BigTV English

Chandrababu Cabinet: నాగబాబు కాలం కలిసొచ్చింది.. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా ఛాన్స్

Chandrababu Cabinet: నాగబాబు కాలం కలిసొచ్చింది.. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా ఛాన్స్

Chandrababu Cabinet: కలిసొచ్చే కాలం వస్తే.. నడిసొచ్చే కొడుకు పుడతాడని పెద్దలు చెబుతారు. ఆ మాట ఏమో గానీ జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాబుకు మాత్రం కాలం కలిసొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే డైరెక్ట్‌గా చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.


నాగబాబుకు కాలం కలిసొచ్చింది. పార్లమెంటుకు వెళ్లాలని చాన్నాళ్లుగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు పెద్దల సభలో ఛాన్స్ వస్తుందని గంపెడంత ఆశలు పెట్టుకున్నారు. అక్కడా కాలం కలిసిరాలేదు. ఏకంగా చంద్రబాబునాయుడు కేబినెట్‌లో ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

రీసెంట్‌గా ఏపీలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. వైసీపీకి చెందని ముగ్గురు నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారిలో బీద మస్తాన్‌రావు ఒకరు. రాజీనామా చేసినప్పుడు ఆయనకు సీఎం చంద్రబాబు మాట ఇవ్వడంతో ఆయనను పెద్దల సభకు మళ్లీ పంపిస్తున్నారు. మరొకటి కాకినాడకు చెందిన సానా సతీష్‌కు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది.


ఆర్.కృష్ణయ్యకు బీజేపీ సీటు కేటాయించింది. దీంతో పెద్దల సభకు వెళ్లాలన్న నాగబాబు ఆశలు అడియాశలయ్యాయి. ఈ క్రమంలో మంత్రివర్గంలోకి నాగబాబు తీసుకుంటు న్నట్లు సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు.

ALSO READ: పవన్ ను బెదిరించిన ఆగంతకుడు.. ఎట్టకేలకు పోలీసుల చిక్కాడు.. అతడెవరంటే?

2019లో నరసాపురం నుంచి లోక్‌సభకు పోటీ చేశారు నాగబాబు. వైసీపీ వేవ్‌లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. అక్కడ ఇల్లు కూడా తీసుకున్నారు. పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్లడం, అక్కడి నుంచి సీఎం రమేష్ పోటీ చేసి గెలుపొందడం జరిగిపోయింది.

ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ముగ్గురు వైసీపీ నేతలు తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాలు చేశారు. దీంతో పెద్దల సభకు నాగబాబు వెళ్లడం ఖాయమనే ప్రచారం సాగింది. అంతకు ముందు నాగబాబు టీటీడీ పదవి వస్తుందంటూ జోరుగా ప్రచారం సాగింది. రాజ్యసభ సీటు కోసం డిప్యూటీ సీఎం పవన్.. ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో మాట్లాడారని వైసీపీ నుంచి విమర్శలు మొదలయ్యాయి. దీనిపై నాగబాబు స్వయంగా కౌంటరిచ్చారు.

ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో కేవలం ఒక్కటి మంత్రి బెర్త్ ఖాళీగా ఉంది. దాన్ని నాగబాబుకు కేటాయిస్తున్నారు. ఇంతకీ ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారు? అనేదానిపై పొలిటికల్ సర్కిల్స్ చిన్నపాటి చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పలువురు మంత్రుల శాఖలు మారే అవకాశముందని అంటున్నారు. మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సివుంది ఉంటుంది నాగబాబు.

మార్చిలో కొన్ని ఎమ్మెల్సీలు  ఖాళీ అవుతున్నాయి. వాటిలో ఒకటి నాగబాబు కేటాయించనున్నారు. అంతకుముందుగానే మంత్రిగా బాధ్యతలు చేపడతారా? ఎమ్మెల్సీ తర్వాత తీసుకుంటారా? అనేది తేలాల్చివుంది. దీనిపై సీఎం చంద్రబాబు-డిప్యూటీ సీఎం పవన్ మధ్య ఆల్రెడీ చర్చ జరిగిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నాగబాబు మంత్రిగా బాధ్యతలు చేపడితే.. మెగాస్టార్ బ్రదర్స్ అంతా మంత్రులుగా పని చేసిన ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకోనుంది. గతంలో చిరంజీవి కేంద్ర టూరిజం మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం పవన్‌కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న విషయం తెల్సిందే.

Related News

Auto Drivers Sevalo: ఆటో డ్రైవర్ల సేవలో.. జగన్ కోలుకోవడం కష్టం

Chandrababu OG: ఓజీ ఓజీ ఓజీ.. ‘ఆటో డ్రైవర్ల సేవలో’ బాహుబలి సీన్ రిపీట్, చంద్రబాబు ఏం అన్నారంటే?

AP Social Media: సోషల్ మీడియాపై నియంత్రణ.. కూటమి వ్యూహం, వైసీపీ ప్రతి వ్యూహం

TDP Leader Arrest: నకిలీ మద్యం కేసులో.. టీడీపీ నేత సురేంద్ర బాబు అరెస్ట్

Auto Driver Sevalo Scheme: ఆటోల్లో చంద్రబాబు, పవన్.. ఆ స్వాగ్ చూడు తమ్ముడు

Vijayawada News: ‘ఆటోడ్రైవర్ సేవలో’ పథకం ప్రారంభం.. మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు

Ambati Rambabu: అమెరికాలో అంగరంగ వైభవంగా.. అంబటి రాంబాబు కూతురు పెళ్లి, రిసెప్షన్ ఎక్కడ?

Amaravati News: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఇక మీరెందుకు? కళ్లెం వేయాల్సిందే

Big Stories

×