Intinti Ramayanam Today Episode December 2nd : నిన్నటి ఎపిసోడ్ లో.. అవని వల్ల పల్లవికి అబార్షన్ అవ్వలేదని అక్షయ్ కు ఎంత చెప్పినా వినడు. ఇక అవని ఉదయం చక్రధర్ ఇంటికి వెళ్లి పల్లవిని కలవాలని వెళ్తుంది. రాజేశ్వరికి అవని చెప్తుంది. దాంతో పల్లవికి రాజేశ్వరి వార్నింగ్ ఇస్తుంది. నీ బిడ్డను చంపే ప్రయత్నాలు చేస్తే నిన్ను నేను చంపేస్తాను.. కూతురు అని కూడా చూడను.. నువ్వు ఇలా నీ బిడ్డను చంపాలని అనుకుంటే మాత్రం సహించేది లేదు అని నిన్ను ఏమి చేస్తానో నాకే తెలియదు అని వార్నింగ్ ఇస్తుంది. అమ్మ కోపాన్ని చూసి షాకైన పల్లవి చక్రధర్ దగ్గరికి వెళుతుంది. ఎందుకు ఏమైంది అనేసి పల్లవిని చక్రధర్ అడుగుతాడు. నీ ఆబార్శన్ ప్లాన్ ఫెయిల్ అవ్వడం తో ఫీల్ అవుతున్నావా అనేసి అడుగుతాడు. ఇకమీదట ఇలాంటి ప్లాన్లు వద్దు డాడీ నా బిడ్డని నేను చంపాలనుకోవట్లేదు అని పల్లవి. ఆ మాట వినగానే చక్రధర్ షాక్ అవుతాడు. శ్రీకర్ ను ఇంట్లోంచి పంపేసాము. ఇక అవని అక్షయ్ కూడా ఇంట్లోంచి పంపించేస్తే నా బిడ్డ ఆ ఇంటికి రా రాజు నేనే కదా ఆ ఇంటికి మహారాణి అని అంటుంది.. ఇంట్లో ఇద్దరు కొడుకులు లేకపోతే సన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ అన్ని వస్తాయని ఇక ఉదయం ఇంట్లో అందరూ పల్లవి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అవని హారతి తీస్తుంటే కమల్ వాళ్ళ బామ్మ హారతి తీయద్దని వాదిస్తుంది. కడుపు పోవడానికి కారణమైన తనతోనే హారతి తీర్చడం ఏంటి అని పార్వతిపై మండిపడుతుంది. అవని బాధ పడుతుంది. కమల్ వదిన హారతి తీస్తేనే లోపలికి వస్తామని అంటాడు. ఇక అవని హారతి తీస్తుంది. పల్లవి, అమ్మమ్మ కలిసి ప్లాన్ వేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి దగ్గరకు వాళ్ళ అమ్మమ్మ డ్రై ఫ్రూట్స్ తీసుకొని వెళ్తుంది. ఇకమీదట ఏం కావాలన్నా నన్నే అడుగు ఆ అవనిని అడగకు అనేసి చెప్తుంది. బామ్మ ని ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలని పల్లవి ప్లాన్ మనసులో అనుకుంటుంది. బామ్మ కు లేనిపోనివి నూరిపోసి అవని పై అనుమానం వచ్చేలా చేస్తుంది. ఇక ఇద్దరు కలిసి అవనీని ఇంట్లోంచి పంపించడం ఎలా అని స్కెచ్ వేస్తారు. అప్పుడే కమల్ వస్తాడు. కమల్ కు తెలియనివ్వకూడదు అని ఏదోకటి సర్ది చెప్తారు.. ఇక కమల్కు బామ్మ చాలెంజ్ విసురుతుంది . నువ్వు నిజంగానే అంత మగాడివైతే నీ పెళ్ళానికి చీర గట్టి చూపించు అనేసి అంటుంది. ఇక ఆరాధ్య తన ఫ్రెండు బయట పెయింట్ వేస్తుంటే అవి గోడల మీద పెయింట్ వేస్తారా అనేసి అరిచి లోపలికి పంపిస్తుంది అవని. వాళ్ళు లోపలికి వెళ్ళగానే ఆ పెయింట్ ను క్లీన్ చేస్తూ ఉంటుంది. అది చూసిన పల్లవి ఇంట్లో ఇంత ప్రశాంతంగా ఉంటే బాగోలేదు అసలు ఏదో ఒకటి జరగాలని పైనుంచి ఫ్లవర్ వాస్ ను కింద పడేస్తుంది. కింద కూర్చొని ఉన్న అక్షయ్ పై కాకుండా పక్కన పడుతుంది. ఆ సౌండ్ కు అందరు అక్కడకు వస్తారు.. ఏమైందని అడుగుతారు. అవని కూడా కిందకు వస్తుంది. ఏమైందని అడుగుతుంది.
