగ్గరకు వెళ్లినా అక్షయ్ వాళ్లకి ఫేవర్ గా మాట్లాడుతాడు. పెళ్లి గురించి మీకు ముందే చెబుదామని అనుకున్నాను అని అవని అంటుంది. వాళ్ళ అమ్మ ప్లాన్ ప్రకారం అక్షయ్ వచ్చాడన్న విషయం తెలియక వాళ్ళు అక్షయ్ ని నమ్ముతారు. ప్రణతి అన్నయ్య ఒప్పుకుంటాడని అస్సలు అనుకోలేదు నాన్న. నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నయ్య అంత ధైర్యం ఇచ్చిన తర్వాత నేను ఇంక భయపడాల్సిన అవసరం లేదు అని అంటుంది.
అక్షయ్ ఇలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతాడని అస్సలు అనుకోలేదు. వీడు నిజంగానే ఇలా అంటున్నాడని రాజేంద్రప్రసాద్ కూడా ఆశ్చర్యపడతాడు. అయితే అక్షయ్ భరత్ కి జాబ్ చూసుకోమని చెప్తాడు.. మా అమ్మ వద్దనక పోవడానికి ఒక కారణం ఉంది. నీకు ఏ జాబ్ లేదు భార్యని పోషించగల సత్తా లేదు అని ఆలోచిస్తుంది. నువ్వు ఉద్యోగం తెచ్చుకుంటే నేను మా అమ్మతో వెళ్లి మాట్లాడి ఒప్పిస్తాను అని అంటాడు.. ప్రేమించుకున్నారు విడగొట్టాలన్న ఆలోచన నాకు లేదు ముందు ఉద్యోగం తెచ్చుకో భరత్ అని అక్షయ్ చెప్తాడు.
పార్వతి మాత్రం తన కూతురు తనని ఎదిరించిందన్న మాటను దలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో ఏం జరిగిందో తలుచుకొని కుమిలిపోతూ ఉంటుంది.. ఇప్పుడు అక్కడికి వచ్చినా పల్లవి ఏంటది మీరు బాధపడుతున్నారా అని అడుగుతుంది. మీ కన్న కూతురు మిమ్మల్ని ఎదిరించి మాట్లాడటం నీకు బాధగానే అనిపిస్తుంది. ప్రణతి ఇంకా అవని దగ్గర ఉంటే తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తుంది. అక్కడ ఏం జరిగిందో బావ గారికి ఒక సారి ఫోన్ చేసి అడగండి అని పల్లవి అంటుంది. అక్షయ్ కు పార్వతికి ఫోన్ చేసి వాళ్లు నమ్మారు అన్న విషయాన్ని చెప్తాడు..
Also Read: మీనా కొత్త వ్యాపారం.. ప్రభావతిని ఆడుకున్న కామాక్షి.. అడ్డంగా దొరికిపోయిన రోహిణి..
వాళ్లు ఇప్పుడే ప్రణతికి పెళ్లి చేయకుండా ఒక విషయం చెప్పానమ్మా అని అక్షయ్ అంటాడు. ఏంట్రా అది అని అడుగుతుంది. ముందు భరత్ కి జాబ్ తెచ్చుకోమని చెప్పండి తర్వాతే పెళ్లి చేస్తాము అని చెప్పాను. నీకు ఇంకా టైం ఉంది కదా అమ్మ నువ్వేం భయపడకు నీకు నచ్చిన అబ్బాయి తోనే నువ్వు పెళ్లి చేద్దువు అనేసి భరోసా ఇస్తాడు.. పార్వతి అక్షయ మాట చెప్పగానే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అయితే పల్లవి మాత్రం బావగారి అలా చెప్పినా కూడా ప్రణతినీ అంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం ఇక్కడికి తీసుకురావాలి అని అడుగుతుంది.. పార్వతి పల్లవి చెప్పిన విషయాన్ని ఆలోచిస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..