ఇక బామ్మ అవనిని తిడుతుంది.. ఈ మధ్య నిన్ను గమనిస్తూనే ఉన్నా నువ్వు ఏం చేసిన చెల్లుతుంది అనుకుంటున్నావు కదా.. ఇంట్లో ఎవరు నిన్ను అడగటం లేదని ఇష్టానుసారంగా చేస్తున్నావ్ అని అంటుంది. అక్షయ్ కూడా అవనిని అందరి ముందు తిట్టి వెళ్ళిపోతాడు. ఈ సీన్ చూసి పల్లవి తెగ సంబరపడిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. నిన్ను నా మనువడు తిట్టడంలో తప్పులేదు అని అరుస్తుంది. వినోద్ ఎదో పొరపాటున పడింది అక్క నువ్వు ఫీల్ అవ్వకు అంటారు. అందరు అవనికి సపోర్ట్ గా ఉంటారు.. పల్లవి చక్రధర తో ఇంట్లో జరిగిన విషయాన్ని చెప్తుంది. ఈరోజు ఇలా జరుగుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది అని ఇద్దరు నవ్వుకుంటారు. తన తండ్రి తో మాట్లాడటం అవని వింటుంది. ఎవరితో మాట్లాడుతున్నావ్ పల్లవి ఫోను మీ డాడీ తోని నా ఇంట్లో జరిగిన విషయాలను అక్కడికి మోస్తున్నావా. నీ గురించి ఏది చెప్పినా ఇంట్లో పరువు పోతుందని నీకు ఏదైనా అవుతుందని ఆలోచిస్తున్నాను తప్ప శ్రీకర్ని నీకు దూరం చేశానని నా మీద పగ పెంచుకున్నావ్ నన్ను ఇది చేయాలని చూస్తున్నావో నీ గురించి చెప్తే నీకే ఇది అవుతుందని ఆలోచిస్తున్నా అది గుర్తుపెట్టుకో అనేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.
రూమ్ లోకి వెళ్లిన కమల్ చీర కట్టుకోవడం పెద్ద బ్రహ్మ విద్య ఏంటి అనేసి ముసలానికి చీర కట్టుకొని చూపిస్తా అనేసి చీర కట్టుకోవడం ప్రాక్టీస్ చేస్తాడు. చీర చుట్టుకుంటుంటే వినోద్ చూస్తాడు. ఆ విషయం నీకు కోమలికి చెప్తాడు. మీ తమ్ముడు కొంచెం తేడాగాడు అనేసి అనగానే కోమలి కోప్పడుతుంది. కోపడ్డం ఏంది నువ్వే వచ్చి ఒకసారి చూడు అనేసి అంటాడు. కోమలి కమలి చీరలో చూసి షాక్ అవుతుంది. చీర ఒకటే సరిపోతుందా గాజులు కూడా తెచ్చి ఇవ్వమంటావా ఏంట్రా ఈ అవతారం అనేసి అడుగుతుంది. చీర కట్టుకొని బామ్మె ఏం చేసిందని కమల్ చెప్తాడు.. అమ్మ నిజం చెప్పడంతో వినోద్ కోమలి రిలాక్స్ అవుతారు..
ఇకపోతే పార్వతి రాజేంద్రప్రసాద్ నిద్రపోతుంటారు. ఇంట్లో జరిగిన విషయాలన్నీ పార్వతి కలలో గుర్తొస్తాయి. ఇంట్లో ఏదో జరుగుతుంది ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోయిందనేసి బాధపడుతుంది. నిద్రలో ఉలిక్కిపడి లేస్తుంది. పక్కనే ఉన్న రాజేంద్రప్రసాద్ ఏమైంది పార్వతి నిద్ర పట్టడం లేదా అనేసి అడుగుతాడు. ఇంట్లో జరుగుతున్న వాటిని చూస్తుంటే నాకు నిద్ర రావట్లేదండి అసలు ఏదో జరుగుతుంది ఒకసారి స్వామీజీని అడిగితే మంచిదే కదా అనేసి అంటుంది. నాకు అదే అనిపిస్తుంది పార్వతి ఇంట్లో ప్రతిదీ కావాలని ఏదో చేస్తున్నట్లు అనిపిస్తుంది అనేసి రాజేంద్రప్రసాద్ కూడా అంటాడు. ఉదయం లేవగానే స్వామీజీ ఇంటికి వస్తాడు. అందరూ ఆశీర్వాదం తీసుకోమని రాజేంద్రప్రసాద్ చెప్తాడు. అందరూ వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారు. పల్లవిని చూడగానే స్వామీజీ షాక్ అవుతాడు. ఇంట్లో జరుగుతున్న పరిస్థితులన్నిటికీ ఒక దుష్ట శక్తి కారణం ఆ దుష్టశక్తి ఇంట్లో తిరగడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అనేసి స్వామీజీ పల్లవికి షాక్ ఇస్తాడు. స్వామిజీ చెప్పిన మాటలకి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి ఎపిసోడ్ లో పల్లవి గురించి నిజం చెప్తాడా లేకపోతే పల్లవిని దూరంగా ఉంచమని చెప్తాడు అనేది చూడాలి..